సమీక్ష : గరం – అంత ఘాటుగా లేదు!

సమీక్ష : గరం – అంత ఘాటుగా లేదు!

Published on Feb 13, 2016 8:18 PM IST
Garam review

విడుదల తేదీ : 12 ఫిబ్రవరి 2016

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

దర్శకత్వం : మదన్

నిర్మాత : పి. సురేఖ

సంగీతం : అగస్త్య

నటీనటులు : ఆది, ఆద శర్మ, కబీర్ దుహన్ సింగ్..

‘ప్రేమ కావాలి’, ‘లవ్లీ’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన యంగ్ హీరో ఆది తన గత సినిమాలతో ప్రేక్షకులను మెప్పించలేకపోయాడు. అందుకే ఈ సారి కాస్త గ్యాప్ తీసుకొని పూర్తి కమర్షియల్ ఎంటర్టైనర్ అయిన ‘గరం’తో ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తమ సొంత నిర్మాణంలో మదన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో ఆద శర్మ హీరోయిన్. మరి సక్సెస్ కోసం ఆది మొదటిసారి తన సొంత నిర్మాణ సంస్థలో చేసిన ఈ సినిమా ఆదికి హిట్ ఇచ్చిందా లేదా అనేది ఇప్పుడు చూద్దాం..

కథ :

బలరాం(తనికెళ్ళ భరణి) తన కొడుకు వరాలబాబు(ఆది) మీద ఎన్నో ఆశలు పెట్టుకొనీ గొప్పవాడు కావాలని కోరుకుంటాడు. కానీ మన వరాలబాబు మాత్రం ఆవారాలా తయారవుతాడు. పక్కింటి ఇంట్లో ఉన్న మూర్తి(నరేష్) కొడుకు రవి(చైతన్య కృష్ణ) బాగా చదువుతుండడం చూసి రోజూ వరాలబాబుకి చివాట్లు. ఒకరోజు ఆడిలా ఈడిలా కాదు అందరికీ నాలా అవ్వాలని చెప్పుకునే స్టేజ్ కి వస్తానని చెప్పి సిటీకి వస్తాడు. అక్కడ దిగగానే సమీర(ఆద శర్మ)ని చూసి ప్రేమలో పడతాడు.

ఇక రోజూ సమీర చుట్టూ తిరుగుతూ ప్రేమలో పడేయాలని ట్రై చేస్తుంటాడు. సమీర కూడా తనని ఇష్టపడుతున్నా చెప్పలేని పరిస్థితుల్లో ఉంటుంది. అలా గడుస్తున్న టైంలో ఓ రోజు సమీర మరియు తనకి ఇష్టంలేని పక్కింటి వాడైన రవి, బిజ్జు(కబీర్ దుహన్ సింగ్)అనే వాడి వలన ప్రమాదంలో ఉన్నారని తెలుసుకున్న వరాలబాబు ఏం చేసాడు? ఎలా ఇద్దరినీ సేవ్ చేసాడు.? అసలు బిజ్జుకి రవికి, బిజ్జుకి సమీరకి ఉన్న సంబంధాలేమిటి? అనే విషయాలను మీరు వెండితెరపై చూసి తెలుసుకోవాల్సిందే..

ప్లస్ పాయింట్స్ :

‘గరం’ అనే టైటిల్ లోనే తెలుస్తోంది ఇదొక కమర్షియల్ ఎంటర్టైనర్ అని.. టైటిల్ లాగానే సినిమాలో కూడా గరం గరంగా ఉండే కొన్ని కమర్షియల్ అంశాలు ఉన్నాయి. ముఖ్యంగా హీరో పాత్ర మాస్ అవ్వడం వలన సినిమా మొత్తాన్ని హీరో యాంగిల్ లోనే షూట్ చేసి మాస్ ప్రేక్షకులను ఓ మేరకు ఆకట్టుకోవడమే బిగ్గెస్ట్ ప్లస్. ఓ మంచి హీరో ఇంట్రడక్షన్ సీన్ మరియు ఎంటర్టైనింగ్ గా సినిమా మొదలవ్వాలని కామన్ ఆడియన్ కోరుకుంటాడు. అలానే సినిమాని చాలా ఎంటర్టైనింగ్ గా ప్రారంభించడం సినిమాకి చాలా పెద్ద ప్లస్ అయ్యింది. ఆద శర్మ వెంటపడే సీన్స్ లో ఆది అండ్ గ్యాంగ్ చేసే అల్లరి కాస్త నవ్విస్తుంది. అలాగే శకలక శంకర్, మధుల కామెడీ అక్కడక్కడా బాగుంది. ఇంటర్వల్ బ్లాక్ మరియు క్లైమాక్స్ సీన్స్ సినిమాకి కీలకం, ఆ రెండు సీన్స్ బాగా ఎలివేట్ అయ్యాయి.

