శ‌ర్వానంద్ సరసన ‘చైతు’ హీరోయిన్ ?

Published on Jul 12, 2020 10:19 pm IST

దర్శకుడు అజ‌య్ భూప‌తి ‘మహా సముద్రం’ అనే సినిమా చేయడానికి ఎప్పటినుండో సన్నాహాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నుండి రవితేజతో పాటు నాగచైతన్య తప్పుకున్నాక, అజేయ్, హీరో శర్వానంద్ తో ముందుకు వెళ్తున్నాడు. కాగా తాజాగా ఈ చిత్రంలో శ‌ర్వానంద్ కి జ‌త‌గా బాలీవుడ్ యంగ్ హీరోయిన్ ‘దివ్యాంశ కౌశిక్’ను తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. మజిలీ సినిమాలో క్రికెటర్ చైతుకు జోడిగా నటించి మెప్పించిన ‘దివ్యాంశ కౌశిక్’కు ఇది మంచి అవకాశమే. అయితే ఈ వార్తకు సంబంధించి ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.

కాగా ఈ సినిమా పక్కా ఎమోషనల్ ఎంటర్ టైనర్ గా ఉంటుందట. సినిమాలో సెకెండ్ హీరో పాత్ర చనిపోతుందని.. అలాగే స్టోరీ వరల్డ్ కూడా కాస్త కొత్తగా ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమాలోని సెకండ్ హీరో పాత్ర కోసం.. అజేయ్ ఫామ్ లో ఉన్న మరో హీరో కోసం ట్రై చేస్తున్నాడు. ఏమైనా “ఆర్ఎక్స్ 100” సినిమాతో సంచలన విజయం సాధించినా.. రెండో సినిమా కోసం మాత్రం అజేయ్ భూపతి బాగా గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది.

సంబంధిత సమాచారం :

More