సమీక్ష : ‘క్యాలీఫ్లవర్’ – సిల్లీ బోరింగ్ డ్రామా !

సమీక్ష : ‘క్యాలీఫ్లవర్’ – సిల్లీ బోరింగ్ డ్రామా !

Published on Nov 27, 2021 3:02 AM IST
Cauliflower Movie Review In Telugu

విడుదల తేదీ : నవంబర్ 26, 2021

123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5

నటీనటులు: సంపూర్ణేష్ బాబు, వాసంతి తదితరులు

దర్శకత్వం : ఆర్కే మలినేని

నిర్మాతలు: ఆశాజ్యోతి గోగినేని

సంగీత దర్శకుడు: ప్రజ్వల్ క్రిష్

ఎడిటింగ్: ముజీర్ మాలిక్

సంపూర్ణేష్ బాబు హీరోగా వచ్చిన చిత్రం ‘క్యాలీఫ్లవర్’. శీలో రక్షతి రక్షితః.. అన్నది ఉపశీర్షిక. ఆర్కే మలినేని దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సంపూ సరసన వాసంతి హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా ఈ రోజు విడుదల అయింది. మరి ప్రేక్షకులును ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.

 

కథ :

 

పరాయి దేశస్తుడు అయిన ఆండీ ఫ్లవర్ (సంపూర్ణేష్ బాబు) ఇండియా వచ్చి ఇక్కడ స్త్రీల గొప్పతనాన్ని తెలుసుకుని, ఈ క్రమంలో ఇక్కడే పెళ్లి చేసుకుని ఒక బిడ్డను కంటాడు. అలా ఆండీ ఫ్లవర్ మనవడే క్యాలీఫ్లవర్ (సంపూర్ణేష్ బాబు). తన తాతయ్య చెప్పిన విధంగా బతుకుతూ 35 ఏళ్ళు వచ్చాకే పెళ్లి అంటూ అమ్మాయిలకు దూరంగా ఉంటాడు. అయితే, ఇలాంటి క్యాలీఫ్లవర్ ను ముగ్గురు అమ్మాయిలు అతి దారుణంగా మానభంగం చేస్తారు. దాంతో తన శీలాన్ని దోచుకున్నారని తనకు న్యాయం చేయాలని క్యాలీఫ్లవర్ పోరాట బాట పడతాడు. ఇక ఆ తర్వాత క్యాలీఫ్లవర్ పోరాటంలో చోటు చేసుకున్న అంశాలు ఏమిటి ? ఇంతకీ క్యాలీఫ్లవర్ ను మానభంగం చేసిన ఆ ముగ్గురు అమ్మాయిలు ఎవరు ? చివరకు క్యాలీఫ్లవర్ జీవితం ఎలాంటి మలుపు తిరిగింది ? అనేది మిగిలిన కథ.

 

ప్లస్ పాయింట్స్ :

 

క్యాలీఫ్లవర్ సాక్షిగా.. శీలో రక్షతి రక్షితః అంటూ క్యాప్షన్ జోడించి మరి ఈ చిత్రాన్ని వదిలారు. కొన్ని చోట్ల వ్యంగ్యంగా చూపిస్తూ దర్శక రచయితలు నవ్వించే ప్రయత్నం చేశారు. ఇక క్యాలీఫ్లవర్ పాత్రలో కనిపించిన సంపూ ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేశాడు. ప్రత్యేకించి తన బాడీ లాంగ్వేజ్ తో కొన్ని కామెడీ హావభావాలను బాగానే పలికించాడు.

ముఖ్యంగా సంపూ ఒంటిపై నూలు పోగు లేకుండా కేవలం ‘క్యాలీఫ్లవర్’ని అడ్డుగా పెట్టుకుని ఒంటి నిండా గాయాలతో అసెంబ్లీ ముందు నిల్చునే సన్నివేశాలు కొంతవరకు ఆకట్టుకున్నాయి. ఇక పోసాని పోలీస్ గా కనిపిస్తూ మెప్పించాడు. అదేవిధంగా మిగిలిన ప్రధాన నటీనటులు కూడా అయా పాత్రల్లో తమ నటనతో ఆకట్టుకున్నారు.

 

మైనస్ పాయింట్స్ :

 

ఈ సినిమా పేరడీ చిత్రాలను ఎంజాయ్ చేసే సాధారణ ప్రేక్షకులకు కొంత వరకు ఆనందాన్ని కలిగించొచ్చు కానీ.. మిగిలిన వర్గాల వారితో పాటు సగటు ప్రేక్షకులకు కూడా ఈ సినిమా రుచించదు. సినిమా నిండా వ్యంగ్యాన్ని సిల్లీ పంచ్ ల ప్యాకేజిని మోతాదుకు మించి పెట్టినా.. అవి కూడా వర్కౌట్ కాలేదు. ఏవి సినిమాని నిలబెట్టలేకపోయాయి.

పైగా సినిమాలో చాలా సన్నివేశాలు పూర్తి సినిమాటిక్ గా అసలు ఏ మాత్రం నమ్మశక్యం కాని విధంగా వాస్తవానికి పూర్తి దూరంగా సాగుతూ అసలు కన్వీన్స్ కానీ విధంగా అనిపిస్తాయి. దానికి తోడు ట్రీట్మెంట్ కూడా బోరింగ్ ప్లే.. స్లో నేరేషన్ తో సాగుతూ సినిమాలోని ఇంట్రెస్టింగ్ ను చంపేసింది. ఆండీ ఫ్లవర్ పాత్రకు సంబంధించిన ట్రాక్ కూడా బాగాలేదు.

అలాగే సినిమాలో సరైన ప్లో కూడా లేకపోవడం, మెయిన్ ట్రీట్మెంట్ లోని కంటెంట్ ఆసక్తికరంగా సాగకపోవడం, మరియు ప్రీ క్లైమాక్స్ అండ్ సెకండ్ హాఫ్ లోని కీలక సన్నివేశాలన్నీ బాగా స్లోగా సాగుతూ నిరుత్సాహ పరచడం వంటి అంశాలు సినిమాకి ప్రధాన మైనస్ పాయింట్స్ గా నిలుస్తాయి.

 

సాంకేతిక విభాగం :

 

సాంకేతిక విభాగం గురించి మాట్లాడుకుంటే.. దర్శకరచయితలు కొన్ని పేరడీ కామెడీ సన్నివేశాల్లో మెప్పించే ప్రయత్నం చేసినా, కథాకథనాలను ఆకట్టుకునే విధంగా రాసుకోలేకపోయారు. ఇక సినిమాటోగ్రఫీ పర్వాలేదు. సంగీత దర్శకుడు అందించిన సంగీతం జస్ట్ ఓకే అనిపిస్తుంది. ఎడిటర్ పర్వాలేదు. నిర్మాతలు పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ సినిమాకి తగ్గట్లే ఉన్నాయి.

 

తీర్పు :

 

పేరడీ అంశాలతో సినిమాలు చేసే సంపూ .. ఈ సారి కూడా తన శైలి సినిమాతో ‘క్యాలీఫ్లవర్’ అంటూ వచ్చాడు. కానీ సినిమా మాత్రం ఆకట్టుకునే విధంగా సాగలేదు. ఏ మాత్రం నమ్మశక్యం కాని పూర్తి కాల్పనిక కథలో బాగా స్లోగా సాగుతూ నిరుత్సాహ పరిచే కథనంతో మరియు బోరింగ్ ట్రీట్మెంట్ తో అండ్ వర్కౌట్ కానీ కామెడీ సీన్స్ తో ఈ సినిమా బాగా బోర్ కొడుతుంది. ఓవరాల్ గా ఈ సినిమా నిరుత్సాహ పరుస్తోంది.

123telugu.com Rating : 2/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు