‘భారతీయుడు 2’లో యంగ్ హీరోయిన్ ?

Published on Jun 29, 2020 12:00 am IST

డైరెక్టర్ శంకర్ గ్రేట్ యాక్టర్ కమల్ హాసన్ ల కాంబినేషన్ లో రానున్న ‘భారతీయుడు 2’కి మొదటి నుండి అనేక కష్టాలు ఎదురవుతున్నాయి. ఆ మధ్య సెట్లో పెద్ద క్రేన్ పడిన తీవ్ర దిగ్భ్రాంతికరమైన సంఘటన గురించి తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్ లేట్ అవ్వడంతో ఈ సినిమా నుండి ఓ యువనటి తప్పుకుందట. ఆమెది భారతీయుడు సీక్వెల్ లో కీలక పాత్ర అని, అందుకే ఆమె పాత్రలో ‘ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ’ హీరోయిన్ శ్రుతి శర్మను తీసుకున్నారని తెలుస్తోంది. వచ్చే షెడ్యూల్ లో శ్రుతి శర్మ కూడా షూట్ లో పాల్గొంటుందట.

కాగా ఈ సినిమాలో హీరోయిన్‌ గా కాజ‌ల్ అగ‌ర్వాల్ నటిస్తోంది. యువ సంచలనం అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని లైకా ప్రొడక్షన్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్ముస్తోంది. 2021లో ఈ సినిమా విడుదలకానుంది. ఇక టెక్ మాంత్రికుడు శంకర్ ఈ సినిమాని కూడా తన శైలిలోనే భారీ హంగులతోనే తీర్చిదిద్దుతున్నారు. మరి ఈ సినిమానైనా అటు కమల్ కి ఇటు శంకర్ కి భారీ హిట్ ఇస్తుందేమో చూడాలి.

సంబంధిత సమాచారం :

More