ఓటిటిలో 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ తో దూసుకెళ్తున్న యంగ్ హీరో రొమాంటిక్ ఎంటర్టైనర్

ఓటిటిలో 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ తో దూసుకెళ్తున్న యంగ్ హీరో రొమాంటిక్ ఎంటర్టైనర్

Published on Mar 23, 2024 10:08 PM IST

తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన సుమ కనకాల, రాజీవ్ కనకాల దంపతులు ఆడియన్స్ అందరికీ ఎంతో సుపరిచితం. ఇక యాంకర్ గా సుమ ఎన్నో ఏళ్లుగా మనల్ని అలరిస్తూ మంచి పేరుతో కొనసాగుతున్నారు. ఇక ఇటీవల వారి తనయుడు రోషన్ తొలిసారిగా బబుల్ గమ్ మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చాడు. అయితే థియేటర్స్ లో పెద్దగా ఆకట్టుకోని ఈ మూవీ ప్రస్తుతం ఓటిటి ఆడియన్స్ ని మాత్రం ఎంతో ఆకట్టుకుంటోంది.

మానస చౌదరి హీరోయిన్ గా నటించిన ఈమూవీని యువ దర్శకుడు రవికాంత్ పేరెపు తెరకెక్కించారు. విషయం ఏమిటంటే, తాజాగా ఈ మూవీ ప్రముఖ ఓటిటి మాధ్యమం ఆహాలో 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ ని దాటి ఆడియన్స్ ని ఆకట్టుకుంటూ కొనసాగుతోంది. ఈ విధంగా ఫస్ట్ మూవీతో ఆడియన్స్ మనసు దోచి మంచి పేరు అందుకున్నారు రోషన్. ఈ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీలో హర్ష చెముడు, హర్షవర్ధన్, అను హాసన్, జైరాం ఈశ్వర్ తదితరులు కీలక పాత్రలు చేసారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు