కరోనా సోకి ప్రముఖ హీరో తండ్రి మరణం.

Published on Jul 9, 2020 7:36 am IST

హైదరాబాద్ లో కరోనా విలయతాండవం చేస్తుంది. లాక్ డౌన్ సడలింపులు అనంతరం దీని వ్యాప్తి అధికమైపోయింది. రోజుకు వేలల్లో కరోనా కేసులు అక్కడ బయట పడుతున్నాయి. అనేక మంది ఈ మహమ్మారి బారినపడి మరణిస్తున్నారు. చిత్ర పరిశ్రమలో కొందరు కరోనా బారిన పడ్డారు. సీనియర్ నిర్మాత పోకూరి రామారావు కరోనా కారణంగా మరణించిన సంగతి తెలిసిందే. తాజాగా చిత్ర పరిశ్రమకు చెందిన మరో ప్రముఖుడు కరోనాతో పోరాడి మరణించారు.

మారుతీ దర్శకత్వంలో 2012లో వచ్చిన ఈరోజుల్లో చిత్ర హీరో శ్రీ తండ్రి మంగం వెంకట దుర్గా రామ్ ప్రసాద్ నిన్న కోవిడ్ వ్యాధి తో మృతి చెందారు. గత 20 రోజులుగా విజయవాడలోని ప్రముఖ హాస్పటల్లో చికిత్స పొందుతున్న ఆయన నిన్న రాత్రి8:30 నిముషాల కు తుదిశ్వాస విడిచారు. దీనితో వారి కుటుంబం విషాదంలో మునిగిపోయింది.

సంబంధిత సమాచారం :

More