ఆ టాలెంటెడ్ డైరెక్టర్ తో బన్ని సినిమా ?
Published on Oct 31, 2017 5:00 pm IST

హీరో అల్లు అర్జున్ ప్రస్తుతం వక్కంతం వంశి దర్శకత్వంలో ‘నా పేరు సూర్య’ సినిమాలో నటుస్తున్నాడు. ఈ సినిమా తరువాత లింగు స్వామి ప్రాజెక్ట్ కాస్త వాయిదా పడిందని తెలుస్తుంది. అలాగే విక్రమ్ కుమార్ తో కూడా ఒక సినిమా ఉండబోతుందని వచ్చిన వార్తలు కూడా అవాస్తవాలని సమాచారం. తాజాగా యువ హీరోతో బన్నీ సినిమా చెయ్యబోతున్నట్లు తెలుస్తోంది.

ఎక్కడికి పోతావు చిన్నవాడ సినిమాతో మంచి విజయం అనుకోని తాజాగా అల్లు శిరీష్ తో ఒక సినిమా చేస్తున్న వి. ఐ ఆనంద్ అల్లు అర్జున్ తో సినిమా చెయ్యబోతున్నట్లు తెలుస్తుంది. ఈ మధ్యనే వి.ఐ ఆనంద్ బన్నీ కి ఒక లైన్ వినిపించాడని అది బన్నీకి నచ్చిందని టాక్. అన్ని కుదిరితే నాపేరు సూర్య సినిమా తరువాత అల్లు అర్జున్ గీత ఆర్ట్స్ లో ఈ సినిమా చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమాకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం వి.ఐ ఆనంద్ అల్లు శిరీష్ తో చేస్తున్న సినిమా డిసెంబర్ లో విడుదల కానుంది.

 
Like us on Facebook