ఆశ్చర్యపరిచే రీతిలో ఉండనున్న ఎవడు ట్రైలర్

Published on Jun 27, 2013 11:50 pm IST

Yevadu-(4)
రామ్ చరణ్ తాజా చిత్రం ‘ఎవడు’ ఈ ఏడాదికి విడుదలకానున్న సినిమాలలో అత్యంతగా ఎదురుచూస్తున్న వాటిల్లో ఒకటి. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్ లో రామ్ చరణ్ లుక్స్, పకడ్బంది సీన్స్ ప్రేక్షకులను అలరించాయి. ప్రస్తుతం అందరి కళ్ళు 30న హైదరాబాద్లో విడుదలకానున్న ఆడియో మీద ఉన్నాయి. పాటలేకాక ఈ సినిమా ట్రైలర్ కూడా ఫాన్స్ ను పరమానందంలో ముంచెత్తుతుందని వినికిడి.

ఈ ట్రైలర్ ను ముందుగానే చుసిన హరీష్ శంకర్ ఈ విధంగా ట్వీట్ ఇచ్చాడు “ఇప్పుడే ‘ఎవడు’ ట్రైలర్ చూసాను .. ప్రతీ ఫ్రేమ్, ప్రతీ సెకండ్ మైండ్ బ్లోయింగ్. నా నిర్మాత దిల్ రాజుకు ముందుగానే శుభాకాంక్షలు” . ట్రైలర్ చుసిన వారందరూ ఈ విధంగానే స్పందించడం గమనార్హం. ఈ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకుడు. దిల్ రాజు నిర్మాత. ప్రస్తుతం రామ్ చరణ్ , శృతి హాసన్ పై ఒక పాటను హైదరాబాద్లో తీస్తున్నారు. యామి జాక్సన్ మరో హీరోయిన్. దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. ఈ సినిమా జూలై 26న విడుదలకానుంది

సంబంధిత సమాచారం :