బాలయ్యతో జత కలిసిన క్రికెటర్ యువరాజ్

బాలయ్యతో జత కలిసిన క్రికెటర్ యువరాజ్

Published on May 18, 2015 8:32 PM IST

balakrishna-yuvaraj
నందమూరి బాలకృష్ణ.. ఈయన పేరు వింటే మూడు విషయాలు గుర్తుకు వస్తాయి. అందులో మొదటిది అభిమానులను మెప్పించే స్టార్ హీరో, రెండవది హిందూపూర్ ఎమ్మెల్యేగా తన నియోజకవర్గ ప్రజలకు కావాల్సిన అవసరాలను తీరుస్తున్నాడు.ఇక చివరిగా బసవతారకమ్మ ఇండో అమెరికన్ కాన్సర్ హాస్పిటల్ ద్వారా ఎంతో మంది పేదలకు ఫ్రీగా కాన్సర్ చికిత్సని అందిస్తున్నారు. ఈ మూడు విషయాల్లో బిజీ గా ఉంటున్న బాలకృష్ణ ఏ ఒక్క దాన్ని లైట్ తీసుకోవడం లేదు. ఇక ఇప్పటి విషయానికి వస్తే బసవతారకమ్మ ఇండో అమెరికన్ హాస్పిటల్ ద్వారా ప్రజలకు ఎంత వీలైతే అంత ఎక్కువగా సేవ చేయడం కోసం తాజాగా మరో స్టెప్ తీసుకున్నారు.

అదే ఇండియన్ స్టార్ క్రికెట్ ప్లేయర్ యువరాజ్ సింగ్ తో కలిసి కాన్సర్ పై అవగాహన మరియు ఫండ్స్ కలెక్ట్ చేయడం కోసం శ్రీకారం చుట్టాడు. అసలు విషయంలోకి వెళితే ఇండియన్ క్రికెటర్ యువరాజ్ సింగ్ యువీకెన్(YOUWECAN) అనే ఆర్గనైజేషన్ ద్వారా కాన్సర్ బాధితులకు తన వంతు సాయం అందిస్తున్నాడు. ఇప్పుడ బాలకృష్ణ – యువరాజ్ సింగ్ లు కలిసి ప్రజల్లో కాన్సర్ పై అవగాహన కలిగించడం, కాన్సర్ బాధితుల కోసం ఫండ్ రైజ్ చెయ్యడం లాంటి కార్యక్రమాలు చేయనున్నారు. ఇలాంటి ఇద్దరు లెజెండ్స్ కలిసి ఓ మంచి కార్య కోసం ముందుకు రావడం ఎంతో అభినందించ దగిన విషయం. వీరిద్దరూ తీసుకున్న ఈ స్టెప్ ఇంకెంతో మందికి స్పూర్తిగా నిలవాలని కోరుకుంటున్నాం.

తాజా వార్తలు