విద్య అందించడంలో అగ్రపథాన ఆంధ్రప్రదేశ్

విద్య అందించడంలో అగ్రపథాన ఆంధ్రప్రదేశ్

Published on Jan 6, 2024 10:54 AM IST

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్న విషయం తెలిసిందే. మరోవైపు విద్యారంగం అభివృద్ధికి ఆయన అమలు చేస్తున్న సంస్కరణలు చక్కని ఫలితాలిస్తున్నాయి. తాజాగా ప్రధాని ఎకనమిక్‌ అడ్వయిజరీ కౌన్సిల్‌ విడుదల చేసిన స్టేట్‌ ఆఫ్‌ ఫౌండేషనల్‌ లిటరసీ అండ్‌ న్యూమరసీ ఇన్‌ ఇండియా నివేదిక దీన్ని నిరూపించింది. కౌన్సిల్‌ చైర్మన్‌ డాక్టర్‌ బిబేక్‌ దేబ్రాయ్‌ ఈ మేరకు నివేదికలు విడుదల చేశారు.
 
ఫౌండేషన్‌ విద్య అందుబాటు అనే అంశంలో ఏపీ 38.50 స్కోరుతో దేశంలోనే  అగ్రస్థానంలో ఉంది. రాష్ట్రంలో అక్షరాస్యత, ఇతర అంశాల్లో అగ్రస్థానంలో ఉన్న కేరళ ఈ విషయంలో మాత్రం ఆంధ్ర కన్నా తక్కువగా 36.55 స్కోరు సాధించింది. ఇదే అంశాన్ని ప్రధాని ఎకనమిక్‌ అడ్వయిజరీ కౌన్సిల్‌ తన నివేదికలో ప్రస్తావిస్తూ చిన్న రాష్ట్రాల్లో కేరళ అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్నప్పటికీ విద్య అందుబాటు అంశానికి సంబంధించి మాత్రం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలు కొంత నేర్చుకోవాలి అని పేర్కొంది. దీంతోపాటు కేంద్రం నిర్దేశించిన ఐదు అంశాల్లో జాతీయ సగటు స్కోరు 28.05గా ఉంటే సగానికి పైగా రాష్ట్రాలు అంతకన్నా చాలా వెనుకబడి ఉన్నాయని నివేదిక పేర్కొంది.  ఇక విద్య అందుబాటులో రాజస్థాన్‌ 25.67, గుజరాత్‌ 22.28, బీహార్‌ 18.23 స్కోరు మాత్రమే సాధించాయి.

ఈ నివేదిక పిల్లల పూర్వ ప్రాథమిక విద్య, పునాది స్థాయి అక్షరాస్యత అంశాలను విశ్లేషించింది. పూర్వ ప్రాథమిక, ప్రాథమిక స్థాయిలో అక్షర, సంఖ్యా జ్ఞానాలకు సంబంధించి చదవడం, రాయడం, గణిత నైపుణ్యాలెలా ఉన్నాయో ఈ నివేదిక గమనంలోకి తీసుకుని చిన్న రాష్ట్రాలు, పెద్ద రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వారీగా అంశాల వారి స్కోరును పొందుపరిచింది. ఫౌండేషన్‌ విద్య పటిష్టంగా లేకుంటే పై తరగతుల్లో అభ్యసన సామర్థ్యాలు దెబ్బతినే ప్రమాదం ఉన్నందున ఈ నివేదికలో వాటిని వివరిస్తూనే ఇతర సూచనలు అందించింది. మొత్తంగా ఆంధ్రాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన విద్యా సంస్కరణల ఫలితమే ఇదని, రాబోయే రోజుల్లో ఇటువంటి ముఖ్యమంత్రిని ప్రజలు వదులుకోరని అంటున్నాయి రాజకీయ వర్గాలు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు