సమీక్ష : చీకటి రాజ్యం – సూపర్ యాక్షన్, ఓకే థ్రిల్స్!!

Cheekati Rajyam review

విడుదల తేదీ : 20 నవంబర్ 2015

123తెలుగు.కామ్ రేటింగ్ : 3.25/5

దర్శకత్వం : రమేష్ ఎం సెల్వ

నిర్మాత : చంద్రహాసన్ – కమల్ హాసన్

సంగీతం : జిబ్రాన్

నటీనటులు : కమల్ హాసన్, త్రిష, ప్రకాష్ రాజ్, మధు శాలిని, సంపత్..


ఎప్పటికప్పుడు డిఫరెంట్ కాన్సెప్ట్ లతో సినిమాలు చేసే ఉలగనాయగన్ కమల్ హాసన్ నుంచి వచ్చిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ ‘చీకటి రాజ్యం’. ఫ్రెంచ్ మూవీ ‘స్లీప్ లెస్ నైట్’ అనే సినిమాకి అధికారిక రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాలో త్రిష, ప్రకాష్ రాజ్, మధు శాలిని, సంపత్ లు ముఖ్య పాత్రలు పోషించారు. డ్రగ్ మాఫియా నేపధ్యంలో సాగే ఈ సరికొత్త తరహా యాక్షన్ థ్రిల్లర్ కి రాజేష్ ఎం సెల్వ డైరెక్టర్. తెలుగు ప్రేక్షకులకి బాగా తక్కువ పరిచయం ఉన్న ఈ జానర్ తెలుగు ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించింది అనేది ఇప్పుడు చూద్దాం..

కథ :

నార్కోటిక్ కంట్రోల్ బ్యూరోలో పనిచేసే స్పెషల్ పోలీస్ ఆఫీసర్ దివాకర్(కమల్ హాసన్). చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ అయిన దివాకర్ ఓ సారి డబ్బు కోసం తన సహా ఉద్యోగి మణి(యుగి సేతు)తో కలిసి వేరేవాళ్ళు స్మగుల్ చేస్తున్న కొకెయిన్ పాకెట్స్ ని కొట్టేస్తారు. ఈ క్రమంలో కమల్ బ్యాచ్ కొకెయిన్ బ్యాచ్ లో ఒకడిని చంపేస్తారు. దాంతో ఆ ఇన్సిడెంట్ పై ఇన్వెస్టిగేట్ చేయడానికి నార్కోటిక్ ఆఫీసర్స్ అయిన మోహన్(కిషోర్), మల్లిక(త్రిష) రంగంలోకి దిగుతారు. కట్ చేస్తే ఆ కొకెయిన్ పాకెట్స్ మాదాపూర్ లో ఇన్సోమియా అనే నైట్ క్లబ్ నడిపే విట్టల్ రావు(ప్రకాష్ రాజ్)కి సంబంధించినవి.

విట్టల్ రావు కి ఆ కొకెయిన్ పాకెట్స్ చాలా అవసరం, దాంతో అవి కొట్టేసింది దివాకర్ అని తెలుసుకొని తన కొడుకుని కిడ్నాప్ చేస్తాడు. అలా కిడ్నాప్ చేసి తన కొకెయిన్ ఇచ్చేస్తే కొడుకును రిలీజ్ చేస్తానని, కొకెయిన్ తీసుకొని తన ఇన్సొమియా పబ్ కి రమ్మంటాడు. అలా బయలుదేరిన దివాకర్ ని మల్లికా కూడా ఫాలో చేస్తుంది. కొడుకును విడుదల చేసుకోవడానికి బయలుదేరిన దివాకర్ ఫేస్ చేసిన ప్రాబ్లెమ్స్ ఏమిటి? మల్లిక అండ్ మోహన్ వలన దివాకర్ క్రియేట్ అయిన ఇబ్బందులేమిటి? ఫైనల్ గా దివాకర్ తన కొడుకును కాపాడుకున్నాడా లేదా? నేషనల్ వైడ్ గా ది బెస్ట్ నార్కోటిక్ ఆఫీసర్ అనిపించుకున్న దివాకర్ ఏ రీజన్ తో ఆ కొకెయిన్ దొంగతనం చేసాడు అన్నది? మీరు వెండితెరపై చూసి తెలుసుకోవాల్సిన కథ.

