సమీక్ష : 1997 – ఎమోషన్ బాగున్నా సినిమా ఆకట్టుకోదు !

1997 Movie Review In Telugu

విడుదల తేదీ : నవంబర్ 26, 2021

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

నటీనటులు:డా. మోహన్, నవీన్ చంద్ర, శ్రీకాంత్ అయ్యంగార్, కోటి, బెనర్జీ, రవి ప్రకాష్, రామ రాజు తదితరులు.

దర్శకత్వం : డాక్టర్ మోహన్

నిర్మాతలు: మీనాక్షి రమావత్

సంగీత దర్శకుడు: కోటి

సినిమాటోగ్రఫర్: చిట్టి బాబు

ఎడిటింగ్: నందమూరి హరి

డా.మోహన్, నవీన్ చంద్ర, శ్రీకాంత్ అయ్యంగార్, కోటి ప్రధాన పాత్రల్లో, డా.మోహన్ స్వీయ దర్శకత్వంలో ఈశ్వర పార్వతి మూవీస్ బ్యానర్ పై తెరకెక్కిన చిత్రం 1997. రియల్ ఇన్సిడెంట్స్‌ ను ఆధారంగా చేసుకుని తెరకెక్కించిన ఈ భిన్నమైన చిత్రం ఈ రోజు విడుదల అయింది. మరి ఆడియన్స్‌ను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.

 

కథ :

 

అగ్రకుల నాయకులు తక్కువ కులం వాళ్ళను హింసించే ప్రాంతానికి ఏసీపీగా వస్తాడు విక్రమ్ రాథోడ్ (డా.మోహన్). అక్కడ అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉంటూ అగ్రకులానికి చెందిన దొర కుల ఆచారం పేరుతో పేద ప్రజలను శిక్షిస్తూ దారుణాలు చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని అన్యాయాలకు చలించిపోతాడు విక్రమ్ రాథోడ్. దొరను శిక్షించడానికి ప్రయత్నాలు చేస్తాడు. మరి విక్రమ్ రాథోడ్ అక్కడి ప్రజలకు నాయ్యం చేశాడా ? మధ్యలో దొరకు వత్తాసు పలుకుతూ తప్పులు చేస్తోన్న సీఐ చారికి విక్రమ్ రాథోడ్ ఎలాంటి శిక్ష వేశాడు ? చివరకు విక్రమ్ రాథోడ్ సాధించింది ఏమిటి ? అనేది మిగిలిన కథ.

 

ప్లస్ పాయింట్స్ :

 

ఈ సినిమాకి మెయిన్ ప్లస్ పాయింట్స్ అంటే… ఈ కథలోని మెయిన్ ఎమోషన్. అండ్ కథ జరిగిన నేపథ్యం, సహజంగా సాగే కొన్ని పాత్రలు. అలాగే సినిమాలోని చూపించిన కొన్ని నేటివిటీ భావజాలం. మొత్తమ్మీద ఓ బాలిక మిస్సింగ్ కేసు దగ్గర నుంచి అత్యాచారం, హత్య అంటూ మధ్యలో కులతత్వం తో సాగుతూ మొత్తంగా ఈ సినిమా వీటి చుట్టూనే తిరిగింది. ఇక విక్రమ్ రాథోడ్ పాత్రలో డా.మోహన్ బాగానే నటించాడు. ఎమోషనల్‌ గా సాగే తన పాత్రలో తన కళ్లతోనే సున్నితమైన భావోద్వేగాలను పలికించే ప్రయత్నం చేశాడు.

మరో కీలక పాత్రలో నటించిన నవీన్ చంద్ర కూడా తన పాత్రకు న్యాయం చేశాడు. శ్రీకాంత్ అయ్యంగార్ పాత్ర చాలా బాగుంది. తన పాత్రలో శ్రీకాంత్ తనదైన విలక్షణమైన నటనతో బాగా నటించాడు. రవిప్రకాష్, మరియు నటుడు రామరాజు తమ పాత్రలకు తగ్గట్లు నటించారు. అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ఇక క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకి కోటి అందించిన సంగీతం ప్లస్ అయింది.

