
‘ఉయ్యాల జంపాల’, ‘సినిమా చూపిస్త మావా’, ‘కుమారి 21F’.. ఇలా వరుసగా హ్యాట్రిక్ హిట్స్‌తో తెలుగులో అతికొద్ది మందికే సాధ్యమైన రికార్డ్ ని కెరీర్ మొదట్లోనే అందుకున్న హీరో రాజ్ తరుణ్ నుంచి వస్తున్న తదుపరి సినిమా ‘సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు’. జనవరి 29న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కావడానికి సిద్దమైన ఈ సినిమా ద్వారా మలయాళ బ్యూటీ ఆర్తన బిను హీరోయిన్ గా పరిచయం కానుంది. పలు ప్రయత్నాల తర్వాత చాలా మందికి హీరోయిన్ ఆఫర్స్ వస్తుంటాయి కానీ ఆర్తనకి మాత్రం ఫేస్ బుక్ ద్వారా ఆఫర్ వచ్చింది.
రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆర్తన మాట్లాడతూ ‘తన ఫేస్ బుక్ ప్రొఫైల్ లోని ఫోరోలని చూసి ఈ చిత్ర టీం నన్ను అప్రోచ్ అయ్యారు. నేను సినిమాల్లో ఎంటర్ అవ్వడానికి ఆసక్తిగా ఉండడంతో ఓకే చెప్పాను. కానీ నా మీదే సినిమా జరిగే లాంటి పాత్రలకి కెరీర్ మొదట్లో న్యాయం చేయలనేమో అని కాస్త భయం ఉండేది కానీ కథ విన్నాక చేయగలను అనే నమ్మకం వచ్చి ఈ సినిమా చేసానని’ అంటోంది.
శ్రీశైలేంద్ర ప్రొడక్షన్స్ పతాకంపై ఎస్.శైలేంద్రబాబు, కెవీ శ్రీధర్ రెడ్డి, హరీష్ దుగ్గిశెట్టిలు నిర్మించిన ఈ సినిమాకు శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో టాలెంటెడ్ డైరెక్టర్ ఎన్.శంకర్ రాజ్ తరుణ్ కి ఫాదర్ పాత్రలో కనిపిస్తాడు.