సమీక్ష : “గాలోడు” – బోర్ గా సాగే సిల్లీ డ్రామా

సమీక్ష : “గాలోడు” – బోర్ గా సాగే సిల్లీ డ్రామా

Published on Nov 19, 2022 3:01 AM IST
Gaalodu Movie-Review-In-Telugu

విడుదల తేదీ : నవంబర్ 18, 2022

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

నటీనటులు: సుధీర్ ఆనంద్, గెహ్నా సిప్పీ, సప్తగిరి, షకలక శంకర్, పృద్వి, సత్య కృష్ణ

దర్శకుడు : రాజశేఖర్ రెడ్డి పులిచర్ల

నిర్మాత: రాజశేఖర్ రెడ్డి పులిచర్ల

సంగీత దర్శకుడు: భీమ్స్ సిసిరోలియో

సినిమాటోగ్రఫీ: అనీష్, వెంకట్ దీప్

ఎడిటర్: ఎం ఎస్ ఆర్

 

సంబంధిత లింక్స్: ట్రైలర్

 

స్మాల్ స్క్రీన్ సెన్సేషన్ సుడిగాలి సుధీర్ హీరోగా నటించిన మరో చిత్రం “గాలోడు”. ఒక మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించిన ఈ చిత్రం ఈరోజు థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది. మరి ఈ చిత్రంతో సుధీర్ ఎలాంటి ఫలితాన్ని అందుకున్నాడో సమీక్షలో తెలుసుకుందాం రండి.

 

కథ :

 

తన లైఫ్ లో ఎలాంటి సీరియస్ నెస్ లేకుండా తన ఊళ్ళో గాలోడు(సుడిగాలి సుధీర్) అని పిలిపించుకునే కుర్రాడు తన ఊర్లో సర్పంచ్ కొడుకుని ఓ అనుకోని గొడవలో చంపేస్తాడు. దీనితో భయపడి హైదరాబాద్ పారిపోతాడు. ఇక్కడ ఓ సఘట్టాలో హీరోయిన్ గెహెనా సిప్పి కి ఓ సాయం చేస్తాడు. దీనితో అక్కడ నుంచి వీరి పరిచయం ప్రేమగా మారుతుంది. కానీ ఆమె తండ్రి మాత్రం వీరి ప్రేమకి పడతాడు. మరి వీరి ప్రేమ గెలుస్తుందా? తాను చేసిన మర్డర్ విషయం ఏమవుతుంది అనేది తెలియాలి అంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్ :

 

స్మాల్ స్క్రీన్ పై చూసినవారికి సుడిగాలి సుధీర్ టాలెంట్ ఏ పాటిదో అందరికీ తెలుసు. మరి సినిమాల్లో కూడా తన టాలెంట్ తో సుధీర్ ఫస్ట్ సినిమాలోనే ప్రూవ్ చేసుకున్నాడు. ఇక ఈ సినిమాలో కూడా కొత్త లుక్స్ అండ్ సాలిడ్ ప్రెజెన్స్ తో తాను ఆకట్టుకున్నాడు. అలాగే డాన్స్ లు కూడా చాలా బాగా చేసాడు.

యాక్షన్ ఇంకా మాస్ యాటిట్యూడ్ లో తన యూత్ ఫ్యాన్స్ కి నచ్చేలా ఈ సినిమాలో కనిపిస్తాడు. అలాగే నటుడుగా ఈ సినిమాలో తన నుంచి కొత్త కోణం కనిపిస్తుంది. అలాగే గెహనా డీసెంట్ నటనతో తన పాత్ర చేసింది. అలాగే ఆమె లుక్స్ మరియు సుధీర్ తో మంచి కెమిస్ట్రీ కనిపిస్తుంది. అలాగే ఇద్దరి మధ్య సాంగ్స్ కూడా వాటి మ్యూజిక్ సినిమాకి మంచి ప్లస్ అయ్యాయి. అలాగే క్లైమాక్స్ డిజైన్ చేసిన విధానం బాగుంది.

 

మైనస్ పాయింట్స్ :

 

ఈ చిత్రంలో విషయంలో సుధీర్ మాత్రం డెఫినెట్ గా రాంగ్ స్టెప్ తీసుకున్నాడని చెప్పొచ్చు. బహుశా తన పాత్ర వరకు ఓకే చేసాడో ఏమో కానీ అసలు ఈ చిత్రంలో కథే లేదు. పరమ రొటీన్ లైన్ తో ఈ సినిమాని మేకర్స్ తీసుకొచ్చారు. ఇది పెద్ద డ్రా బ్యాక్ కాగా అసలు పూర్తి స్థాయిలో ఇదొక సినిమా అన్నట్టు కూడా ఎక్కడా నరేషన్ ఆడియెన్స్ కి కనిపించకపోవడం మరో పెద్ద డిజప్పాయింట్మెంట్ గా అనిపిస్తుంది.

డల్ గా ఏమాత్రం ఆకట్టుకోని ఫస్టాఫ్, అలాగే చాలా వరకు సీన్స్ ని అనవసరంగా స్కోప్ లేకున్నా కూడా ఇరికించినట్టు అనిపిస్తుంది. ఓవర్ ఎలివేషన్ లు సంబంధం లేకుండా వచ్చే సీన్స్ బాగా చికాకు తెప్పిస్తాయి. అలాగే చాలా పాత్రల్లో బలం కూడా లేదు. ముఖ్యంగా హీరోయిన్ తండ్రి పాత్ర లో అసలు డెప్త్ అనేది కనిపించదు.

ఇలా చాలా నిరాశపరిచే అంశాలు సినిమాలు ఉన్నాయి. కథ ఎలాగో పరమ రొటీన్ అయినప్పటికీ స్క్రీన్ ప్లే అయినా ఎంగేజింగ్ గా ఉండి ఉంటే మంచి ఫలితం దక్కేది కానీ చాలా సిల్లీ సీన్స్ మరియు నరేషన్ తో చాలా బోర్ గా ఈ సినిమా సాగుతుంది. అలాగే హీరోయిన్ మరియు హీరో ల మధ్య ట్రాక్ కూడా అంత ఇంప్రెసివ్ గా అనిపించదు. ఇంకా క్లైమాక్స్ కోర్ట్ సీక్వెన్స్ కూడా మెప్పించే రీతిలో ఉండదు.

 

సాంకేతిక వర్గం :

 

చిత్రంలో నిర్మాణ విలువలు అయితే బాగున్నాయి అలాగే టెక్నీకల్ డిపార్ట్మెంట్
సంగీత దర్శకుడు భీమ్స్ సినిమాకి చాలా మంచి వర్క్ అందించి ఉన్న కాస్త ఇంట్రెస్ట్ అయినా తెప్పించగలిగాడు. అలాగే సినిమాటోగ్రఫీ బాగుంది. డైలాగ్స్ పర్వాలేదు. అలాగే ఎడిటింగ్ లో చాలా అనవసర సీన్స్ తీసెయ్యాల్సింది.

ఇక దర్శకుడు రాజశేఖర్ విషయానికి వస్తే తన వర్క్ మాత్రం సినిమాకి ఏం బాగోలేదని చెప్పాలి. సుధీర్ పాత్ర వరకు ఓకే కానీ సినిమాలో సరైన పాయింట్ కూడా తీసుకొని ఉన్నా పోనీ రొటీన్ లైన్ అయినప్పటికీ ఎంగేజింగ్ గా చూపించడంలో కూడా తాను విఫలం అయ్యాడు. లాజిక్స్ లేకుండా సిల్లీ నరేషన్ తో సినిమాలో ఫ్లో దెబ్బ తీసాడు. దీనితో తన వర్క్ మాత్రం చాలా బిలో యావరేజ్ గానే అనిపిస్తుంది.

 

తీర్పు :

 

ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ “గాలోడు” లో ఒక్క సుధీర్ సిన్సియర్ పెర్ఫామెన్స్ తప్పా ఏ అంశం కూడా పెద్దగా ఆకట్టుకోదు. కేవలం సుధీర్ మరియు సాంగ్స్ కోసం అయితే థియేటర్ వరకు వెళ్లి చూడదగే రేంజ్ సినిమా కూడా ఇది కాదు. దర్శకుని పూర్తి వైఫల్యం సినిమా ఫలితాన్ని దెబ్బ తీసింది. దీనితో అయితే ఈ వారాంతానికి ఈ సినిమాకి స్కిప్ చేసేయొచ్చు.

123telugu.com Rating: 2.25/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు