సమీక్ష : ‘బ్లాక్’ – బోరింగ్ సస్పెన్స్ థ్రిల్లర్ !

సమీక్ష : ‘బ్లాక్’ – బోరింగ్ సస్పెన్స్ థ్రిల్లర్ !

Published on May 29, 2022 3:02 AM IST
BLACK Movie Review

విడుదల తేదీ : మే 28, 2022

123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5

నటీనటులు: ఆది సాయికుమార్, దర్శన బానిక్, కౌశల్ తదితరులు

దర్శకత్వం : జి బి కృష్ణ

నిర్మాత: మహంకాళి దివాకర్

సంగీత దర్శకుడు: సురేష్ బొబ్బిలి

సినిమాటోగ్రఫీ: సతీష్ ముత్యాల

ఎడిటర్: అమర్ రెడ్డి

హీరో ఆది సాయి కుమార్ హీరోగా జి బి కృష్ణ దర్శకత్వం లో మహంకాళి దివాకర్ నిర్మించిన చిత్రం “బ్లాక్”. మరి ఈ చిత్రం ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుందో సమీక్షలోకి వెళ్లి చూద్దాం.

 

కథ :

 

ఆదిత్య (ఆది సాయికుమార్), అర్జున్ (ఆది సాయికుమార్) ఇద్దరు బ్రదర్స్. ఐతే, ఆదిత్య పై కోపంతో అర్జున్ చిన్నప్పుడే ఇంటి నుంచి పారిపోతాడు. మరోపక్క ఆదిత్య కానిస్టేబుల్ అవుతాడు. ఆదిత్య నైట్ షిఫ్ట్ లు చేస్తున్న క్రమంలో ఒక మర్డర్, రాబరీ జరుగుతాయి. ఆ క్రమంలో ఆదిత్యకి హానిక (దర్శన బానిక్) పరిచయం అవుతుంది. ఆ పరిచయం ప్రేమగా మారుతుంది. అంతలో ఆ హత్య ,రాబరీ ఆదిత్యనే చేసినట్లు ఆధారాలు దొరుకుతాయి. కానీ, ఆదిత్యకి వాటితో ఎలాంటి సంబంధం లేదు. చిన్నప్పుడు పారిపోయిన అర్జున్, తన పై పగతోనే తనను ఇలా ఇరికించాడు అని ఆదిత్య నమ్ముతాడు. అసలు ఆ హత్యలు ఎవరు చేశారు ? నిజంగానే అర్జున్, ఆదిత్య పై కోపంతోనే ఇదంతా చేశాడు ? అసలు ఆదిత్యకి ఉన్న డిజార్డర్ ఏమిటి ? దానికి, జరుగుతున్న సంఘటనలకు ఏమైనా సంబంధం ఉందా ? అనేది మిగిలిన కథ.

 

ప్లస్ పాయింట్స్ :

 

ఈ సినిమాలో హీరోగా నటించిన ఆది సాయి కుమార్ తన డైలాగ్ డెలివరీ, తన బాడీ లాంగ్వేజ్ తో అలాగే, కొన్నిఎమోషనల్ అండ్ సప్సెన్స్ సీక్వెన్స్ స్ లో చాలా బాగా నటించాడు. ఇక హీరోయిన్ గా నటించిన దర్శన బానిక్ కూడా తన క్యూట్ అండ్ హోమ్లీ లుక్స్ లో అందంగా కనిపిస్తూ.. తన నటనతోనూ ఆకట్టుకుంది. మరో కీలక పాత్రలో నటించిన బిగ్ బాస్ ఫేమ్ కౌశల్ మండా కూడా తన నటనతో ఆకట్టుకున్నాడు.

ఇక ఈ సినిమాలో ఆది సాయి కుమార్ పాత్ర.. ఆ పాత్రకు సంబంధించిన బ్రదర్ ట్రాక్.. అలాగే ఆ పాత్రతో ముడి పడిన మిగిలిన పాత్రలు.. ఆ పాత్రల తాలూకు పాయింట్ అఫ్ వ్యూస్.. మొత్తానికి ఈ సినిమా ఫస్ట్ హాఫ్ లో కొన్ని అంశాలు పర్వాలేదు. ఇంటర్వెల్ సీక్వెన్స్ కూడా బాగానే ఉంది. స్లీపింగ్ డిజార్డర్ కి సంబంధించిన సీన్స్ కూడా ఓకే అనిపిస్తాయి. మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు.

 

మైనస్ పాయింట్స్ :

 

సినిమా మెయిన్ పాయింట్ లో మ్యాటర్ ఉన్నపటికీ.. ఆ పాయింట్ కి తగ్గట్టు స్క్రీన్ ప్లే రాసుకోవడంలో దర్శకుడు జి బి కృష్ణ విఫలం అయ్యాడు. అసలు ఇలాంటి కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు ఆ కాన్సెప్ట్ కి తగ్గట్టు సినిమాని ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తిస్తూ ర‌క్తి కట్టేలా సాగాలి, కానీ ఈ సినిమాలో అది మిస్ అయింది. జరుగుతున్న హత్యలు ఎవరు చేస్తున్నారు అనే అంశంలోనే బోలెడు సస్సెన్స్ ను మెయింటైన్ చేయవచ్చు. కానీ.. ఈ విషయంలోనూ సినిమా ఎఫెక్టివ్ గా లేదు.

హీరో స్లీపింగ్ డిజార్డర్ ట్రాక్ లోనూ ఎక్కడా లాజిక్ లేదు. పైగా ఆ ట్రాక్ మీదే మెయిన్ ప్లాట్ మొత్తం సాగడంతో సినిమాలో అదే పెద్ద మైనస్ అయింది. దానికి తోడు కొన్ని ఎమోషనల్ సీన్స్ కూడా ఫేక్ గా అనిపిస్తాయి. దర్శకుడు సెకెండాఫ్ ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఇంట్రస్ట్ గా నడుపుదామని మంచి ప్రయత్నం అయితే చేశారు గాని, అది స్క్రీన్ మీద అసలు వర్కౌట్ కాలేదు.

 

సాంకేతిక విభాగం :

 

టెక్నికల్ గా చూసుకుంటే సినిమాలో సాంకేతిక విభాగం వర్క్ బాగానే ఉంది. ముఖ్యంగా సురేష్ బొబ్బిలి సంగీతం సినిమాకు బాగా ప్లస్ అయింది. అదే విధంగా సతీష్ ముత్యాల సినిమాటోగ్రఫీ కూడా సినిమాకి హైలైట్ గా నిలుస్తోంది. కొన్ని కీలక సన్నివేశాల్లో ఆయన పనితనం చాలా బాగుంది. ఎడిటర్ అమర్ రెడ్డి వర్క్ సినిమాకి తగ్గట్టు ఉంది. సినిమాలోని నిర్మాత మహంకాళి దివాకర్ పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ పర్వాలేదు. ఇక దర్శకుడు జి.బి కృష్ణ మంచి కథాంశం తీసుకున్నా ఉత్కంఠభరితమైన కథనాన్ని రాసుకోలేదు.

 

తీర్పు :

 

‘బ్లాక్’ అంటూ వచ్చిన ఈ చిత్రం కొన్ని సస్పెన్స్ ఎలిమెంట్స్ తో, ఫ్యూ థ్రిల్లింగ్ సీన్స్ తో కొన్నిచోట్ల పర్వాలేదనిపిస్తోంది. అలాగే, ఆది సాయి కుమార్ నటన కూడా ఆకట్టుకుంది. అయితే, ఇంట్రెస్టింగ్ గా సాగని ట్రీట్మెంట్ తో పాటు మెయిన్ క్యారెక్టైజేషన్స్ బలహీనంగా ఉండటం, పైగా సినిమాలో ఫేక్ ఎమోషన్స్ వంటి అంశాలు సినిమా ఫలితాన్ని దెబ్బ తీశాయి. ఓవరాల్ గా ఈ చిత్రం ఆకట్టుకోదు.

123telugu.com Rating: 2/5

Reviewed by 123telugu Team 

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు