యువహీరో సినిమా విడుదల తేది ఫిక్స్ !
Published on Feb 18, 2018 11:07 am IST

తెలుగు తెరపై కొత్త ప్రయోగం నీది నాది ఒకే కథ. శ్రీ విష్ణు హీరోగా నటిస్తోన్న ఈ సినిమాను వేణు ఉడుగుల దర్శకత్వం వహించారు. షూటింగ్ పార్ట్ పూర్తి అయిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ కు మంచి స్పందన లభించింది. నారా రోహిత్ ఈ సినిమాలో గెస్ట్ రోల్ లో కనిపించబోతునట్లు సమాచారం.

ఈ సినిమాను చూసిన దర్శకుడు దేవకట్టా సినిమా బాగుందని మెచ్చుకోవడం జరిగింది. ఆడియన్స్, సినీ జనాలు ఈ సినిమా విడుదల కోసం ఎదురుచూస్తున్నారు. తాజా సమాచారం మేరకు ఈ మూవీ మర్చి రెండో వారంలో విడుదల కానుందని తెలుస్తోంది. ఇటీవల విడుదలైన శ్రీ విష్ణు మెంటల్ మదిలో మంచి విజయం సాధించడంతో ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. సురేష్ బొబ్బిలి సంగీతం అందించిన ఈ సినిమాకు నాగేశ్వర్ రెడ్డి బొంతల ఎడిటర్ గా పని చేసారు.

 
Like us on Facebook