‘మహర్షి’లో ఓ కీలక పాత్రలో యంగ్ హీరోయిన్ !

Published on Dec 6, 2018 11:00 pm IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మహర్షి’ చిత్రంలో ఓ కీలక పాత్రలో యంగ్ హీరోయిన్ నటించనుంది. ‘అడవి కాచిన వెన్నల’ ఫేమ్ మీనాక్షి దీక్షిత్‌ మహర్షి సినిమాలో కీలకమైన పాత్రలో నటిస్తోంది. ఇప్పటికే యుఎస్ లో ఆమె పాత్ర తాలూకు సన్నివేశాలని చిత్రీకరించింది చిత్రబృందం. మొత్తానికి సరైన ప్రాజెక్ట్ కోసం ఇన్నాళ్లు ఎదురు చూసిన మీనాక్షి దీక్షిత్‌ కి మహేష్ బాబు సినిమాలో ఛాన్స్ రావడం నిజంగా లక్కీ అనే చెప్పాలి.

ఇక ఈ సినిమాలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. ప్రముఖ కామెడీ హీరో అల్లరి నరేష్ కూడా ఈ చిత్రంలో ఓ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నాడు. ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, అశ్వినీదత్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం శాటిలైట్ హక్కులను ప్రముఖ టెలివిజన్ ఛానెల్ అయిన జెమినీ టీవీ దక్కించుకుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

సంబంధిత సమాచారం :