సమీక్ష : “ఆకాశ వీధుల్లో” – ఘాటు ప్రేమ వర్సెస్ మత్తు పానీయాలు !

సమీక్ష : “ఆకాశ వీధుల్లో” – ఘాటు ప్రేమ వర్సెస్ మత్తు పానీయాలు !

Published on Sep 3, 2022 11:09 PM IST
Aakasa Veedhullo Movie Review

విడుదల తేదీ : సెప్టెంబర్ 02, 2022

123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5

నటీనటులు: గౌతమ్ కృష్ణ, పూజిత పొన్నాడ, దేవి ప్రసాద్, బాల పరాశర్, సత్యం రాజేష్, శ్రీకాంత్ అయ్యంగార్, హర్షిత గౌర్ తదితరులు

దర్శకత్వం : గౌతమ్ కృష్ణ

నిర్మాతలు: మనోజ్ జేడీ, డాక్టర్ డీజే మణికంఠ

సంగీత దర్శకుడు: జూడా శాండీ

సినిమాటోగ్రఫీ: విశ్వనాధ్ రెడ్డి

ఎడిటర్: వంశీ కృష్ణ

యంగ్ హీరో గౌతమ్‌ కృష్ణ హీరోగా నటిస్తూ దర్శకత్వ బాధ్యతలను చేపట్టిన సినిమా ‘ఆకాశ వీధుల్లో’. కాగా ఈ చిత్రం ఈ రోజే విడుదల అయింది. మరి ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం!

 

కథ :

 

సిద్దార్ధ్ కృష్ణ (గౌతమ్ కృష్ణ)కు మ్యూజిక్‌ అంటే ప్రాణం. చదువు పై అతనికి అంతగా ఫోకస్ ఉండదు. అయితే, అతని తండ్రి (దేవీ ప్రసాద్)కి మాత్రం ఇది ఇష్టం ఉండదు. ఈ క్రమంలో కొన్ని నాటకీయ పరిణామాల మధ్య సిద్ధూ అలియాస్ సిద్దార్ధ్ కృష్ణకు నిషా (పూజిత పొన్నాడ) పరిచయం అవుతుంది. ఆమెతో ప్రేమలో పడతాడు. ఆమె కూడా అతను పెద్దగా కష్టపడకుండానే అతని ప్రేమలో పడుతుంది. ఇద్దరూ ప్రేమ లోతులను చూస్తారు. కానీ.. వీరి ప్రేమ నిషా తండ్రికి ఇష్టం ఉండదు. దాంతో నిషా.. సిద్ధూని వదిలి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత సిద్ధూ జీవితం పూర్తిగా మారిపోతుంది. మత్తుకు బానిస అవుతాడు. మద్యానికి అలవాటు పడి, డ్రగ్ అడిక్ట్ అవుతాడు. అయితే, మధ్యలో సిద్ధూ రాక్ స్టార్ గా మంచి పేరు తెచ్చుకుంటాడు. కానీ, అతని ప్రవర్తన కారణంగా ఆ పేరు కూడా పోతుంది. మరి చివరకు సిద్ధూ తిరిగి రాక్ స్టార్ గా ఎలా నిలబడతాడు?, అతనిలో మార్పు రావడానికి నిషా ఎలా ఉపయోగపడుతుంది?, చివరకు నిషా – సిద్ధూ ప్రేమ కథ ఎలా ముగుస్తుంది? అనేది మిగిలిన కథ.

 

ప్లస్ పాయింట్స్ :

 

ఈ సినిమాలో హీరోగా నటించిన గౌతమ్ కృష్ణ నటన పరంగా చక్కగా నటించాడు. తన మొదటి సినిమా అయినా నటనలో అతను చాలా ఈజ్ తో యాక్ట్ చేశాడు. గౌతమ్ కృష్ణ నటనే సినిమాకి ప్లస్ అయింది. తన డైలాగ్ డెలివరీ మరియు తన బాడీ లాంగ్వేజ్ తో ఎంతో అనుభవం ఉన్న నటుడిలా గౌతమ్ కృష్ణ మెప్పించాడు.

