సమీక్ష : “ఫోకస్”- నిరుత్సాహ పరిచే క్రైమ్ డ్రామా !

సమీక్ష : “ఫోకస్”- నిరుత్సాహ పరిచే క్రైమ్ డ్రామా !

Published on Oct 29, 2022 3:02 AM IST
FOCUS Movie-Review-In-Telugu

విడుదల తేదీ : అక్టోబర్ 28, 2022

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

నటీనటులు: విజయ్ శంకర్, అషు రెడ్డి, సుహాసిని మణిరత్నం, భాను చందర్, రఘు బాబు, జీవా, షాయాజీ షిండే, భరత్ రెడ్డి మరియు సూర్య భగవాన్

దర్శకుడు : జి సూర్య తేజ

నిర్మాణం: రిలాక్స్ మూవీ మేకర్స్

సంగీతం: వినోద్ యజమాన్య

సినిమాటోగ్రఫీ: జె ప్రభాకర్ రెడ్డి

ఎడిటర్: సత్య గిడుతూరి

 

సంబంధిత లింక్స్: ట్రైలర్

 

 

విజయ్‌శంకర్‌ హీరోగా నటించిన చిత్రం ‘ఫోకస్‌’. అషూ రెడ్డి హీరోయిన్ గా జి.సూర్యతేజ దర్శకుడిగా ఈ చిత్రం ఈ రోజు రిలీజ్ అయింది. రిలాక్స్‌ మూవీ మేకర్స్‌ నిర్మాణంలో వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి చూద్దాం.

 

కథ :

 

ప్రమోదా దేవి (సుహాసిని మణిరత్నం) హై కోర్టుకు కాబోయే జడ్జ్. ఆమె భర్త పోలీస్ అధికారి వివేక్ వర్మ (బానుచంద్ర)ను సడెన్ గా ఎవరో హత్య చేస్తారు. ఆ హత్య ఎవరు చేశారో తేల్చడానికి విచారణ మొదలు పెడతాడు యస్ ఐ విజయ్ శంకర్ (హీరో విజయ్‌శంకర్‌). అయితే, ఈ క్రమంలో ఆ హత్య తాలూకు విచారణ లో అనేక కోణాలు కనబడతాయి. ముఖ్యంగా ఆ హత్య చుట్టూ ముగ్గురు కీలక పాత్రధారులుగా కనబడతారు. దీంతో పోలీస్ డిపార్ట్మెంట్ అయోమయంలో పడుతుంది. దాంతో కేసును సిబిఐ ఆఫీసర్ ప్రేమ (అషూరెడ్డి) కి అప్పగిస్తారు. మరి ఈ కేసు కోసం విజయ్‌ శంకర్‌ ఏం చేశాడు ?, అసలు వివేక్ వర్మ ను ఎవరు చంపారు?, ఈ మొత్తం వ్యవహారంలో ప్రమోదా దేవి పాత్ర ఏమిటీ ? చివరకు ఈ కథ ఎలాంటి మలుపు తీసుకుంది ? అనేది మిగిలిన కథ.

 

ప్లస్ పాయింట్స్ :

 

ఈ సినిమాకి ప్రధానంగా ప్లస్ పాయింట్ అంటే.. ఈ కథలోని మెయిన్ పాయింట్, అలాగే ఈ కథ జరిగిన నేపథ్యమే. అలాగే హీరో విజయ్ శంకర్ తన నటనతో ఆకట్టకున్నాడు. విజయ్ శంకర్ తన బాడీ లాంగ్వేజ్ తో అలాగే, కొన్ని విచారణ మరియు సప్సెన్స్ సీక్వెన్స్ స్ లో చాలా బాగా నటించి మెప్పించాడు. ఇక హీరోయిన్ గా నటించిన అషూ రెడ్డికి పెద్దగా నటించే స్కోప్ లేదు. అయితే ఉన్నంతలో ఆమె తన క్యూట్ లుక్స్ లో అందంగా కనిపిస్తూ ఆకట్టుకుంది.

కీలక పాత్రలో నటించిన సుహాసిని మణిరత్నం చాలా బాగా నటించింది. అలాగే బానుచంద్ర, భరత్ రెడ్డి కూడా చాలా బాగా నటించారు. అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు తమ పాత్రల్లో ఒదిగిపోయారు. ఇక జి.సూర్యతేజ తీసుకున్న స్టోరీ లైన్, రాసుకున్న కొన్ని సస్పెన్స్ సీక్వెన్సెస్ పర్వాలేదు.

 

మైనస్ పాయింట్స్ :

 

ఫోకస్ చిత్రంలో స్క్రిప్ట్ పై ఫోకస్ తగ్గింది. అసలు ఇలాంటి సస్పెన్స్ ఎమోషనల్ థ్రిల్లింగ్ కాన్సెప్ట్ తీసుకున్నపుడు ఆ కాన్సెప్ట్ కి తగ్గట్టు సినిమాని ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తిస్తూ ర‌క్తి కట్టేలా సినిమా సాగితేనే.. ఆడియన్స్ ను ఆకట్టుకోగలం. అయితే, ఈ సినిమాలో అలాంటి అంశాలు మిస్ అయ్యాయి. దీనికితోడు చాలా సన్నివేశాలు పూర్తి సినిమాటిక్ గా అనిపిస్తాయి.

అలాగే ఫస్ట్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలు అంతగా ఆకట్టుకోవు. అయితే, దర్శకుడు జి.సూర్యతేజ ఫోకస్ సినిమా సెకెండాఫ్ ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఇంట్రస్ట్ గా నడుపుదామని మంచి ప్రయత్నం అయితే చేశారు గాని, ఓవరాల్ కొన్ని చోట్ల లాజిక్స్ వదిలేశారు. దీనికి తోడు మెయిన్ గా సినిమాలో ఇంట్రెస్టింగ్ ప్లేను బిల్డ్ చేయలేకపోయారు.

సినిమాలో మెయిన్ క్యారెక్టైజేషన్స్ ఇంకా ఎఫెక్టివ్ గా రాసుకోవాల్సింది. అలాగే హీరో క్యారెక్టర్ తాలూకు యాక్టివిటీస్ కూడా సినిమాకి మైనస్ అయ్యాయి. పైగా కొన్ని చోట్ల హీరో ట్రాక్ కూడా బలహీనంగా సాగుతోంది. ఇక కొన్ని సీన్స్ లో నాటకీయత ఎక్కువడంతో ఆ సీన్స్ సహజత్వం లోపించింది.

సాంకేతిక విభాగం :

 

జి.సూర్యతేజ ఈ సినిమాకి దర్శకుడిగా సెకెండాఫ్ ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఇంట్రస్ట్ గా నడుపుదామని మంచి ప్రయత్నం చేశాడు. అయితే, స్క్రిప్ట్ పై ఇంకా బాగా శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేది. సంగీత దర్శకుడు అందించిన సంగీతం కూడా పూర్తి స్థాయిలో ఆకట్టుకోదు. ఐతే, సినిమాటోగ్రఫర్ సినిమాటోగ్రఫీ సినిమాకి ప్లస్ అయింది. సన్నివేశాలన్నీ చాలా సహజంగా సినిమా మూడ్ కి అనుగుణంగా నడుస్తాయి. నిర్మాతలు నిర్మాణ విలువలు బాగున్నాయి.

 

తీర్పు :

 

ఫోకస్ అంటూ ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ చిత్రం కొన్ని అంశాల్లో పర్వాలేదు అనిపిస్తోంది. ముఖ్యంగా సస్పెన్స్ డ్రామాగా వచ్చే కొన్ని సీన్స్ బాగున్నాయి. అయితే, స్లో నేరేషన్, సినిమాలో బోరింగ్ ట్రీట్మెంట్, బలమైన కాన్ ఫ్లిక్ట్ మిస్ అవ్వడం వంటి అంశాలు ఈ సినిమాకి మైనస్ అయ్యాయి. కాకపోతే, సుహాసిని మణిరత్నం, విజయ్ శంకర్ తమ నటనతో ఆకట్టుకున్నారు. కానీ ఈ సినిమా మాత్రం ఆకట్టుకోలేకపోయింది.

 

123telugu.com Rating: 2.25/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు