ఆడియో సమీక్ష : బిజినెస్ మాన్

Published on Dec 26, 2011 2:40 pm IST

“దూకుడు” లాంటి భారి విజయం తరువాత మహేష్ బాబు చేస్తున్న చిత్రం “బిజినెస్ మాన్”. ఈ చిత్రానికి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నారు. జనవరి 11 న ఈ చిత్రాన్ని విడుదల చెయ్యటానికి అన్ని ఏర్పాట్లు పూర్తి అయిపోయాయి. నిన్న (డిసెంబర్ 22 ) ఈ చిత్రం సంగీతాన్నిశిల్ప కళా వేదిక లో ఘనంగా విడుదల చేసారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం సమకూర్చారు దూకుడు లాంటి విజయాన్ని మళ్ళి అందుకోవాలని చూస్తున్నారు. ఇప్పుడు ఈ చిత్ర సంగీతం ఎలా వుందో చూద్దాం.

 

1 .పాట : ఆమ్చిముంబై
గాయకులు : రంజిత్ , రాహుల్ నంబియార్ , నవీన్ , ఆలప్ రాజు
రచయిత : భాస్కర్ బట్ల రవి కుమార్

ఈ పాట హీరో పరిచయ పాటగా ఉంటుంది. బృంద గానం తో పాట చాలా బాగుంది. ఈ పాటలో ముంబై కి చెందిన పలు కోణాల గురించి చెప్పారు. సిన్తసైసర్,పర్కుసన్ వాయిద్యాలు మరియు ఎలెక్ట్రిక్ గిటార్ బాగా డామినేట్ చేస్తాయి. గాయకుల లో మంచి ఎనర్జీ ఉంది. పాటలో ని భావాలని వ్యక్తపరిచేల పాడారు. భాస్కర్ బట్ల సాహిత్యం కోరస్ మరియు వాయిద్యాల తో పోటిలో వెనకపడిపోయింది. ఈ పాట చాలా ఉత్సాహకరంగా ఉంది చిత్రీకరణ కూడా బాగుండేలా అనిపిస్తుంది.

 

 

 

2 .పాట : సార ఒస్తారా
గాయకులు : సుచిత్ర, తమన్ .ఎస్
రచయిత : భాస్కర్ బట్ల రవి కుమార్

ఈ పాట మళ్ళి మళ్ళి వినాలనిపించేలా ఉంది. ఈ ఆల్బం లో బాగుండే పాటలలో ఇది కూడా ఒకటి. సుచిత్ర అద్బుతంగా పాడింది పాటలోని భావాన్ని అద్బుతంగా పలికించింది. తమన్ కూడా మంచి సహకారాన్ని ఇచ్చాడు. భాస్కర్ బట్ల సాహిత్యం పరవాలేదు అనిపించగా. తమన్ సంగీతం ఈ పాటకి ప్రాణం పోసింది. పాట ని ముగించిన విధానం కూడా చాలా బాగుంది. తమన్ అన్ని పాటలు లాగే ఇందులో కూడా సిన్తసైసర్ మరియు పర్కుసన్ వాయిద్యాలు భారీగా ఉపయోగించారు.

 

3 .పాట : పిల్లా చావ్
గాయకులు : రాహుల్ నంబియార్
రచయిత : భాస్కర్ బట్ల రవి కుమార్

ఈ సోలో పాట చిత్రం లో ఉన్న మరొక మంచి పాట. పిల్లా చావ్ అంటే హీరోయిన్ ప్రేమని కాదన్నపుడు హీరో భావాలకి సంబంధించింది గా ఉంది. ఈ పాట వినటానికి చాలా గమ్మతుగా తొందరగా జనం లో కి వెళ్ళేల ఉంది. రాహుల్ నంబియార్ చాలా అద్బుతంగా పాడాడు సంగీతం తో పోటీగా పాడాడు సాక్సాఫోన్ మరియు సిన్తసైసర్ వాయిద్యాలను సరిగ్గా వాడుకున్నారు. భాస్కర్ బట్ల గారి సాహిత్యం కూడా బాగుంది.

 

 

4.పాట : చందమామ నువ్వే
గాయకులు : హరిచరణ్
రచయిత : భాస్కర్ బట్ల రవి కుమార్

ఇది మరో సోలో పాట హరిచరణ్ పాడారు. ఈ పాట హీరోయిన్ కి దూరమయిన హీరో భావాలకి సంబంధించింది. హరిచరణ్ అద్బుతమయిన ప్రదర్శన ఇచ్చాడు. సంగీతం పరవాలేదు అనిపించగా కొన్ని బీట్స్ ఎక్కడో విన్నట్టు అనిపిస్తుంది. ఈ పాటని తెర మీద అద్బుతంగా చూపించే ఆవకాశం ఉంది.

 

5 .పాట : బాడ్ బోయ్స్
గాయకులు: ప్రియా హిమేష్ , గీతా మాధురి
రచయిత : భాస్కర్ బట్ల రవి కుమార్

చిత్రం లో ఇది ఐటెం సాంగ్. పూరి జగన్నాథ్ ఐటెం సాంగ్ అంటే ఎలా ఇస్తారో అందరికి తెలిసిందే . ఈ పాట కూడా ఇంతకముందు ఐటెం సాంగ్ ల కి ఏ మాత్రం తీసిపోకుండా ఉంది. చిత్రీకరణ కూడా పూరి తన శైలి లో చేస్తే చూడటానికి అద్బుతంగా ఉంటుంది ప్రియా హిమేష్ , గీత మాధురి వారి గొంతు ల తో పాటని మంచి ఉత్సాహంగా మలిచారు. భాస్కర్ బట్ల సాహిత్యం పరిస్థితి కి సరిపోయేలా ఉంది. డ్రమ్స్ మరియు సిన్తసైసర్ వాయిద్యాలు మళ్ళి డామినేట్ చేస్తుంది. సంగీతం వేగంగా మరియు గమ్మతుగా ఉంటుంది. మాస్ జనం ని ఈ పాట బాగా ఆకట్టుకుంటుంది.

 

 

6.పాట : బిజినెస్ మాన్ (థీం)
గాయకులు : మహేష్ బాబు , పూరి జగన్నాథ్
రచయిత : భాస్కర్ బట్ల రవి కుమార్

ఈ థీం సాంగ్ ని మహేష్ బాబు మరియు పూరి జగన్ లు పారు. నిజానికి పూరి జగ్ఫాన్ పాట పాడగా మధ్య మధ్యలో మహేష్ బాబు తనదయిన శైలి లో పంచ్ డైలాగ్స్ ఇచ్చారు. పూరి జగన్నాథ్ బాగా పాడారు. ఈ పాటలో బీట్స్ బాగుండగా కొత్తదనంతో నిండి కొత్త అనుభవాన్ని ఇస్తుంది.

 

తీర్పు :

ఈ చిత్రం లో మంచి పాటలు వున్నాయి కాని అందరికి చేరువయ్యేలా కొన్ని జాగ్రతలు తీసుకొని వుంటే బాగుండేది. “పిల్లా చావ్” మరియు “సార్ వస్తార” అనే పాటలు ఆల్బం లో మొదటి స్థానం లో ఉన్నాయి. ఆమ్చి ముంబై మరియు బాడ్ బాయ్స్ మంచి ఎనర్జీ ఉన్న పాటలు జనం లో కి తొందరగా చేరువయ్యేలా ఉంది. ఆల్బం లో చెప్పుకోడానికి తమన్ చెప్పుకోడానికి కొత్తగా ఎం చేయకపోయినా చిత్రానికి సరిపోయేలా సంగీతాన్ని అందించాడు.

– రv

Businessman Audio Review English Version

సంబంధిత సమాచారం :

X
More