ప్లస్ పాయింట్స్ :

యాక్షన్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో వచ్చిన చీకటి రాజ్యం సినిమాలో ది బెస్ట్ అని చెప్పుకోవాల్సింది నటీనటుల ఎంపిక మరియు వారి నటన.. ప్రతి పాత్రకి వీళ్ళే పర్ఫెక్ట్ అనేలా నటీనటుల్ని ఎంపిక చేసారు. ముందుగా కమల్ హాసన్ గురించి చెప్పుకోవాలి.. ఒక నార్కోటిక్ పోలీస్ ఆఫీసర్ గా కమల్ హాసన్ పెర్ఫార్మన్స్ సింప్లీ సూపర్బ్. ఒకవైపు సీనియర్ పర్సన్ గా, కొడుకును రక్షించుకోవాలనే ఫాదర్ గా, పోలీస్ గా అతను చూపిన హావ భావాలు ఆడియన్స్ ని కట్టి పడేస్తాయి. చీకటి రాజ్యం సినిమాకి మెయిన్ పిల్లర్ కమల్ హాసన్ అని చెప్పడంలో ఎలాంటి సందేహమూ లేదు. త్రిష ఒక టఫ్ పోలీస్ గర్ల్ గా కమల్ కి మంచి పోటీని ఇచ్చింది. ముఖ్యంగా వీరిద్దరి మధ్యా వచ్చే యాక్షన్ సీన్స్ మాత్రం ఆడియన్స్ ని సీట్ ఎడ్జ్ కి తీసుకొస్తాయి. త్రిషకి సపోర్ట్ గా చేసిన కిషోర్ కూడా పోలీస్ గా నెగటివ్ షేడ్స్ ని చాలా బాగా పలికించాడు.

ఇకపోతే మెయిన్ విలన్స్ గా కనిపించిన ప్రకాష్ రాజ్, సంపత్ రాజ్ లు వారి వారి పాత్రలకి న్యాయం చేసారు. వీరిద్దరి పాత్రల్లో సీరియస్ తో పాటు కాస్త హ్యూమర్ ని కూడా పండించడం ప్రేక్షకుల పెదవులపై కాస్త నవ్వును తెప్పిస్తుంది. ఓ ముఖ్య పాత్రలో కనిపించిన మధు శాలిని తన గ్లామర్ తో కాసేపు యువతని, ముందు బెంచ్ వారిని ఆకట్టుకుంటుంది. ఇక నటీనటుల పరంగా చిన్న చిన్న పాత్రల్లో కనిపించిన ఆశా శరత్, అమన్ అబ్దుల్లా, యుగి సేతు తదితరులు టం పాత్రల పరిధి మేర చేసారు.

వీరి తర్వాత సినిమాకి హైలైట్స్ గా చెప్పుకోవాల్సిన విషయానికి వస్తే, సినిమా మొదలవ్వడం చాలా ఆసక్తికరంగా ఉంటుంది, అలాగే ఆ తర్వాత వచ్చే కమల్ – ఆశ శరత్ మధ్య వచ్చే కొన్ని సీన్స్ కాస్త నవ్విస్తే, అక్కడి నుంచి సినిమాని సీరియస్ చేసి చాలా గ్రిప్పింగ్ గా సినిమాని లాగడం మరియు ఫస్ట్ పార్ట్ లో వచ్చే చిన్న చిన్న యాక్షన్ ఎపిసోడ్స్ తో బాగానే సాగుతుంది. ఆ తర్వాత సెకండాఫ్ లో కమల్ – త్రిష, కమల్ – కిషోర్ యాక్షన్ ఎపిసోడ్స్ మరియు ఓకే ట్విస్ట్ ని రివీల్ చెయ్యడం చాలా బాగుంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సినిమా చివర్లో వచ్చే ఒకే ఒక్క పాటని సూపర్బ్ గా ఎడిట్ చేశారు, సో డోంట్ మిస్ ఇట్. టెక్నికల్ గా జాన్ వర్గీస్ సినిమాటోగ్రఫీ, జిబ్రాన్ మ్యూజిక్ మరియు రాజేష్ టేకింగ్ సినిమాకి బాగా హెల్ప్ అయ్యింది.

మైనస్ పాయింట్స్ :

చీకటి రాజ్యం సినిమాకి మొదటి మైనస్ గా చెప్పుకోవాల్సింది.. సెకండాఫ్.. ఫస్ట్ హాఫ్ చాలా గ్రిప్పింగ్ గా ఉంటుంది. కానీ సెకండాఫ్ కి వచ్చే సరికి సినిమా అంత గ్రిప్పింగ్ గా సాగలేదు. అలాగే ఒరిజినల్ వెర్షన్ తో పోల్చుకుంటే సెకండాఫ్ ని బాగా సాగదీసేసారు. ముఖ్యంగా మన నేటివిటీ కోసం యాడ్ చేసుకున్న కొన్ని సీన్స్ సినిమాని కాస్త స్లో చేసాయే తప్ప సినిమాకి పెద్ద హెల్ప్ అవ్వలేదు. క్లైమాక్స్ లో మేజర్ ఫైట్ అయిపోయాక వచ్చే కొన్ని సీన్స్ సినిమాకి పెద్ద అవసరం లేదు. మరో మైనస్ సినిమా రన్ టైం.. ఓవరాల్ రన్ టైం 128:58 నిమిషాలే అయినప్పటికీ చాలా చోట్ల బాగా డ్రాగ్ చేయడం వలన ఈ షార్ట్ రన్ టైం కూడా లాంగ్ గా ఉందనే ఫీలవుతుంది.

అలాగే ఈ సినిమా జానర్ యాక్షన్ థ్రిల్లర్.. అంటే యాఖాన్ తో పాటు ఆడియన్స్ అబ్బో అనిపించినే థ్రిల్లింగ్ ఎపిసోడ్స్ కూడా ఉండాలి. కానీ ఈ సినిమాలో ఆడియన్స్ ని థ్రిల్ చేసే ఒక్క థ్రిల్లింగ్ పాయింట్ కూడా లేకపోవడం చెప్పుకోదగిన మరో మైనస్ పాయింట్. ముఖ్యంగా మెయిన్ విలన్ ఎవరనేది దాచి పెట్టడమే ఈ సినిమాకి కీలకం కానీ కథనంలో ఆ విషయాన్ని ఫస్ట్ లోనే రివీల్ చేసెయ్యడం చూసే ఆడియన్స్ కి పెద్ద కిక్ ఇవ్వదు. స్క్రీన్ ప్లే మొత్తం ఆడియన్స్ ఊహించి నట్లే సాగడం, అలాగే నేరేషన్ చాలా చోట్ల బాగా స్లో అయిపోవడం ఈ సినిమాకి మరో మైనస్. ఫాదర్ – సన్ సెంటిమెంట్ యాంగిల్ తో పాటు, కమల్ హాసన్ మిషన్ గురించిన విషయాన్ని ఇంకాస్త క్లియర్ గా చూపించాల్సింది.

సాంకేతిక విభాగం :

‘చీకటి రాజ్యం’ సినిమాకి టెక్నికల్ గా పరంగా చాలా డిపార్ట్మెంట్స్ హైలైట్స్ గా నిలిచాయి. ముందుగా చెప్పుకోవాల్సింది. జన వర్గీస్ సినిమాటోగ్రఫీ సూపర్బ్ గా ఉంది, యాక్షన్ థ్రిల్లర్ ఎపిసోడ్ లో చూపిన కెమెరా యాంగిల్స్, విజువల్స్ సూపర్బ్ గా ఉన్నాయి. అలాగే ప్రేమ్ నవస్ ఆర్ట్ డైరెక్షన్ చాలా బాగుంది. ముఖ్యంగా ఇన్సోమియా పబ్ సెట్ ని వేసిన తీరు చాలా చాలా బాగుంది. ఇకపోతే జిబ్రాన్ మ్యూజిక్ ఈ సినిమాకి మరో హైలైట్. ప్రతి సన్నివేశంలోనూ జిబ్రాన్ ఇచ్చిన మ్యూజిక్ సినిమాని చాలా ఎలివేట్ చేసింది. ఎడిటర్ షాన్ మొహమ్మద్ ఫస్ట్ హాఫ్ ని చాలా బాగా ఎడిట్ చేసాడు, కానీ సెకండాఫ్ ని మాత్రం చాలా సాగ దీసేసారు. సెకండాఫ్ లో చాలా ఎడిట్ చేయాల్సింది. అబూరి రవి డైలాగ్స్ బాగున్నాయి. గిల్లెస్ కాన్సీల్, రమేష్ యాక్షన్ స్టంట్స్ కూడా సినిమ మూడ్ కి తగ్గట్టుగా ఉన్నాయి.

ఇక సినిమాకి మెయిన్ డిపార్ట్ మెంట్స్ విషయానికి వస్తే.. కథా పరంగా ఒరిజినల్ వెర్షన్ తో పోల్చుకుంటే మన నేటివిటీకి సింక్ చెయ్యాలి అంటూ కొన్ని సీన్స్ ని యాడ్ చేసారు. కానీ ఆ సీన్స్ సినిమాకి పెద్దగా హెల్ప్ అవ్వలేదు. కమల్ హాసన్ కథనంలో థ్రిల్స్ ఏమీ లేకుండా రాసుకోవడం సినిమాకి చాలా మైనస్ అయ్యింది. డైరెక్టర్ గా రాజేష్ ఎం సెల్వ టేకింగ్ బాగుంది. సీరియస్ థ్రిల్లర్ లో కొన్ని కామెడీ బిట్స్ ని కూడా టచ్ చేయడం బాగుంది. కానీ డైరెక్టర్ కూడా థ్రిల్లర్ సినిమాలో థ్రిల్లింగ్ పార్ట్ ని వదిలేయడం బాలేదు. కమల్ మరియు రాజేష్ థ్రిల్స్ విషయంలో కేర్ తీసుకోవాల్సింది. చంద్రహాసన్ – కమల్ హాసన్ నిర్మాణ విలువలు మాత్రం సూపర్బ్ అనేలా ఉన్నాయి.

తీర్పు :

తెలుగు ప్రేక్షకులకు సరికొత్తగా అనిపించే యాక్షన్ థ్రిల్లర్ జానర్ లో వచ్చిన ‘చీకటి రాజ్యం’ సినిమా డిఫరెంట్ సినిమా కోరుకునే తెలుగు ప్రేక్షకులను బాగా మెప్పిస్తుంది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ ఆసక్తికరంగా సాగుతూ అందరినీ కట్టి పడేయడమే కాకుండా సెకండాఫ్ ఏం జరుగుతుందా అనే సస్పెన్స్ ని క్రియేట్ చేయడం సినిమాకి సూపర్బ్ హెల్పింగ్ పాయింట్. యాక్షన్ అండ్ టేకింగ్ పరంగా వావ్ అనిపించే ఈ సినిమా థ్రిల్స్ విషయంలో మాత్రం కాస్త నిరాశ పరుస్తుంది. ఇది రెగ్యులర్ మాస్ మసాలా మూవీ కాదు కాబట్టి ఆ తరహా సినిమాలు కోరుకునే వారికి ఇది పెద్దగా నచ్చదు. కమల్ హాసన్-త్రిషల పెర్ఫార్మన్స్, ఎంగేజ్ గా అనిపించే ఫస్ట్ హాఫ్, కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్, మ్యూజిక్ సినిమాకి మేజర్ హైలైట్స్ అయితే, సెకండాఫ్ ని సాగదీయడం, థ్రిల్స్ లేకపోవడం, యాడ్ చేసిన ఎక్స్ట్రా సీన్స్ బాలేకపోవడం సినిమాకి మైనస్. ఓవరాల్ గా ఈ సీజన్ లో చూడదగిన డీసెంట్ యాక్షన్ థ్రిల్లర్ ‘చీకటి రాజ్యం’.

123తెలుగు.కామ్ రేటింగ్ : 3.25/5
123తెలుగు టీం

CLICK HERE FOR ENGLISH REVIEW

సంబంధిత సమాచారం :