ఇక నటీనటుల విషయానికి వస్తే.. ఇప్పటిదాకా ఆది ప్రతి సినిమాలో ఒక్కోలా కనిపిస్తూ వచ్చాడు.. కానీ ఈ సినిమాలో అన్ని పక్కా మాస్ మసాలా పాత్రలో కనిపించడమే కాకుండా అన్ని రకాల ఎమోషన్స్ ని బాగా పలికించాడు. మాస్ లుక్ లో కనిపిస్తూ పంచ్ డైలాగ్స్ బాగా పేల్చాడు. ఈ సినిమాతో తనలోనూ సూపర్బ్ కామెడీ టైమింగ్ ఉందని నిరూపించుకున్నాడు. ఇక డాన్సులు, స్టంట్స్ చాలా బాగా చేసాడు. మెయిన్ గా పాటల్లో ఆదశర్మ స్కిన్ షో తో పాటు, ఆదికి పోటీగా అదిరే స్టెప్స్ వేసింది. సీనియర్ నరేష్ చివరి క్లైమాక్స్ సీన్ లో చేసిన సెంటిమెంట్ సీన్స్ అందరినీ హత్తుకుంటాయి. ఆ సీన్ లో స్పెషల్ క్రెడిట్స్ నరేష్ కి చెందుతాయి. కబీర్ దుహన్ సింగ్ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో మెప్పించాడు. ఇకపోతే నాజర్, తనికెళ్ళ భరణిలు సపోర్టింగ్ రోల్స్ లో మెప్పించారు.

మైనస్ పాయింట్స్ :

మైనస్ పాయింట్స్ లో చెప్పుకోవాల్సిన పాయింట్స్ కొన్ని ఉన్నాయి.. మొదటగా సినిమాని బాగా ఆసక్తిగా ప్రారంభించినా ఆ తర్వాత అంతే ఆసక్తితో సినిమాని ముందుకు తీసుకెళ్లలేకపోయారు. మెయిన్ గా ఒక 30 నిమిషాల తర్వాత సినిమా బాగా రొటీన్ అయిపోతుంది. ఏదో జరిగిన సీన్లే మళ్ళీ మళ్ళీ చూస్తున్నాం అనే ఫీలింగ్ లో ఉంటాం. మెయిన్ గా పికె ఫ్లేవర్ లో బ్రహ్మానందంతో కామెడీ చేయించాలని ట్రై చేసిన ఎపిసోడ్ మొత్తం పెద్ద డిజాస్టర్ అయ్యింది. అలాగే జయప్రకాశ్ రెడ్డి, పృథ్వి రాజ్ లతో చేయించిన కామెడీ కూడా సాలు పేలలేదు.. వీటి తర్వాత వచ్చే ఇంటర్వల్ బ్లాక్ బాగానే ఉన్నా, ఆ తర్వాత వచ్చే సెకండాఫ్ అంతే బెటర్ గా లేకపోవడం మెయిన్ మైనస్.

సెకండాఫ్ లోనే అసలు కథలోకి వెళ్తాడు, కానీ సెకండాఫ్ మొదలయ్యాక మెయిన్ ప్లాట్ ని కాస్త పక్క ట్రాక్ పట్టిస్తూ సైడ్ ట్రాక్స్ మీదకి వెళ్ళారు. ఫైనల్ గా సెకండాఫ్ చివరికి వచ్చాక అసలు కథలోకి తీసుకెళ్ళి చకచకా ఫినిష్ చేస్తాడు. సెకండాఫ్ లో కూసింత కూడా ఎంటర్టైన్మెంట్ లేదు. అలాగే అనవసరమైన ట్రాక్స్ యాడ్ చేసి సినిమాని సాగదీసేసాడు. అలాగే సెకండాఫ్ లో పాటలు కూడా ఎలా అపడితే అలా వచ్చి తెగ చిరాకు పెడతాయి. అలాగే ఆద శర్మ లుక్ మరియు పెర్ఫార్మన్స్ విషయంలో పెద్దగా మెప్పించలేకపోయింది. మదన్ ఇప్పటి వరకూ క్లాస్ సినిమాలే చేయడం వలన మాస్ సినిమాని ఓవరాల్ గా హాండిల్ చేయలేకపోయాడు. విలనిజంని కూడా ఇంకాస్త బెటర్ గా ఉండేలా చూసుకోవాల్సింది.

సాంకేతిక విభాగం :

సాంకేతిక విభాగానికి వస్తే సినిమాకి హెల్ప్ పాయింట్స్ విషయానికి వస్తే సురేందర్ రెడ్డి సినిమాటోగ్రఫీ బాగుంది. విజువల్స్ పరంగా ప్రతి ఫ్రేమ్ ని బాగా చూపించాడు. అగస్త్య నేపధ్య సంగీతం బాగుంది. పాటలు బాగానే ఉన్నా సందర్భానుసారంగా కాకుండా ఎలా పడితే అలా వచ్చి ఇబ్బంది పెడతాయి. కార్తీక్ శ్రీనివాస్ ఎడిటింగ్ అంత బాగోలేదు. మెయిన్ గా సెకండాఫ్ అయితే మరీ సాగదీసినట్టు ఉంటుంది. ఆర్ట్ వర్క్ బాగుంది.

ఇక ఈ సినిమాకి కథ, మాటలు ‘సీతమ్మ అందాలు రామయ్య చిత్రాలు’ డైరెక్టర్ శ్రీనివాస్ గవిరెడ్డి అందించాడు. కథ చాలా పాతదే, ఆ కథలో చేసిన మార్పులు కూడా కొత్తగా లేవు. డైలాగ్స్ మాత్రం బాగున్నాయి. కొన్ని పంచ్ డైలాగ్స్ బాగున్నాయి. ఇక మదన్ స్క్రీన్ ప్లే – దర్శకత్వ విభాగాలను డీల్ చేసింది. స్క్రీన్ ప్లే లో దాచిపెట్టిన ఒక ట్విస్ట్ బాగుంది. కానీ అది చివరి దాకా దాయడం వలన మిగతా అంతా బోర్ కొడుతుంది. ఇక దర్శకుడిగా మదన్ మాస్ ఎలిమెంట్స్ ని హాండిల్ చేయడంలో కాస్త తడబడ్డాడు. ఓవరాల్ గా యావరేజ్ అనిపించుకునేలా డీల్ చేసాడు. సురేఖ.పి నిర్మాణ విలువలు బాగున్నాయి.

తీర్పు :

యంగ్ హీరో ఆది తన సొంత నిర్మాణ సంస్థలో చేసిన ‘గరం’ అనేది పక్కా ఫార్ములా బేస్ ఫార్మాట్ లో రూపొందిన కమర్షియల్ సినిమా. ఇది మాస్ సినిమాలను బాగా ఇష్టపడే వారిని మెప్పిస్తుంది. మిగతా వారికి పెద్దగా అనిపించదు జస్ట్ యావరేజ్ అనిపిస్తుంది. డైరెక్టర్ మదన్ ఇప్పటి వరకూ కేవలం క్లాస్ సినిమాలే చేయడం వలన ఫుల్ లెంగ్త్ మాస్ ఎంటర్టైనర్ ని చేయడంలో కాస్త తడబడ్డాడు, అందుకే ఆయన సినిమాలో అక్కడక్కడే మెప్పించగలిగాడు. ఆది ఎనర్జిటిక్ పెర్ఫార్మన్స్, సినిమా ప్రారంభం, క్లైమాక్స్ ఇంటర్వల్ బాంగ్ ప్లస్ అయితే, కొద్ది సేపటికి రొటీన్ అయిపోవడం, ఎంటర్టైన్మెంట్ లేకపోవడం, సెకండాఫ్ బాగా సాగదీయడం, సాంగ్స్ ప్లేస్ మెంట్ సినిమాకి బిగ్గెస్ట్ మైనస్ పాయింట్స్. ఓవరాల్ గా రెగ్యులర్ మాస్ సినిమాలను ఇష్టపడే వారికి ‘గరం’ సినిమా నచ్చుతుంది.

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

123తెలుగు టీం

CLICK HERE FOR ENGLISH REVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు