సమీక్ష : కరెంట్ తీగ – టైం పాస్ ఎంటర్టైనర్

Current-Theega-Review విడుదల తేదీ : 31 అక్టోబర్ 2014
123తెలుగు. కామ్ రేటింగ్ : 3.25/5
దర్శకత్వం : : జి. నాగేశ్వర్ రెడ్డి
నిర్మాత : మంచు విష్ణు
సంగీతం : అచ్చు
నటీనటులు : మనోజ్, రకుల్ ప్రీత్ సింగ్, జగపతిబాబు…

కన్నడ రీమేక్ అయిన ‘పోటుగాడు’తో కమర్షియల్ హిట్ అందుకున్న మంచు మనోజ్ చేసిన మరో కమర్షియల్ ఎంటర్టైనర్ ‘కరెంట్ తీగ’. తమిళంలో సూపర్ హిట్ అయిన ‘వర్తపడు వాలిబర్ సంఘం’ సినిమాకి ఇది రీమేక్. గతంలో మంచు విష్ణుకి దేనికైనా రెడీతో హిట్ ఇచ్చిన జి నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వం వచించిన ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించగా, జగపతి బాబు ఒక ముఖ్య పాత్ర పోషించాడు. ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మనోజ్ కెరీర్లో పెద్ద హిట్ అవుతుందని ఈ చిత్ర టీం నమ్మకంతో ఉన్నారు. మరి వారి నమ్మకం నిజమైందా.? మరో రీమేక్ తో మనోజ్ హిట్ అందుకున్నాడా.? విష్ణుకి హిట్ ఇచ్చిన నాగేశ్వర్ రెడ్డి మనోజ్ కి కూడా హిట్ ఇచ్చాడా.? లేదా.? అన్నది ఇప్పుడు చూద్దాం..

కథ :

పార్వతీపురంలో ఈ కథ మొదలవుతుంది.. ఫస్ట్ సీన్ లో ఆ ఊరి పెద్ద అయిన శివరామరాజు (జగపతి బాబు) ని అరెస్ట్ చేస్తారు. కట్ చేస్తే ఫ్లష్ బ్యాక్.. పార్వతీపురం పెద్దైన శివరరమరాజు కి ముగ్గురు కూతుళ్ళు.. శివరామరాజు కి వ్యతిరేఖి అయిన వీర్రాజు(సుప్రీత్)తో తన కూతుళ్ళు ఎవరు ఎవరినీ ప్రేమించి పెళ్లి చేసుకోరని అలా చేసుకుంటే నా చెవులు కోసుకుంటాను లేదా వాళ్ళని చంపేస్తానని శబదం చేస్తాడు.

ఒక 16 ఏళ్ళ తర్వాత… ఆ ఊరిలో విఐపి అనే సంఘాన్ని స్థాపించి ఆ ఊరిలో కొన్ని మంచి పనులు చేస్తుంటాడు రాజు(మంచు మనోజ్) అండ్ కో.. అదే ఊర్లో స్కూల్ టీచర్ గా పనిచేస్తున్న సన్నీ(సన్నీ లియోన్)ని ప్రేమలో దించడం కోసం రాజు అదే స్కూల్ లో చదువుతున్న కవిత(రకుల్ ప్రీత్ సింగ్)ని మధ్యవర్తిగా ఎంచుకుంటాడు. కానీ కొద్ది రోజులకి కవిత రాజుని ప్రేమించడం మొదలు పెడుతుంది. మరి రాజు సన్నీని వదిలి కవితని ప్రేమించాడా.? లేదా.? ప్రేమిస్తే శివరామరాజు నుంచి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది.? వీరిద్దరి ప్రేమ తెలిసాక శివరామరాజు తన మాట ప్రకారం ఇద్దరినీ చంపేసాడా.? లేక.? వాళ్ళ ప్రేమను బతికించి తన చెవులు కోసుకున్నాడా.? అన్నది మీరు వెండితెరపైనే చూడాలి.

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమా ప్లస్ పాయింట్స్ లో ముందుగా బాగా చేసిన నటీనటుల గురించి చెబుతా.. హీరో మనోజ్ విషయానికి వస్తే ఈ సినిమాలో కాస్త లావుగా కనిపిస్తాడు కానీ విలేజ్ కుర్రాడి పాత్ర కాబట్టి సెట్ అయిపొయింది. ఇక మనోజ్ ఎప్పటిలానే తన సెటైరికల్ డైలాగ్స్ తో రిస్కీ స్టంట్స్ తో ఆడియన్స్ ఆకట్టుకున్నాడు. మనోజ్ ఈ సినిమాలో చేసిన విలేజ్ మానరిజమ్స్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటాయి. ఇక హీరోయిన్ బ్యూటిఫుల్ రకుల్ ప్రీత్ సింగ్ ఈ సినిమాకి పెద్ద హైలైట్ అని చెప్పాలి. తన పెర్ఫార్మన్స్ సింప్లీ సూపర్బ్. ముఖ్యంగా లవ్ ట్రాక్ లో తన హావ భావాలు చూస్తున్న ఆడియన్స్ కచ్చితంగా తన ప్రేమలో పడిపోతారు. మొదటి రెండు సినిమాలతో పోలిస్తే నటనకి మంచి చాన్స్ ఉన్న పాత్ర చేసి నటిగా తన టాలెంట్ నిరూపించుకుంది. ఇది కాకుండా పాటల్లో మాస్ ఆడియన్స్ కి కావాల్సిన గ్లామర్ తో కూడా ఆకట్టుకుంది.

