సంక్రాంతికి రానున్న ‘యాత్ర’ ?

Published on Jul 23, 2018 9:15 pm IST


దివంగత నేత ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్య మంత్రి వై ఎస్ రాజశేఖర్ రెడ్డి గారి జీవిత చరిత్ర తో తెరకెక్కుతున్న చిత్రం యాత్ర . ‘ఆనందో బ్రహ్మ’ ఫెమ్ మహి వి రాఘవ్ తెరకెక్కిస్తున్నా ఈచిత్రంలో మలయాళ సూపర్ స్టార్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఇక ఇటీవల విడుదలైన ఈ చిత్ర టీజర్ మంచి రెస్పాన్స్ ను రాబట్టింది. ఇక ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదల కానుందని సమాచారం. ఒకవేళ ఈ వార్తలే నిజమైతే ఈచిత్రం ‘ఎఫ్ 2, ఎన్టీఆర్ బయోపిక్’ చిత్రాలతో బాక్సాఫిస్ వద్ద పోటీ పడనుంది.

.ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈచిత్రంలో జగపతిబాబు, సుహాసిని, రావు రమేష్, అనసూయ, సచిన్ ఖేడేకర్ వంటి ప్రముఖ తారాగణం నటిస్తుంది. విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డిలు సంయుక్తంగా ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :