‘జీ5 సంకల్పం’ పేరిట హైదరాబాద్‌లో ఉచిత వ్యాక్సినేషన్ కార్యక్రమం..!

‘జీ5 సంకల్పం’ పేరిట హైదరాబాద్‌లో ఉచిత వ్యాక్సినేషన్ కార్యక్రమం..!

Published on Jul 22, 2021 4:00 PM IST

అగ్రగామి ఓటీటీ వేదికలో ఒకటైన ‘జీ5′ ఎప్పటికప్పుడు సరికొత్త సినిమాలు, టీవీ షోస్‌, వెబ్‌ సిరీస్‌లను వివిధ భాషల్లో అందిస్తూ ప్రేక్షకులకు ఎంతో వినోదాన్ని పంచుతున్న ‘జీ5’ తాజాగా ప్రజల ఆరోగ్యానికి ప్రాముఖ్యత ఇస్తుంది. ‘జీ5 సంకల్పం’ పేరుతో జూలై 30 నుంచి ఆగస్టు 8 వరకు హైదరాబాద్‌లో ఉచిత కరోనా వ్యాక్సినేషన్‌ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

ఈ సందర్భంగా జీ5 ఇండియా ఛీఫ్‌ బిజినెస్‌ ఆఫీసర్‌ మనీషా కార్లా మాట్లాడుతూ ప్రజల అభిరుచికి తగ్గట్టుగా ఉత్తమ వినోదం అందించడమే జీ5 ప్రధాన లక్ష్యమని అన్నారు. అయితే వినోదం అందించడమే కాకుండా ప్రస్తుత కష్టకాలంలో ప్రజల ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో ఉంచుకుని ఓ బాధ్యతాయుతమైన సంస్థగా ‘జీ5 సంకల్పం’ ద్వారా వీలైనంత మందికి ఉచితంగా వ్యాక్సిన్‌ అందించాలని అనుకుంటున్నట్టు తెలిపారు.

అయితే హైదరాబాద్‌లోని 18 సంవత్సరాలు వయసు నిండిన వారెవరైనా వ్యాక్సిన్ వేయించుకోవాలని అనుకుంటే జూలై 20 నుంచి 26వ తేది వరకు https://atm.zee5.com వెబ్‌సైట్‌లో తమ వివరాలు నమోదు చేసుకోవాలని, జూలై 30 నుంచి ఆగస్టు 8వ తేది వరకు ప్రతి రోజు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వ్యాక్సినేషన్‌ కార్యక్రమం జరుగుతుందని కోవీషీల్డ్‌ మరియు కోవాగ్జిన్‌లు అందుబాటులో ఉంచుతామని వ్యాక్సిన్ వేయించుకునే తేదీ, సమయం కూడా ఎంపిక చేసుకోనే వెసులుబాటు వెబ్‌సైట్‌లో కల్పించినట్టు చెప్పుకొచ్చారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు