సమీక్ష : “అర్జున ఫల్గుణ” – ఆకట్టుకోని క్రైమ్ డ్రామా

Arjuna Phalguna Movie Review In Telugu

విడుదల తేదీ : డిసెంబర్ 31, 2021

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

నటీనటులు: శ్రీ విష్ణు, అమృతా అయ్యర్, నరేష్, శివాజీ రాజా, సుబ్బ రాజు, దేవీ ప్రసాద్, రంగస్థలం మహేష్, రాజ్ కుమార్ చౌదరి, చైతన్య తదితరులు

దర్శకత్వం : తేజ మర్ని

నిర్మాత: నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి

సంగీత దర్శకుడు: ప్రియదర్శన్ బాలసుబ్రహ్మణ్యన్

సినిమాటోగ్రఫీ: జగదీష్ చీకటి

ఎడిటర్ : విప్లవ నైషదం

ఇక ఈ ఏడాదికి చిట్ట చివరి సినిమాగా టాలెంటెడ్ హీరో శ్రీ విష్ణు కి ఇదే ఏడాదిలో హ్యాట్రిక్ సినిమాగా థియేటర్స్ లోకి వచ్చిన తాజా చిత్రం “అర్జున ఫల్గుణ”. దర్శకుడు తేజ మర్ని తెరకెక్కించిన ఈ సినిమా డీసెంట్ బజ్ తో ఈరోజు రిలీజ్ అయ్యింది. మరి ఈ చిత్రం ప్రేక్షకులని ఎంత మేర ఆకట్టుకుందో ఇప్పుడు సమీక్షలో తెలుసుకుందాం.

 

కథ:

 

ఇక కథలోకి వచ్చినట్టయితే.. అర్జున్(శ్రీ విష్ణు) గోదావరి ప్రాంతపు ఒక చిన్న గ్రామంలో తన నలుగురు ఫ్రెండ్స్ తో జీవనం సాగిస్తూ ఉంటాడు. అయితే ఫ్రెండ్షిప్ పరంగా వీరు అందరు ఒకరి కోసం ఇంకొకరు ఎంత దూరం అయినా వెళ్ళడానికి వెనకాడని రేంజ్ లో కనిపిస్తారు. ఇక ఇదిలా ఉండగా శ్రీ విష్ణు ఫ్రెండ్స్ లో ఒకడైన రంగస్థలం మహేష్ అనుకోని రీతిలో ఒక పెద్ద సమస్యలో ఇరుక్కుంటాడు. ఈ క్రమంలో తన ఫ్రెండ్ కోసం శ్రీ విష్ణు ఎలాంటి స్టెప్ తీసుకున్నాడు? అది ఎంత ప్రమాదకరమైంది? అక్కడ నుంచి వీరి జీవితాలు ఎలాంటి మలుపు తీసుకున్నాయి అనేది తెలియాలి అంటే వెండితెరపై ఈ సినిమా చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్:

 

ఈ సినిమాలో మొదటగా మాట్లాడుకోవాల్సి వస్తే అది హీరో శ్రీ విష్ణు కోసం అని చెప్పాలి. తన సినిమా సినిమాకి నటనలో మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అలానే ఈ సినిమాలో కూడా తనదైన ఈజ్ నటనను కనబరిచి సినిమాకి తానై నడిపించాడు. గోదావరి ప్రాంతపు కుర్రాడిలా ఆ యాస నడవడికతో సెటిల్డ్ పెర్ఫామెన్స్ ని ఇచ్చాడు. అలాగే ఈ సినిమాలో కూడా తన కామెడీ టైమింగ్ హైలైట్ అని చెప్పొచ్చు. ఇక

అలాగే యంగ్ అండ్ టాలెంటడ్ హీరోయిన్ అమృత అయ్యర్ పాత్ర కూడా బాగుంటుంది. గ్రామ వాలంటీర్ గా కాస్త మాస్ గానే కనిపిస్తూ చక్కటి హావభావాలతో నటించింది. అలాగే శ్రీవిష్ణు కి ఆమెకి మధ్య కెమిస్ట్రీ కూడా బాగుంది. వీరితో పాటుగా మహేష్, మిగతా ఫ్రెండ్స్ గా కనిపించిన వారు తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారు.

