సమీక్ష : “ధగడ్ సాంబ” – బోర్ గా సాగే సిల్లీ డ్రామా

సమీక్ష : “ధగడ్ సాంబ” – బోర్ గా సాగే సిల్లీ డ్రామా

Published on May 21, 2022 3:01 AM IST
Dhagad Saamba Movie Review

విడుదల తేదీ : మే 20, 2022

123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5

నటీనటులు: సంపూర్ణేష్ బాబు, సోనాక్షి వర్మ, జ్యోతి, జబర్దస్త్ అప్పారావు, చలాకీ చంటి, మెహబూబ్ బాషా, ఫిష్ వెంకట్

దర్శకత్వం : ఎన్ ఆర్ రెడ్డి

నిర్మాత: ఆర్ ఆర్

సంగీత దర్శకుడు: డేవిడ్ జి

సినిమాటోగ్రఫీ: ముజీర్ మాలిక్

ఎడిటర్ : కె.ఎ.వై. పాపా రావు

తన సినిమాలతో టాలీవుడ్ లో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న హీరో బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు. అయితే తనదైన సినిమాలు చేస్తూ అలరించే సంపూ ఇప్పుడు మరో వినూత్న సినిమా “ధగడ్ సాంబ” తో వచ్చాడు. మరి ఈ చిత్రం ఆడియెన్స్ ని ఎంతవరకు ఆకట్టుకుందో సమీక్షలో తెలుసుకుందాం రండి.

 

కథ :

 

ఇక కథ లోకి వచ్చినట్టు అయితే.. ధగడ్ సాంబ(సంపూర్ణేష్ బాబు) అలాగే తన ఫ్రెండ్ పీకే(మెహబూబ్ బాషా) తో కలిసి ఓ పని మీద హైదరాబాద్ కి వస్తారు. అయితే అలా వచ్చిన వాళ్లు ఒక ఇంట్లో అద్దెకి దిగి ఆ ఇంటి ఓనర్స్ కూతుర్లు ఒక్కో కూతురుని చూసి ప్రేమిస్తారు. అయితే ఈ క్రమంలో సాంబా కి ఒక షాకింగ్ నిజం తెలుస్తుంది. మరి ఆ నిజం ఏంటి? తర్వాత తానేం చేసాడు అనేవి తెలియాలి అంటే ఈ చిత్రాన్ని చూసి తెలుసుకోవాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్ :

 

సంపూ వరకు చూసినట్టు అయితే తన సినిమాలు అన్నీ ఒక రకమైన పేరడీ డ్రామాస్ లానే ఉంటిని అందరికీ తెలిసిందే. ఆ టైప్ లోనే ఈ సినిమా కూడా ఉంటుంది. తన రోల్ గాని అందులో తన నటన గాని మెప్పిస్తాయి. తనని ఒక కామెడీ హీరోగా అన్న మాట పక్కన పెడితే సంపూ మంచి టాలెంట్ కలిగిన నటుడు. దానిని ఈ సినిమాలో కూడా ప్రూవ్ చేసుకున్నాడు.

అలాగే ఇక కామెడీ టైమింగ్ కోసం చెప్పినట్టు అయితే ఈ సినిమాలో తన గత చిత్రాల కంటే బెటర్ గా ఉందని చెప్పాలి. అలాగే ఇతర నటీనటులు అప్పారావు తన ఫ్రెండ్ బాషా తదితరులు తమ పాత్రల్లో కరెక్ట్ గా సెట్టయ్యి మంచి నటనను కనబరిచారు. అలాగే పాటల విషయానికి వస్తే ఎప్పటిలానే తనదైన స్టెప్స్ తో సంపూ డిఫరెంట్ గా ట్రై చేసి నవ్వు తెప్పిస్తాడు.

 

మైనస్ పాయింట్స్ :

 

ఈ చిత్రం మేజర్ మిస్టేక్స్ చూసుకున్నట్టు అయితే ఈ సినిమాలో పెద్ద కథేమీ లేదు పరమ రొటీన్ లైన్ దానిని ఇంకా పలుచగా తీర్చిదిద్దిన కథనం వంటివి ఆడియెన్స్ వాహనాన్ని పరీక్షిస్తాయి. అలాగే హీరోయిన్స్ గా కనిపించిన ఆ ఇద్దరు ఆర్టిస్ట్స్ కి కూడా పెద్ద ప్రాధాన్యత కనిపించదు. పై పెచ్చు వారి నటన కూడా ఏమంత నాచురల్ గా చెప్పుకోదగ్గ స్థాయిలో ఉండదు.

అలాగే ఈ చిత్రంలో తీసుకున్న లైన్ కి అయితే ఇంకా బెటర్ నరేషన్ ని రాసుకునే అవకాశం ఉంది. కానీ దాన్ని దర్శకుడు వినియోగించలేదు. అలాగే చాలా చోట్ల అయితే బోరింగ్ గా కూడా అనిపిస్తుంది. అలాగే సెకండాఫ్ లో ప్రీ క్లైమాక్స్ కూడా అంత వర్కౌట్ అవ్వలేదు.

 

సాంకేతిక వర్గం :

 

ఈ సినిమాలో నిర్మాణ విలువలు పర్వాలేదని చెప్పాలి. అలాగే టెక్నికల్ టీం లో అయితే సంగీతం నుంచి సినిమాటోగ్రా[ఫీ మరియు ఎడిటింగ్ వర్క్స్ అన్నీ జస్ట్ యావరేజ్ బిలో యావరేజ్ గా ఉన్నాయని చెప్పాలి. ఇక దర్శకుడు ఎన్ ఆర్ రెడ్డి విషయానికి వస్తే తన వర్క్ మెప్పించే రేంజ్ లో లేదు. రొటీన్ అయినా డీసెంట్ లైన్ ని తాను ఎంచుకున్నాడు. కానీ దాన్ని మాత్రం ఎక్కడా అంత ఎంగేజింగ్ గా చూపించలేకపోయారు.

 

తీర్పు :

 

ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ “ధగడ్ సాంబ” లో అక్కడక్కడా కొన్ని కామెడీ సీన్స్ అలాగే సంపూర్ణేష్ బాబు నటన ఆకట్టుకుంటాయి. తప్ప ఇక మిగతా సినిమా అంతా పేలవంగా ఉంటుంది. బోర్ గా సాగే నరేషన్, కొత్తదనం లేని అంశాలు, క్యారక్టరైజేషన్ లు సినిమాని బిలో యావరేజ్ గా నిలుపుతాయి.

123telugu.com Rating: 2/5

Reviewed by 123telugu Team 

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు