సమీక్ష: 777 చార్లీ – పర్వాలేదనిపించే ఎమోషనల్ డ్రామా

సమీక్ష: 777 చార్లీ – పర్వాలేదనిపించే ఎమోషనల్ డ్రామా

Published on Jun 11, 2022 3:02 AM IST
777 Charlie Movie Review

విడుదల తేదీ : జూన్ 10, 2022

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు: ఛార్లి, ర‌క్షిత్ శెట్టి, సంగీత శ్రింగేరి, రాజ్ బి.షెట్టి, డానిష్ సెయిట్‌, బాబీ సింహ త‌దిత‌రులు

దర్శకత్వం : కిర‌ణ్ రాజ్‌.కె

నిర్మాతలు: జి.ఎస్‌.గుప్తా, ర‌క్షిత్ శెట్టి

సంగీత దర్శకుడు: నోబిన్ పాల్‌

సినిమాటోగ్రఫీ: అర‌వింద్ ఎస్‌.క‌శ్య‌ప్‌

ఎడిటర్: ప్ర‌తీక్ శెట్టి


ఈ వారం థియేటర్స్ లో రిలీజ్ అయ్యిన చిత్రాల్లో దాదాపు మూడేళ్ళ తర్వాత నటుడు రక్షిత్ శెట్టి నుంచి వచ్చిన ఒక ఎమోషనల్ చిత్రం “777 చార్లీ” కూడా ఒకటి. డీసెంట్ బజ్ తో తెలుగులో రిలీజ్ అయ్యిన ఈ చిత్రం ఆడియెన్స్ ని ఎంత మేర మెప్పిస్తుందో సమీక్షలో చూద్దాం రండి.

కథ :

ఇక కథ లోకి వచ్చినట్టు అయితే.. ధర్మ (రక్షిత్ శెట్టి) చాలా ఒంటరిగా తన లైఫ్ ని చాలా సర్వ సాధారణంగా కొనసాగిస్తుంటాడు. అయితే ఓ రోజు తన ఇంటి దగ్గర చార్లీ అనే కుక్క కనిపిస్తుంది. అప్పటి వరకు ఎంతో ఒంటరిగా ఉన్న ధర్మ ఆ చార్లీతో ఎమోషనల్ గా బాగా దగ్గరవుతాడు. అయితే ఇదిలా ఉండగా ఓ రోజు ఈ చార్లీ గురించి తర్వాత ఒక ఊహించని అంశం తెలుసుకుంటాడు. మరి ఇంతకీ ఆ అంశం ఏంటి? చార్లీకి ఏమవుతుంది అనేవి తెలియాలి అంటే ఈ చిత్రాన్ని చూసి తెలుసుకోవాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

మనుషులకి అలాగే జంతువులకి ఎమోషనల్ బంధం దానిపై సినిమాలు ఎప్పుడూ ఒకింత భావోద్వేగంగానే అనిపిస్తూ ఉంటాయి. అందులోని మనుషులకి అత్యంత దగ్గరైన జీవి శునకం. దీనిపై సినిమా అంటే ఆ ఎమోషన్స్ మరింత బలంగా ఉంటాయి. అందుకు తగ్గట్టు గానే ఈ సినిమాలో కూడా చార్లీ మరియు ధర్మ ల మధ్య బ్యూటిఫుల్ ఎమోషన్స్ కనిపిస్తాయి.

ఇందులో రక్షిత్ శెట్టి చాలా పరిపక్వత కలిగిన నటనను చాలా సెన్సిబుల్ ఎమోషన్స్ ని హృదయానికి హత్తుకునేలా కనబరిచాడు. అలాగే తన లోని షేడ్స్ ని కూడా బాగా చేసి చూపించాడు. ఇంకా లిమిటడ్ గా కనిపించినా నటుడు బాబీ సింహ ఆ కాసేపు కూడా మంచి ఎమోషనల్ పెర్ఫామెన్స్ ని అందించాడు. అలాగే వీరితో పాటుగా సంగీత సింగేరి అలాగే రాజ్ బి తదితరులు తమ పాత్రల పరిధి మేరకు న్యాయం చేకూర్చారు.

మైనస్ పాయింట్స్ :

ఇక సినిమాలో మైనస్ పాయింట్స్ కోసం మాట్లాడితే స్టార్టింగ్ లోనే ఈ సినిమా కథ కోసం చెప్పాలి. ఈ సినిమా కూడా అన్ని ఈ తరహా సినిమాల్లానే రొటీన్ ప్లాట్ లో ఉంటుంది. దీనితో కొత్త కథ కోరుకునే వారికి అయితే నిరాశ తప్పదు.

అలాగే సినిమా నిడివి కూడా కాస్త ఎక్కువే దీనితో అక్కడక్కడా ఎమోషన్స్ బాగున్నా కొన్ని సన్నివేశాల్లో సినిమా చాలా స్లో గా సాగుతున్నట్టు అనిపిస్తుంది. వీటితో పాటుగా మరికొన్ని సన్నివేశాలను అయితే ఇంకా బెటర్ గా చూపించాల్సింది, పలు సన్నివేశాల్లో లాజిక్స్ కూడా కరెక్ట్ గా అనిపించవు. అలాగే కొన్ని పాత్రలను ఇంకా బెటర్ గా డిజైన్ చేసి ఉంటే బాగుండేది.

సాంకేతిక వర్గం :

ఈ చిత్రంలో నిర్మాణ విలువలు బాగున్నాయి. అలాగే టెక్నికల్ టీం లో సంగీత దర్శకుడు నోబిన్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కోసం స్పెషల్ మెన్షన్ ఇవ్వొచ్చు. ఎడిటింగ్ ఇంకా బెటర్ గా గ్రిప్పింగ్ గా చెయ్యాల్సింది. అలాగే సినిమాటోగ్రఫీ బాగుంది.

ఇక దర్శకుడు కిరణ్ రాజ్ విషయానికి వస్తే తాను రాసుకున్న ఎమోషనల్ కథ కేవలం ఎమోషన్స్ వరకు బాగా మెప్పిస్తుంది. కానీ ఇతర అంశాలు కూడా ఆకట్టుకునే విధంగా రాసుకొని ఉంటే ఇంకా బెటర్ అవుట్ పుట్ వచ్చి ఉండేది. ఓవరాల్ గా అయితే తన వర్క్ ఓకే అని చెప్పొచ్చు.

తీర్పు :

ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ “చార్లీ” లో ఉన్న ఎమోషన్స్ తప్పకుండా ప్రేక్షకుల హృదయాలను హత్తుకుంటాయి. రక్షిత్ శెట్టి సెటిల్డ్ పెర్ఫామెన్స్ తనకి చార్లీకి మధ్య ఉండే సన్నివేశాలు డాగ్ లవర్స్ ని మరింత ఆకర్షిస్తాయి. కాకపోతే కాస్త డల్ గా సాగే కథనం రొటీన్ కథ వంటివి నిరాశ పరుస్తాయి. మరి వీటిని పక్కన పెట్టి ఒక డీసెంట్ ఎమోషనల్ ఫిల్మ్ చూడాలి అనుకుంటే ఈ వారాంతానికి తప్పకుండా ఈ సినిమా చూడొచ్చు.

123telugu.com Rating: 2.75/5

Reviewed by 123telugu Team 

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు