టాలీవుడ్ లో కొత్తరకం ట్యూన్ లతో, వెరైటీ ఆల్బంలతో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరుచుకుంటున్న సంగీత దర్శకుడు ఘిబ్రన్. యాడ్ ఫిలిమ్ లతో తన కెరీర్ ప్రారంభించిన ఘిబ్రన్ కి టాలీవుడ్ లో రన్ రాజా రన్ సినిమా మంచి మలుపునిచ్చింది. ఇటీవలే గోపీచంద్ జిల్ కి కూడా వెస్ట్రన్ మ్యూజిక్ తో అలరించాడు
ప్రస్తుతం ఘిబ్రన్ చేతిలో మూడు కమల్ సినిమాలు వున్నాయి. విశ్వరూపం 2, ఉత్తమ విలన్, పాపనాశం చిత్రాలు వివిధ దశలలో ఘిబ్రన్ సంగీతంలో వున్నాయి. ఇది కూడా ఒక విశేషమనే చెప్పాలి
తాజా సమాచారం ప్రకారం టాలీవుడ్ ఫిలిం మేకర్లు కొందరు భారీ బడ్జెట్ సినిమాల కోసం ఘిబ్రన్ ను ఎంచుకున్నారట. ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ టాప్ సంగీత దర్శకుల జాబితాలోకి త్వరగా చేరిపోవాలని ఆశిద్దాం