ఇక సినిమాకి కీలకమైన పాత్ర చేసిన జగపతి బాబు తన పెర్ఫార్మన్స్ తో మరోసారి ఆకట్టుకున్నాడు. ఆయనపై వచ్చే కొన్ని కామెడీ సీన్స్ బాగున్నాయి. ఇక హాట్ బ్యూటీ సన్నీ లియోన్ గురంచి.. సన్నీ లియోన్ అనగానే గుర్తొచ్చే పదం హాట్.. ఆ పదానికి న్యాయం చేసేలా సెక్సీ టీచర్ పాత్రలో తన అందచందాలతో అందరినీ తనవైపు తిప్పుకుంది సన్నీ లియోన్. తన రోల్ చిన్నదే అయినా తను ఉన్నంత సేపు ఆడియన్స్ బాగా అట్రాక్ట్ చేసింది. ముఖ్యంగా సన్నీ సన్నీ సాంగ్ ఆడియన్స్ కి పెద్ద ట్రీట్ అని చెప్పాలి. ఇక ఈ సినిమాకి మరో మేజర్ హైలైట్ సినిమాలో నాలుగుసార్లు వచ్చే 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వీ. తన ప్రతి ఎపిసోడ్ ఆడియన్స్ ని బాగా నవ్విస్తుంది. అలాగే అతిధి పాత్రలో సంపూర్నేష్ బాబు, తాగుబోతు రమేష్, ధన్ రాజ్ లు అక్కడక్కడా కొంతవరకూ నవ్వించారు.

ఈ సినిమాలో వచ్చే సాంగ్స్ అన్నీ విజువల్ గా కూడా చాలా బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ చాలా ఎంటర్టైనింగ్ గా సాగిపోతుంది. అలాగే ఫస్ట్ హాఫ్ లో వచ్చే కామెడీని ఆడియన్స్ బాగానే ఎంజాయ్ చేస్తారు. అలాగే క్లైమాక్స్ ఎపిసోడ్ కాస్త వేగంగా, మాస్ ఆడియన్స్ కోరుకునేలా ఉండడం ఆడియన్స్ కి నచ్చుతుంది.

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమాకి మైనస్ పాయింట్స్ లో ముందుగా చెప్పాల్సివస్తే అది సెకండాఫ్ అనే చెప్పాలి.. ఎందుకంటే ఉన్న ఎంటర్టైన్మెంట్ లవ్ ట్రాక్స్ అంతా ఫస్ట్ హాఫ్ లోనే పెట్టేసి సెకండాఫ్ ని ఫ్లాట్ చేసేసారు. కథలో ముందుకు వెళ్తున్నాం అంటే ఏదో వెళ్తోందిలే అనే తరహాలో సెకండాఫ్ ఉంది. దాంతో చూసే ఆడియన్స్ కి బోర్ కొడుతుంది. దీన్ని బట్టి సెకండాఫ్ లో ఎంటర్టైన్మెంట్ లేదని మీకు అర్థమైంది అనుకుంటా.. కనీసం సెకండాఫ్ ని స్క్రీన్ ప్లే పరంగా స్పీడ్ గా ఉండేలా అన్నా ప్లాన్ చేసుకోవాల్సింది.

మామూలుగా మనోజ్ – వెన్నెల కిషోర్ ట్రాక్ ఉంది అంటే ఆడియన్స్ కూసింత కామెడీ ఆశిస్తారు.. కానీ వీరి ట్రాక్ ఆడియన్స్ ని నవ్వించడంలో పూర్తిగా ఫెయిల్ అయ్యింది. చూడటానికి తెలిసిన ముఖంలా వెన్నెల కిషోర్ ఉంటాడు తప్ప తను చేసిన కామెడీ ఏమీ లేదు. ఇక జగపతి బాబు తనకు ఇచ్చిన పాత్రకి నటన పరంగా న్యాయం చేసాడు, కానీ ఆయన పాత్రకి సరైన ఎలివేషన్ లేదు. ఇక తమిళ వెర్షన్ లో లేని విలన్ పాత్రని ఇందులో క్రియేట్ చేసారు. కానీ ఆ పాత్రని సరిగా రాసుకోలేదు, సరిగా ఎలివేట్ కూడా చెయ్యలేదు. మనోజ్ ఇమేజ్ కి ఫైట్స్ ఉండాలి, ఆ ఫైట్స్ కోసం ఓ విలన్ ఉండాలి, ఆ విలన్ తో మనోజ్ ఫైట్ చెయ్యాలి అన్న తరహాలో విలన్ పాత్ర ఉందే తప్ప కథా ప్రకారం ఆ పాత్రకి కథలో పెద్ద చోటు లేదు.

సాంకేతిక విభాగం :

ఈ సినిమాకి టెక్నికల్ టీంలో బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్స్ గా నిలిచినవి రెండు ఉన్నాయి. మొదటగా సతీష్ ముత్యాల సినిమాటోగ్రఫీ. ఇలాంటి విలేజ్ బ్యాక్ డ్రాప్ స్టొరీకి తను అందించిన సినిమాటోగ్రఫీ సూపర్బ్. పాటల్లో విలేజ్ అందాలని చాలా గ్రాండ్ గా చూపించాడు, అలాగే ఓవరాల్ విజువల్స్ కూడా చాలా బాగున్నాయి. రెండవది అచ్చు మ్యూజిక్. తను అందించిన పాటలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో, విజువల్స్ పరంగా అంతకన్నా పెద్ద హిట్ అయ్యాయి. ఇక బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా సినిమాకి బాగా హెల్ప్ అయ్యింది. ఇక తిరుమలశెట్టి రాసిన పంచ్ డైలాగ్స్, సెటైర్స్ కొన్ని బాగా పేలాయి, కొన్ని తుస్సుమన్నాయి. ఎస్ఆర్ శేఖర్ ఎడిటింగ్ జస్ట్ ఓకే, సెకండాఫ్ మీద కాస్త శ్రద్ధ తీసుకోవాల్సింది. ఇక మంచు మనోజ్ కంపోజ్ చేసుకున్న యాక్షన్ ఎపిసోడ్స్ బాగున్నాయి.

కథ – ఈ సినిమా కథ తమిళ నుంచి తీసుకొని తెలుగుకి తగ్గట్టు మార్పులు చేసారు. కానీ ఆ మార్పులు పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. ఇక జి. నాగేశ్వర్ రెడ్డి స్క్రీన్ ప్లే – దర్శకత్వం బాధ్యతలు స్వీకరించాడు. స్క్రీన్ ప్లే – ఫస్ట్ హాఫ్ కి బాగుంది, కానీ సెకండాఫ్ రొటీన్ అండ్ బోరింగ్. డైరెక్షన్ పరంగా నటీనటుల నుంచి మంచి నటనని రాబట్టుకున్నా, ఎంటర్టైన్మెంట్ పరంగా సెకండాఫ్ లో ఫెయిల్ అయ్యాడు. సెకండాఫ్ మీద బాగా వర్క్ చెయ్యాల్సింది. ఇక మంచు విష్ణు నిర్మాణ విలువలు బాగా రిచ్ గా ఉన్నాయి. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా విజువల్స్ పరంగా మంచు మనోజ్ కి మంచి రిచ్ ఫిల్మ్ ఇచ్చాడు.

తీర్పు :

మంచు మనోజ్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా చేసిన ‘కరెంట్ తీగ’లో ఆడియన్స్ ని మెప్పించేంత స్థాయిలోవోల్టేజ్ ఉంది. రీమేక్ హిట్ సినిమాని తీసుకొని మన నేటివిటీ కోసం చేసిన మార్పుల్లో కొన్ని పెద్దగా వర్కౌట్ అవ్వకపోవడం వలన ఈ సినిమా అక్కడక్కడా ఆడియన్స్ ని నిరాశపరచవచ్చు. మంచు మనోజ్, రకుల్ ప్రీత్ సింగ్, సన్నీ లియోన్, ఫస్ట్ హాఫ్ ఈ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్స్ అయితే సెకండాఫ్, ఎంటర్టైన్మెంట్ మిస్ అవ్వడం, అవసరం లేని పాత్రలని ఇందులో ఇరికించడం ఈ సినిమాకి మేజర్ మైనస్ పాయింట్స్. ఈ వారం మీరు హ్యాపీగా వెళ్లి ఈ మూవీని చూసి ఎంజాయ్ చెయ్యచ్చు. సూపర్బ్ ఓపెనింగ్స్ రాబట్టుకున్న ఈ సినిమా అన్ని సెంటర్స్ లో హిట్ టాక్ తెచ్చుకుంటోంది. ‘కరెంట్ తీగ’ సినిమా ‘పోటుగాడు’ రికార్డ్స్ ని బద్దలు కొట్టి ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందనేది ఇక ప్రేక్షకులే నిర్ణయించాలి.

123తెలుగు.కామ్ రేటింగ్ : 3.25/5
123తెలుగు టీం

CLICK HERE FOR ENGLISH REVIEW

సంబంధిత సమాచారం :