ఇక సినిమాలో హీరోయిన్ గా పూజిత పొన్నాడ చాలా అందంగా కనిపిస్తూ.. తన నటనతోనూ ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ముఖ్యంగా కొన్ని బోల్డ్ సన్నివేశాల్లో ఆమె ఎక్స్ ప్రెషన్స్ బాగా అలరిస్తాయి. సినిమాలో హీరోకి తండ్రిగా కనిపించిన దేవి ప్రసాద్, అలాగే హీరోకి ఫ్రెండ్ పాత్రలో నటించిన నటుడు కూడా తమ పాత్రల్లో ఒదిగిపోయారు. అలాగే హీరోకి అతని ఫాదర్ కి మధ్య వచ్చే కొన్ని భావోద్వేగ సన్నివేశాలు కూడా బాగున్నాయి. ఇక సత్యం రాజేష్, శ్రీకాంత్ అయ్యంగార్ అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు.
 

మైనస్ పాయింట్స్ :

 

గౌతమ్ కృష్ణ నటుడిగా ఆకట్టుకున్నా.. దర్శకుడిగా మాత్రం ఫెయిల్ అయ్యాడు. గౌతమ్ కృష్ణ ఓ తాగుబోతు రాక్ స్టార్ కథకు సంబంధించి మంచి స్టోరీ లైన్ ను తీసుకున్నారు కానీ, ఆ లైన్ ను పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా కథాకథనాలను రాసుకోలేదు. దీనికి తోడు సినిమాలో కొన్ని కీలక సన్నివేశాలు కూడా సినిమాటిక్ గా అనిపిస్తాయి తప్ప, ఇన్ వాల్వ్ అయ్యే విధంగా అనిపించవు.

సినిమాను ఇంకా ఆసక్తికరంగా మలిచే అవకాశం ఉన్నప్పటికీ.. దర్శకుడు గౌతమ్ కృష్ణ మాత్రం ఆ దిశగా సినిమాని మలచలేదు. ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్స్ మినహా మిగతా సన్నివేశాలు అంతగా ఆకట్టుకోవు. పైగా కొన్ని సన్నివేశాల్లో నాటకీయత ఎక్కువవడంతో కథలో సహజత్వం చాలా వరకు లోపించింది.

కానీ సినిమాలో దర్శకుడు చెప్పాలనుకున్న కథాంశం బాగుంది. కథాంశం బాగున్నా ఓవరాల్ గా ఈ చిత్రం నెమ్మదిగా సాగుతూ బోర్ కొట్టిస్తోంది. మొత్తమ్మీద బోల్డ్ సీన్స్ వర్సెస్ డ్రింగ్ సీన్స్ అన్నట్టు సాగింది ఈ సినిమా.
 

సాంకేతిక విభాగం :

 

సాంకేతిక విభాగంలో చూసుకుంటే.. విశ్వనాధ్ రెడ్డి సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాలోని కొన్ని కీలక దృశ్యాలను కెమెరామెన్ సమర్ధవంతంగా చిత్రీకరించాడు. సంగీత దర్శకుడు జూడా శాండీ అందించిన సంగీతం విషయానికి వస్తే.. కొన్ని పాటలు పర్వాలేదనిపిస్తాయి. అలాగే సన్నివేశాల్లో నేపధ్య సంగీతం కూడా పర్వాలేదు. ఎడిటర్ బోర్ కొట్టించే కొన్ని సన్నివేశాలను ట్రీమ్ చేసి ఉంటే సినిమాకు ప్లస్ అయ్యేది. నిర్మాతలు మనోజ్ జేడీ, డాక్టర్ డీజే మణికంఠ పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

 

తీర్పు :

 

‘ఆకాశ వీధుల్లో’ అంటూ వచ్చిన ఈ చిత్రం ఘాటు ప్రేమ వర్సెస్ మత్తు పానీయాలు అన్నట్టు సాగింది. పైగా ప్రతి సన్నివేశం అటు ఇటుగా ఒకే ఎమోషన్ తో సాగింది. అయితే, హీరో హీరోయిన్ల మధ్య వచ్చే కొన్ని లవ్ అండ్ ఎమోషనల్ సన్నివేశాలు పర్వాలేదనిపిస్తాయి. కానీ, కథాకథనాలు ఆకట్టుకునే విధంగా లేకపోవడం, లాజిక్ లెస్ సీన్స్, బోరింగ్ ట్రీట్మెంట్ వంటి అంశాలు వల్ల సినిమా ఆకట్టుకోదు. అయితే, ట్రెండీ లవర్స్ కు సినిమాలో కొన్ని సీన్స్ కనెక్ట్ అవుతాయి. మిగిలిన వర్గాల ప్రేక్షకులకు మాత్రం ఈ సినిమా బాగా బోర్ కొడుతుంది.

123telugu.com Rating: 2/5

Reviewed by 123telugu Team

సంబంధిత సమాచారం

తాజా వార్తలు