ఆడియో సమీక్ష : నాయక్ – మాస్ మసాలా డాన్స్ ఆల్బం

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ మూవీ ‘నాయక్’ చిత్ర ఆడియో నిన్న సాయంత్రం నానక్ రామ్ గూడలోని రామానాయుడు స్టూడియోలో అభిమానుల మధ్య విడుదలైంది. మొత్తం 6 పాటలున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించాడు. చరణ్ డాన్స్ అదరగొట్టే రేంజ్ లో తమన్ ట్యూన్స్ అందించాడా లేదా చూద్దాం.

1. పాట : లైలా ఓ లైలా

గాయకులు : శంకర్ మహదేవన్, రంజిత్, రాహుల్, నవీన్

సాహిత్యం : చంద్రబోస్

లైలా ఓ లైలా సాంగ్ రామ్ చరణ్ ఇంట్రడక్షన్ సాంగ్ లాగా వాడినట్లు తెలుస్తుంది. చరణ్ డాన్స్ వేయడానికి బాగా స్కోప్ ఉన్న సాంగ్ ఇది. వీడియో సాంగ్ ప్రోమో చూస్తే చరణ్ డాన్సులు బాగా చేసినట్లు అర్ధమవుతుంది. ముందు వరుస అభిమానుల చేత కూడా డాన్సు వేయించే సాంగ్. సింగర్స్ అందరూ ఒక రిథమిక్ గా పాడటం వల్ల శంకర్ మహదేవన్ వాయిస్ మిస్సయినట్లు అనిపిస్తుంది. చంద్రబోస్ సాహిత్యం పర్వాలేదు.

 

2. పాట : కత్తి లాంటి పిల్లా

గాయకులు : తమన్, శేఫాల్ అల్వారిస్

సాహిత్యం : చంద్రబోస్

తమన్, శేఫాలి అల్వారిస్ పాడిన ఈ డ్యూయెట్ సాంగ్ చరణ్, కాజల్ మీద చిత్రీకరించారు. సాహిత్యం గురించి పెద్దగ చెప్పుకోవడానికి ఏమీ లేదు. తమన్ రెగ్యులర్ స్టైల్లో పాడాడు. బాలీవుడ్ సింగర్ శేఫాల్ అల్వారిస్ తో మొదటిసారి తెలుగులో పాడించారు. ఆమె వాయిస్ హస్కీగా కొత్తగా ఉంది. ఈ పాట వీడియో ప్రోమోలో చూపించినట్లు అందమైన లోకేషన్లలో చిత్రీకరించారు.

 

3. పాట : శుభలేఖ రాసుకున్నా

గాయకులు : హరిచరణ్, శ్రేయ ఘోషల్

సాహిత్యం : కీ..శే.. వేటూరి

మెగాస్టార్ చిరంజీవి సూపర్ హిట్ సాంగ్స్ చరణ్ సినిమాల్లో రీమిక్స్ చేసి వాడుకోవడం మగధీర నుండి నడుస్తుంది. ఈ సినిమాలో శుభలేఖ రాసుకున్నా పాటని రీమిక్స్ చేసారు. శ్రేయ ఘోషల్ బాగానే పాడినప్పటికీ హరిచరణ్ గొంతు మాత్రం ఈ పాటకి అంత నప్పలేదని తెలిసిపోతుంది. ఒరిజినల్ పాటతో పోల్చి చూస్తే మాత్రం దానికి ఏ మాత్రం సరితూగే పాట కాదని చెప్పుకోవాలి.

 

4. పాట : హే నాయక్

గాయకులు : శ్రేయ ఘోషల్

సాహిత్యం : చంద్రబోస్

హే నాయక్ పాట ఈ సినిమాలో టైటిల్ సాంగ్ అని చెప్పుకోవచ్చు. శ్రేయ ఘోషల్ ఫుల్ స్టైల్లో పాడింది. కోరస్ కూడా సరిగ్గా పాడారు. తమన్ గతంలో ఇలాంటి పాటలు తమిళ్ సినిమాలు ఇచ్చాడు. ఇటీవల తమిళ్లో వచ్చిన ఒస్తి సినిమాలోని టైటిల్ సాంగ్ పోలికలు కనిపిస్తాయి. హీరోతో ఇద్దరు హీరోయిన్స్ మీద చిత్రీకరించిన ఈ పాటలో డాన్సులు బాగా ఆశించవచ్చు. చంద్రబోస్ ట్యూన్ కి తగ్గట్లు సాహిత్యాన్ని రాసుకున్నాడు.

 

5. పాట : నెల్లూరే

గాయకులు : సుచిత్ర, జస్ప్రీత్ జస్జ్

సాహిత్యం : సాహితి

ఈ ఆల్బంలో టాప్ సాంగ్ ఇదే. ఫుల్ జోష్ తో మాస్ స్టైల్లో సాగే ఈ పాట ధియేటర్లో మారుమ్రోగి పోవడం ఖాయం. గతంలో రచ్చ సినిమాలో డిల్లకు డిల్లకు పాటకి కోరియోగ్రఫీ అందించిన జానీ మాస్టర్ ఆధ్వర్యంలో ఈ పాట చిత్రీకరించారు. చరణ్ నుండి ఫుల్ డాన్స్ ఆశించవచ్చు. గబ్బర్ సింగ్ సినిమాలో కెవ్వు కేక పాటకి సాహిత్యం అందించిన సాహితి ఈ పాటని రాసాడు.

 

6. పాట : ఒకచూపుకే పడిపోయా
గాయకులు : విజయ్ ప్రకాష్, బిందు మహిమ

సాహిత్యం : భాస్కరభట్ల

ఇది రొటీన్ తమన్ స్టైల్ పాట. చరణ్, కాజల్ మీద చిత్రీకరించారు ఈ డ్యూయెట్ పాటని. అందమైన లోకేషన్లలో చిత్రీకరించినట్లు వీడియో ప్రోమో చూస్తేనే అర్ధమైపోతుంది. రెండవ చరణం ముందు వచ్చే బిట్ అంతగా ఆకట్టుకోలేదు. విజయ్ ప్రకాష్ బాగా పాడాడు కానీ బిందు మహిమ గొంతులో మహిమ మాత్రం కనపడలేదు. భాస్కరభట్ల సాహిత్యం పర్వాలేదు. ఇంగ్లీష్ పదాలు ఎక్కువగా వాడారు.

తీర్పు :

నాయక్ ఆడియో ఆల్బంలో చరణ్ చేత స్టెప్పులు వేయించే పాటలు ఉన్నాయి. వాటిలో లైలా ఓ లైలా, నెల్లూరే, హే నాయక్ పాటలు డాన్స్ వేయడానికి బాగా స్కోప్ ఉన్న పాటలు అందించాడు తమన్. ఆల్బంలో టాప్ 3 సాంగ్స్ కూడా ఇవే అని చెప్పుకోవాలి. కతిలాంటి పిల్లా యువతని అక్కట్టుకోగా మిగతా రెండు యావరేజిగా ఉన్నాయి.

అశోక్ రెడ్డి .ఎమ్

 

సంబంధిత సమాచారం :

X
More