సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తున్న తరుణ్..?

Published on Oct 30, 2020 8:20 pm IST


ఒకప్పుడు మన టాలీవుడ్ లో లవ్ స్టోరీ సినిమాలు అంటే యూత్ ఫుల్ హీరో తరుణ్ పేరు ఖచ్చితం. అలా కొన్నాళ్ల పాటుగా తన హవా కొనసాగించి యూత్ కు మంచి ఎంటర్టైన్మెంట్ అందించిన ఈ హీరో తర్వాత అలా ఫేడ్ అవుట్ అయ్యిపోయాడు. అయితే ఈ టాలెంటెడ్ హీరో ఆ తర్వాత అరకొర సినిమాలు చేసాడు కానీ అవి పెద్దగా వెలుగులోకి రాలేదు.

అయితే ఇటీవలే తాను నటించిన సెన్సేషనల్ హిట్ “నువ్వే కావాలి” చిత్రం 20 వసంతాలు పూర్తి చేసుకోవడంతో ఆ జ్ఞ్యాపకాలను గుర్తు చేస్తూ మళ్ళీ ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాడు. అయితే ఇప్పుడు లేటెస్ట్ గా వినిపిస్తున్న సమాచారం ప్రకారం తరుణ్ తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టనున్నట్టు తెలుస్తుంది.

అయితే నటన పరంగా రోల్స్ మారడం కాదు సినీ ఇండస్ట్రీలోనే నిర్మాతగా మారాలని తరుణ్ అనుకుంటున్నాడట. ఇప్పుడు మూడు ప్రాజెక్టులను టేకప్ చేసాడట. వాటిలో రెండు ఓటిటికి ప్లాన్ చేస్తుండగా మరొకటి సినిమాకు అన్నట్టు తెలుస్తుంది. మరి ఈ రకంగా అయినా తరుణ్ మంచి కం బ్యాక్ ఇస్తాడేమో చూడాలి.

సంబంధిత సమాచారం :

More