 

మైనస్ పాయింట్స్ :

 

సినిమా పేరులోనే 1997 ఉన్నట్టు ఈ సినిమా కంటెంట్ కూడా అప్పటి కంటెంటే. ఇక సినిమా విషయానికి వస్తే.. సినిమా స్టార్ట్ అయిన మొదటి నుంచి ప్లే స్లోగానే సాగుతోంది. కథా నేపథ్యం, పాత్రల చిత్రీకరణ, నటీనటుల పనితీరు బాగున్నా.. కథనం విషయంలో, కథను మొదలు పెట్టడంలో మాత్రం మోహన్ చాలా నెమ్మదిగా కనిపించారు.

పాత్రల మధ్య ఎమోషన్స్ ను ఇంకా బలంగా ఎస్టాబ్లిష్ చేయాల్సింది. కొన్ని చోట్ల మెలోడ్రామాలా అనిపిస్తోంది. ఫస్ట్ హాఫ్ లో చాలా చోట్ల అనవసరమైన డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. డైలాగ్స్ అసలు బాగాలేదు. దాంతో సినిమా బోరింగ్ గా సాగుతుంది. దీనికి తోడు కొన్ని పాత్రలు కేవలం సినిమాలో ల్యాగ్ పెంచడానికి మాత్రమే ఉపయోగపడ్డాయి.

ఇక సినిమాలో సెకండాఫ్ కూడా స్లోగా సాగింది. ప్రధానంగా కొన్ని సన్నివేశాల్లో గ్రిప్పింగ్ నరేషన్ మిస్ అయింది. నేపథ్య సంగీతం కూడా పాత సినిమాల సంగీత సమ్మేళనంలా ఉంది. ఓవరాల్ గా టేకింగ్ అండ్ మేకింగ్ పరంగా పర్వాలేదు అనిపించినా.. స్క్రిప్ట్ విషయంలో ఈ సినిమా పూర్తిగా ఫెయిల్ అయింది.

 

సాంకేతిక విభాగం :

 

మోహన్ దర్శకుడిగా ఈ సినిమాకు పూర్తి న్యాయం చేయలేకపోయారు. అయితే ఆయన తన కథలో చెప్పాలనుకున్నా మెయిన్ ఎమోషన్ బాగుంది. సినిమా స్క్రిప్ట్ పై ఇంకొంచెం శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేది. సంగీత దర్శకుడు కోటి అందించిన సంగీతం బాగుంది. కాకపోతే కొన్ని చోట్ల నేపథ్య సంగీతంలో పాత సినిమాల ఆల్బమ్ వాసనలు తగులుతాయి. సినిమాటోగ్రఫర్ చిట్టి బాబు సినిమాటోగ్రఫీ సినిమాకి ప్లస్ అయింది. సన్నివేశాలన్నీ చాలా సహజంగా సినిమా మూడ్ కి అనుగుణంగా నడుస్తాయి. నిర్మాత ప్రొడక్షన్ డిజైన్ కూడా ఆకట్టుకుంటుంది.

 

తీర్పు :

 

కుల నేపథ్యంలో క్రైమ్ థ్రిల్లర్‌ గా వచ్చిన ఈ ఎమోషనల్ డ్రామాలో కొన్ని ఎమోషన్స్, కుల నేపథ్యంలో వచ్చే కొన్ని సీన్స్, మరియు పాత్రల మధ్య సున్నితమైన సంఘర్షణలు కొంతవరకు ఆకట్టుకున్నాయి. అయితే, స్లో నేరేషన్, ఇంట్రెస్టింగ్ కంటెంట్ లేకపోవడం, స్క్రిప్ట్ లోని లోపాలు వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి. మొత్తమ్మీద ఈ సినిమా కనెక్ట్ అయ్యే విధంగా లేదు.

123telugu.com Rating : 2.25/5

Reviewed by 123telugu Team

Click Here For English Version

సంబంధిత సమాచారం :