నాని స్ఫూర్తితోనే సినీ ఆరంగేట్రం – యంగ్ టాలెంటెడ్ యాక్టర్

Published on Nov 12, 2019 7:06 pm IST

ఎలాంటి సినీ నేప‌థ్యంతో పాటు ఆర్ధిక బలం కూడా లేకుండా ఇండస్ట్రీలో రాణించటం అనేది టాలెంట్ ఉన్న అందరికీ చేతనైన పని కాదు. అయితే ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండానే ప‌రిశ్ర‌మ‌లో రాణిస్తున్న అతికొద్దిమందిలో ఈ మధ్య ఓ యంగ్ టాలెంటెడ్ యాక్టర్ పేరు బాగానే వినిపిస్తోంది. ‘మిర్చి లాంటి కుర్రాడు, స‌ప్త‌గిరి ఎక్స్ ప్రెస్, నేనే కేడీనంబ‌ర్ వ‌న్, నాలుగో సింహం’ స‌హా ప‌లు చిత్రాల్లో ప్ర‌తినాయ‌కుడిగా న‌టించి మెప్పించిన దేవ‌న్.. ఈ మధ్య వరుస అవకాశాలను అందుకుంటూ వరుస సినిమాలతో బిజీ యాక్టర్ గా మారిపోయాడు.

యాక్టింగ్ పై ఇష్టంతో ఎంతో హార్డ్ వ‌ర్క్ చేస్తున్న దేవన్ కి, జూనియర్ నాని అన్న ప్ర‌శంస‌లు కూడా అందుతున్నాయని చెబుతున్నాడు దేవన్. తానూ నాని పుట్టిన ఊరు చ‌ల్ల‌ప‌ల్లి నుండే నాని స్ఫూర్తితోనే సినీ ఆరంగేట్రం చేశాన‌ని.. ప్రస్తుతం తానూ ఇన్ఫోసిస్‌ లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా జాబ్ చేస్తున్నానని అలాగే సినిమాల్లోనూ యాక్ట్ చేస్తున్నానని.. జాబ్ జేబు కోసం, సినిమాలు మనసు కోసం అని అంటున్నాడు దేవన్.

ఏమైనా ట్రెండ్ ని ఫాలో అవుతూ 6 ప్యాక్ లుక్‌ తో చ‌క్క‌ని దేహ‌దారుఢ్యాన్ని మెయింటెయిన్ చేస్తూ.. డ్యాన్సులు ఫైట్స్ లో రాణించ‌డంతో దేవన్ కు బాగానే అవ‌కాశాలు ద‌క్కుతున్నాయి. మరి ఆ అవకాశాలను తన విల‌క్ష‌ణ‌మైన నటనతో దేవన్ ఉపయోగించుకోవాలని ఆశిద్దాం.

సంబంధిత సమాచారం :

More