చిరంజీవిగారు మెసేజ్ చేశారు – ప్రభాస్

Published on Aug 11, 2019 7:04 pm IST

యంగ్ రెబల్ స్టార్ ప్ర‌భాస్ హీరోగా అత్యంత భారీ బ‌డ్జెట్ తో హై స్టాండ‌ర్డ్స్ టెక్నాల‌జీతో తెరెకెక్కిన్న చిత్రం ‘సాహో’. కాగా అగ‌ష్టు 30న ఈ సినిమాను ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల చేస్తున్నారు. కాగా తాజగా సాహో చిత్ర బృందం పాత్రికేయుల సమావేశంలో పాల్గొంది. మీడియా వాళ్ళు అడిగిన పలు ప్రశ్నలకు ప్రభాస్ ఆసక్తికరమైన సమాధానాలు చెప్పారు. ప్రభాస్ మాట్లాడుతూ.. ‘సుజీత్ నాకు ఈ కథ బాహుబలికి ముందే చెప్పాడు. ప్రమోద్, వంశీ, విక్రమ్ అందరం డిస్కస్ చేసుకుని ఈ సినిమాను భారీగా చేద్దాం అనుకున్నాం. సాహో అనుకున్న దానికంటే పెద్ద స్కేల్ లో వచ్చింది. ట్రైలర్ చూసి చిరంజీవిగారు మెసేజ్ చేశారు. నేను ఫోన్ చేసి మాట్లాడాను. చాలా గ్రేట్ ఫీలింగ్ ఆయనతో మాట్లాడటం’ అని ప్రభాస్ చెప్పుకొచ్చాడు.

కాగా ప్రస్తుతం సాహో ప్రమోషన్స్ ను అన్ని భాషల్లో పెద్ద ఎత్తున చేస్తున్నారు. టాలెంటెడ్ మ్యూజిక్ కంపోజర్ జిబ్రాన్ ఈ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. మొత్తానికి జిబ్రాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సాహోకి ప్రత్యేకంగా నిలవనుందట. ఈ చిత్రాన్ని మూడు భాషల్లో భారీ బడ్జెట్ తో టాలీవుడ్ ప్రేస్టేజియ‌స్ ప్రోడ‌క్ష‌న్ హౌస్ యువి క్రియెష‌న్స్ బ్యాన‌ర్ లో వంశి, ప్ర‌మెద్, విక్ర‌మ్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :