ఒక్క స్టార్ హీరో సినిమా అనుకున్న డేట్ నుంచి పోస్ట్ పోన్ అయితే అప్పటి వరకూ రిలీజ్ డేట్ లేని పలు చిన్న హీరోల సినిమాలు రిలీజ్ అయిపోతూ ఉంటాయి. తాజాగా అఖిల్ సినిమావాయిదా పడడంతో రెండు చిన్న సినిమాలు అక్టోబర్ 22న రిలీజ్ కావడానికి సిద్దమయ్యాయి. అందులో ఒకటే ‘కొలంబస్’. ‘అంతకుముందు ఆ తరువాత’, ‘లవర్స్’, ‘కేరింత’ సినిమాలతో మంచి విజయాలను అందుకున్న హీరో సుమంత్ అశ్విన్ హీరోగా నటించిన మరో రొమాంటిక్ ఎంటర్ టైనర్ ‘కొలంబస్’.
రెండు రోజుల క్రితమే వెంకటేష్ చేతుల మీదుగా ఈ మూవీ ఆడియోని రిలీజ్ చేసారు. ఈ సరభంగా రిలీజ్ చేసిన రొమాంటిక్ ఎంటర్టైనర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతే కాకుండా ఈ సినిమాలో షారుఖ్ ఖాన్, కాజోల్, రాణీ ముఖర్జీ కలిసి నటించిన కుచ్ కుచ్ హోతా హై సినిమా చాయలు కనిపిస్తున్నాయి. అంతే కాకుండా కామెడీని కూడా పర్ఫెక్ట్ గా మిక్స్ చేయడం వలన ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ అందరినీ ఆకట్టుకుంటుందని సమాచారం. సుమంత్ అశ్విన్ సరసన మిస్తి చక్రబోర్తి, సీరత్ కపూర్ లు హీరోయిన్స్ గా కనిపించనున్నారు.రమేష్ సామల దర్శకత్వం వహించిన ఈ సినిమాకి అశ్విని కుమార్ సహదేవ్ నిర్మాత.


