‘సీతమ్మ వాకిట్లో సిరిమేల్లె చెట్టు’ సినిమాలో ‘నాక్కొంచం కాస్ట్ ఫీలింగ్ ఎక్కువ.. ఓ గ్రూప్ కూడా మెయిన్టైన్ చేస్తున్నా’ అంటూ మహేష్ బాబుతో సందడి చేసిన యువ నటి తేజశ్వి. ఐస్ క్రీమ్ సినిమాతో హీరోయిన్ గా మారి పలు సినిమాలు చేస్తున్న తేజశ్వికి మరో సారి బంపర్ ఆఫర్ తలుపు తట్టింది. అదే సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి మరో సినిమాలో నటించే అవకాశం రావడం. మహేష్ బాబు చేస్తున్న ‘శ్రీమంతుడు(వర్కింగ్ టైటిల్)’ సినిమా ప్రస్తుతం సెట్స్ పై ఉంది. ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్ర కోసం తేజశ్విని ఎంపిక చేసారు. ఇటీవలే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చే సీన్స్ ని రామోజీ ఫిల్మ్ సిటీలో షూట్ చేసారు.
మహేష్ బాబుతో రెండోసారి చాన్స్ రావడం చాలా ఆనందంగా ఉందని, అలాగే మహేష్ తో ఎప్పుడు చేసిన చాలా కొత్తగా ఉంటుందని తేజశ్వి తన ఆనందాన్ని సోషల్ మీడియాలో పంచుకుంది. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ నెల 31న ఈ సినిమా ఫస్ట్ లుక్ మరియు అఫీషియల్ టైటిల్ ని అనౌన్స్ చేయనున్నారు. మైత్రి మూవీస్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. జగపతి బాబు, సుకన్య, రాహుల్ రవీంద్రన్, పూర్ణ, అంగన రాయ్, సనమ్ శెట్టి ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా జూలై 17న రిలీజ్ కానుంది.