వీరితో పాటుగా నెగిటివ్ రోల్ లో కనిపించిన నరేష్ కూడా ఆ రోల్ కి న్యాయం చేశారు. ఈ సినిమాలో మరో మేజర్ ప్లస్ ఏదన్నా ఉంది అంటే మ్యూజిక్ కోసం చెప్పాలి. కొత్త సంగీత దర్శకుడు ప్రియదర్శన్ ఇచ్చిన స్కోర్ సాలిడ్ గా ఇంప్రెస్ చేస్తుంది. ఇక అలాగే పలు కీలక సన్నివేశాలు కాస్త ఇంప్రెస్ చేస్తాయని చెప్పొచ్చు. ట్రైన్ సీక్వెన్స్, కొన్ని క్రైమ్ ఎపిసోడ్స్ బాగుంటాయి.

 

మైనస్ పాయింట్స్:

 

ఈ చిత్రంలో ఆకట్టుకునే అంశాలు తక్కువ రుచించని అంశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పాలి. సినిమా చూస్తున్నంతసేపు కూడా కథనం చాలా సో సో గానే నడుస్తున్నట్టు అనిపిస్తుంది. చాలా సన్నివేశాలు బోరింగ్ గా ఏదో అలా సాగుతున్నట్టు అనిపిస్తాయి కానీ ఓ రేంజ్ లో ఇంప్రెస్ చేసినట్టు ఓవరాల్ గా అనిపించదు.

అలాగే సినిమా కథనంలో లాజిక్స్ కూడా ఎక్కడా పొంతన లేకుండా ఉన్నట్టు అనిపిస్తాయి. దీనితో చాలా మేర సినిమా సిల్లీగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇంకా మరికొన్ని అనవసర సన్నివేశాలు ఇరికించినట్టుగా అనిపిస్తాయి. అలాగే సినిమాలో అన్ని వేళలా కామెడీ కూడా పెద్దగా వర్కౌట్ అయ్యినట్టు అనిపించదు.

కొన్ని కీలక సన్నివేశాలు అయితే చాలా సేపు సాగదీత తర్వాత వస్తాయి అప్పుడు వరకు ఆడియెన్స్ కి సినిమా డల్ గానే అనిపిస్తుంది. ఇంకా సినిమాలో కనిపించే పాత్రలు కానీ వాటితో రిలేటెడ్ గా ఉండే ఎమోషన్స్ అంత స్ట్రాంగ్ గా కూడా కనిపించవు. దీనితో సినిమాపై ఆసక్తి మరింత లోపిస్తుంది.

 

సాంకేతిక వర్గం:

 

ఈ సినిమాకి మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ వారి నిర్మాణ విలువలు డీసెంట్ గా ఉన్నాయి. అలాగే టెక్నికల్ టీం విషయానికి వస్తే జగదీశ్ చీకటి సినిమాటోగ్రఫీ నీట్ గా ఉంది. తాను చూపించిన లొకేషన్స్ బావున్నాయి. అలాగే డైలాగ్స్ కూడా ఈ సినిమాలో బాగున్నాయి. ఇక ముందు చెప్పినట్టుగా సంగీత దర్శకుని పనితీరు సినిమాకి మంచి ప్లస్ అయ్యింది. అలాగే ఎడిటింగ్ మాత్రం జాగ్రత్త వహించాల్సి ఉంది.

ఇక నూతన దర్శకుడు తేజ మర్ని విషయానికి వస్తే తాను డైరెక్టర్ గా ఏదో చెయ్యాలనే తపనతో కథనాన్ని కాస్త పక్కదారి పట్టించినట్టు చేసాడు. ఎంచుకున్న కీలక పాయింట్ దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తూ సాగే నేపథ్యం పర్వాలేదు అనిపించినా ఎందుకో దానిని అంత ఆసక్తిగా మలచలేకపోయాడు. చాలా ల్యాగ్ లు తన డైరెక్షన్ లో నోటీస్ చెయ్యొచ్చు. మరి మున్ముందు ఇలాంటి తాను రిపీట్ చెయ్యకుండా ఉంటే బెటర్.

 

తీర్పు:

 

ఇక మొత్తంగా చూసినట్లయితే ఈ “అర్జున ఫల్గుణ” లో ఒక్క శ్రీ విష్ణు సిన్సియర్ అటెంప్ట్ అలాగే ఇతర నటీనటుల నటన కొన్ని ఆకట్టుకునే చిన్నపాటి సన్నివేశాలు మినహా ఇక గొప్పగా చెప్పుకునే అంశాలు అయితే ఇందులో కనిపించవు. దర్శకుని వైఫల్యం ఈ సినిమా ఫలితాన్ని కాస్త దెబ్బ తీసింది. ఓవరాల్ గా అయితే ఈ క్రైమ్ డ్రామా అనుకున్న స్థాయిలో ఆకట్టుకోదు.

123telugu.com Rating : 2.25/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం :