సమీక్ష : 2018 – మెప్పించే సర్వైవల్ థ్రిల్లర్ !

సమీక్ష : 2018 – మెప్పించే సర్వైవల్ థ్రిల్లర్ !

Published on May 26, 2023 8:00 AM IST
2018 Movie Review In Telugu

విడుదల తేదీ : మే 26, 2023

123తెలుగు.కామ్ రేటింగ్ : 3.25/5

నటీనటులు: టోవినో థామస్, లాల్, నరైన్, అపర్ణ బాలమురళి, కళైరసన్, అజు వర్గీస్, వినీత్ శ్రీనివాసన్, కుంచాకో బోబన్ తదితరులు

దర్శకులు : జూడ్ ఆంథనీ జోసెఫ్

నిర్మాతలు: వేణు కున్నప్పిల్లి, సీకే పద్మ కుమార్, ఆంటో జోసెఫ్

సంగీత దర్శకులు: నోబిన్ పాల్

సినిమాటోగ్రఫీ: అఖిల్ జార్జ్

ఎడిటర్: చమన్ చక్కో

సంబంధిత లింక్స్: ట్రైలర్

 

ఇటీవల మలయాళంలో రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద ప్రస్తుతం సూపర్ సక్సెస్ తో మంచి కలెక్షన్ తో కొనసాగుతున్న మూవీ 2018. ఐదేళ్ల క్రితం కేరళ లో వచ్చిన వరదల నేపథ్యంలో సాగె కథగా రూపొందిన ఈ మూవీ నేడు తెలుగు ఆడియన్స్ ముందుకి వచ్చింది. మరి ఈ మూవీ ఎలా ఉంది అనేది సమీక్ష లో చూద్దాం.

కథ :

అనూప్ (టొవినో థామస్) ఒక మాజీ సైనికుడు, మరణానికి భయపడి సైన్యాన్ని విడిచిపెడతాడు. మాతచ్చన్ (లాల్) మరియు అతని కుమారుడు విన్‌స్టన్ (నరైన్) చేపలు పట్టడం ద్వారా జీవనోపాధి పొందుతుండగా, కోశి (అజు వర్గీస్) పర్యాటకుల కోసం టాక్సీ నడుపుతుంటాడు. దుబాయ్‌లో ఐటీ ఉద్యోగి అయిన రమేష్ (వినీత్ శ్రీనివాసన్) భారతదేశంలోని తన భార్యతో రిలేషన్షిప్ సమస్యలను ఎదుర్కొంటూ ఉంటాడు. అలానే తమిళనాడుకు చెందిన సేతుపతి (కళైరసన్) ట్రక్ డ్రైవర్‌గా పేలుడు పదార్థాలను కేరళకు రవాణా చేయడానికి అంగీకరిస్తాడు. అయితే 2018 లో వరదలు కేరళను ధ్వంసం చేయడంతో వారి జీవితాలు ఎలా మారాయి మరియు కేరళ ప్రజలపై వరదల సంక్షోభం యొక్క ప్రభావం అనంతరం కథనం ఎలా నడుస్తుంది, మరి వారు ఆ విపత్తు నుండి బయటపడ్డారా లేదా ఆపై ఏమి జరిగింది వంటి అంశాలు అంటికీ సమాధానాల కోసం 2018 సినిమా చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్ :

కొన్ని సినిమాలు ఆడియన్స్ ని ఆకట్టుకోవడంతో పాటు అవి వారిని ఆ సినిమాతో మమేకమయ్యే అనుభూతిని అందిస్థాయి. ఈ 2018 మూవీ కూడా ఆడియన్స్ కి అటువంటి అనుభూతిని అందిస్తుంది. నిజానికి ఈ సినిమా ఎంతో నార్మల్ గా సాగడంతో పాటు ఇందులో పెద్ద ట్విస్ట్ లు లేనప్పటికి కథ, కథనాలు, క్యారెక్టర్స్ యొక్క నటన ఎంతో ఆకట్టుకుంటాయి. దర్శకుడు జూడ్ ఆంథనీ జోసెఫ్ హృద్యమైన కథని తీసుకున్నారు. అయితే ఫస్ట్ హాఫ్ ఒకింత క్యారెక్టర్స్ మధ్య కన్ఫ్యూజన్ ఏర్పరిచినప్పటికీ దానిపై సెకండ్ హాఫ్ లో పూర్తిగా క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది. ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే తో పాటు హార్ట్ టచింగ్ సీన్స్, యాక్టర్స్ పెరఫార్మన్సెస్ ప్రతి ఒక్కరినీ సినిమాని ఆకర్షిస్తాయి. టోవినో థామస్ మరొక్కసారి ఈ సినిమాలో తన పాత్రలో ఆకట్టుకునే పెర్ఫార్మన్స్ కనబరిచారు. ముఖ్యంగా తన క్యారెక్టర్ ఎంతో బాగా డిజైన్ చేయబడింది. మరణ భయంతో సైన్యం నుండి తిరిగివచ్చే వ్యక్తి వరద పరిస్థితుల రీత్యా ధైర్యంతో పలువురిని రక్షించే సీన్స్ బాగుంటాయి. మాతచ్ఛన్ పాత్రలో నటించిన లాల్ జాలరిగా తన పాత్రలో అదరగొట్టారు. ముఖ్యంగా వరదల సమయంలో ఎందరో ప్రాణాలను అతడు కాపాడడం ఎంతో హృద్యంగా ఉంటుంది. నరేన్ మరియు కలైరసన్ కూడా వారి మంచి నటనతో అలరించడంతో పాటు, మిగిలిన నటీనటులు వారి వారి పాత్రలలో బాగా నటించారు. కథతో పాటు, సినిమా యొక్క అద్భుతమైన కెమెరా పనితనం మరియు అసాధారణమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఉద్విగ్న వాతావరణాన్ని సృష్టిస్తాయి, ముఖ్యంగా సినిమా రెండవ భాగంలో వారు సినిమాకి ఎంతో దోహదపడతారు మరియు సీట్ ఎడ్జ్ సీన్స్ ఆడియన్స్ ని ఎంతో ఆకట్టుకుంటాయి.

 

మైనస్ పాయింట్స్ :

2018 కేరళ వరదల క్లిష్ట సమయాల్లో ప్రభుత్వం మరియు మీడియా పాత్ర గురించి చాలా తక్కువగా చూపించడం 2018 కి సంబంధించిన సమస్యల్లో ఒకటి. అన్నింటికంటే మానవత్వాన్ని పెంపొందించడమే దర్శకుడి ముఖ్య ఉద్దేశం అయినప్పటికీ, సంక్షోభ సమయంలో మీడియా మరియు ప్రభుత్వం చేసిన పనిని కూడా అతను హైలైట్ చేసి ఉండాల్సింది. ఆడియన్స్ కి ఎంతో సుపరిచితం అయిన అయిన అపర్ణ బాలమురళికి స్క్రీన్ ప్రెజెన్స్ చాలా తక్కువ, అది ఒకింత నిరాశ కలిగించింది. దర్శకుడు ఆమెకు సంబంధించిన మరిన్ని సన్నివేశాలు రాసి ఉండాల్సింది. దర్శకుడు ప్రధాన కథాంశం కంటే పాత్రలు మరియు వారి సమస్యలపై ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల సినిమా ఫస్ట్ హాఫ్ ప్రేక్షకులను కొంత గందరగోళానికి గురి చేస్తుంది. తన్వి రామ్ మరియు గౌతమి నాయర్ వంటి కొన్ని పాత్రలు కథాంశంపై అంతగా ప్రభావం చూపవు మరియు ఆడియన్స్ కి ఒకింత అసంతృప్తి కలిగించవచ్చు. సినిమాలో కొన్ని లోపాలున్నప్పటికీ అవి అంతగా నెగటివ్ అనిపించవు. ముఖ్యంగా ఆడియన్స్ వాటిని మరచిపోయి తెరకి కళ్లను అతుక్కుపోయేలా దర్శకుడు భావోద్వేగ అంశాలతో ఈ కథాంశాన్ని తెరకెక్కించారు. డ్యామ్ దెబ్బతినడానికి సంబంధించిన మరిన్ని సన్నివేశాలను చూపించడం వంటి సస్పెన్స్ క్రియేట్ చేయడం ద్వారా దర్శకుడు కథను మరింత ఆసక్తికరంగా మార్చగలిగాడు.

 

సాంకేతిక వర్గం :

జూడ్ ఆంథనీ జోసెఫ్ విభిన్న రకాల వ్యక్తుల భయాందోళనలను మరియు ప్రకృతి విపత్తు సమయంలో తమ తోటి మానవులకు అండగా నిలబడాలనే వారి అంతిమ ధైర్యాన్ని ప్రదర్శించే వాస్తవిక కథను చిత్రీకరించినందుకు మెచ్చుకోవాలి. తన స్క్రీన్ ప్లే కూడా బాగుంది, ముఖ్యంగా సెకండాఫ్‌లో అతను ప్రజల భావోద్వేగాలను నాచురల్ గా చూపించారు. ఈ సినిమా సాంకేతికంగా అద్భుతం, మ్యూజిక్ డైరెక్టర్ నోబిన్ పాల్, సినిమాటోగ్రాఫర్ అఖిల్ జార్జ్ మరియు మొత్తం ప్రొడక్షన్ డిజైన్ బృందం యొక్క అద్భుతమైన పనితీరుకి ధన్యవాదాలు. చమన్ చక్కో ఎడిటింగ్ పర్వాలేదు, అయితే 2018 ని మంచి ఎక్స్ పీరియన్స్ గా మార్చేందుకు ఫస్ట్ హాఫ్‌లోని కొన్ని సన్నివేశాలను తొలగించి ఉండొచ్చు. నిర్మాణ విలువలు బాగున్నాయి, విఎఫ్ఎక్స్ వర్క్ థ్రిల్లింగ్ గా ఎంతో బాగుంది. తెలుగు డబ్బింగ్ కూడా బాగానే ఉంది.

 

తీర్పు :

మొత్తంగా 2018 మూవీ ఎమోషన్స్‌ని రేకెత్తిస్తూ, ఆడియన్స్ ని థ్రిల్‌కి గురిచేసే సినిమా. టోవినో థామస్, లాల్, నరేన్ అద్భుతమైన నటన, అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరియు సినిమాటోగ్రఫీ సినిమాకు బలం. సినిమాలో కొన్ని అనవసరమైన సన్నివేశాలు మినహాయించి, ప్రేక్షకులను భావోద్వేగాలలో మునిగిపోయేలా చేసే అనేక అద్భుత సన్నివేశాలు ఉన్నాయి. ఈ వీకెండ్‌లో ఎలాంటి సందేహం లేకుండా ఈ సినిమాని హ్యాపీగా ఫ్యామిలీతో చూడొచ్చు.

123telugu.com Rating: 3.25/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు