
‘పండగ చేస్కో’ సినిమాతో హిట్ అందుకున్న ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఆ తర్వాత జోష్ పెంచి వరుసగా రెండు సినిమాలను సెట్స్ పైకి తీసుకెళ్ళిపోయాడు. అవే శివమ్ మరియు హరికథ. శ్రీనివాస్ రెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తూ చేసిన శివమ్ సినిమా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని అక్టోబర్ 2న గ్రాండ్ గా రిలీజ్ కావడానికి సిద్దమైంది. ఇదిలా ఉంటే రామ్ ఇప్పటికే తన తదుపరి సినిమా హరికథ సినిమా షూటింగ్ కూడా సగభాగంపైనే ఫినిష్ చేసాడు.
రామ్ ప్రస్తుతం శివమ్ ప్రమోషన్స్ లో బిజీ బిజీగా ఉన్నాడు. ఈ సినిమా రిలీజ్ అయ్యి పోస్ట్ ప్రమోషన్స్ కూడా పూర్తయిన తర్వాత రామ్ మళ్ళీ తిరిగి హరికథ సినిమాని ప్రారంభిస్తాడు. తాజా సమాచారం ప్రకారం ఈ హరికథ సినిమాని నవంబర్ కల్లా పూర్తి చేసి డిసెంబర్లో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రామ్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా కనిపించనుంది. ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ తో వస్తున్న ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తుంటే, స్రవంతి రవికిషోర్ నిర్మిస్తున్నాడు.

