సమీక్ష : గార్గి – ఎమోషనల్ గా సాగే ఫీల్ గుడ్ మెసేజ్ డ్రామా !

సమీక్ష : గార్గి – ఎమోషనల్ గా సాగే ఫీల్ గుడ్ మెసేజ్ డ్రామా !

Published on Jul 16, 2022 3:04 AM IST
Gargi Movie Review

విడుదల తేదీ : జులై 15, 2022

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5

నటీనటులు: సాయి పల్లవి, కాళీ వెంకట్, ఐశ్వర్య లక్ష్మి, ఆర్ ఎస్ శివాజీ, కలైమామణి శరవణన్

దర్శకత్వం : గౌతం రామచంద్రన్

నిర్మాతలు: రవిచంద్రన్ రామచంద్రన్, థామస్ జార్జ్, ఐశ్వర్య లక్ష్మి వి, గౌతం రామచంద్రన్

సంగీత దర్శకుడు: గోవింద్ వసంత

సినిమాటోగ్రఫీ: శ్రేయంతి & ప్రేమకృష్ణ అక్కతు

ఎడిటర్: షఫీక్ మహమ్మద్ అలీ


 
సాయిపల్లవి ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ గార్గి. గౌతమ్ రామచంద్రన్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం తెలుగులో ఈ రోజే విడుదల అయింది. మరి ప్రేక్షకులును ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

కథ:

సాయిపల్లవి (గార్గి) టీచర్‌ గా వర్క్ చేస్తూ ఉంటుంది. త్వరలో పెళ్లికి కూడా సిద్ధం అవుతుంది. మరోపక్క గార్గి తండ్రి సెక్యూరిటీ గార్డ్ గా పని చేస్తుంటాడు. ఇలాంటి సమయంలో అనుకోకుండా ఓ రోజు బాలిక పై హత్యాచారం కేసులో ‘గార్గి తండ్రి’ని పోలీసులు అరెస్ట్ చేస్తారు. అతన్ని సీక్రెట్ ప్లేస్ లో ఉంచుతారు. దాంతో తన తండ్రి ఎక్కడున్నాడో కూడా తెలియని గార్గి, తండ్రి కోసం పరితపిస్తోంది. పోలీసులు కూడా తండ్రితో కలవనివ్వరు. దీంతో న్యాయం కోసం, తండ్రిని నిర్దోశిగా నిరూపించడం కోసం గార్గి పెద్ద న్యాయ పోరాటమే చేస్తోంది. ఈ పోరాటంలో గార్గి ఎలాంటి సమస్యలు ఎదుర్కొంది ?, చివరకు గార్గికి నిజం తెలిసిందా ? లేదా ? అనేది మిగిలిన కథ.

 

ప్లస్ పాయింట్స్:

ఓ యదార్ధ సంఘటన ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో కొన్ని ఎమోషన్స్ అండ్ ప్లే అలాగే సినిమాలో ఇచ్చిన మెసేజ్ ప్రేక్షకుల మనసును కదిలిస్తోంది. ఒక్క మాటలో చెప్పాలి అంటే.. న్యాయపోరాటాన్ని ఆవిష్కరించే చిత్రం ఇది. వాస్తవిక కథతో పాటు కథనం కూడా చాలా వాస్తవంగా సాగడంతో సినిమా పై ఆసక్తి పెరుగుతుంది. ఏ తప్పు చెయ్యనివారిని సమాజం మానసికంగా హింసించే సన్నివేశాలు కూడా చాలా ఎమోషనల్ గా సాగుతూ ఆకట్టుకుంటాయి.

పోలీసుల్లో కొంతమంది పోలీసులు ప్రవర్తన, పై అధికారుల ఒత్తిడికితో వాళ్ళు అమాయకులను ఎలా బుక్ చేస్తారనే పాయింట్ తో పాటు మీడియా ఎలా మిస్ లీడ్ చేస్తోంది వంటి అంశాలను సినిమాలో కళ్ళకు కట్టినట్లు చూపించారు దర్శకుడు. సాయిపల్లవి నటన అద్భుతంగా అనిపిస్తోంది. తండ్రిని పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు, తండ్రి పై జనం ఎటాక్ చేసే సీన్స్ లో సాయి పల్లవి నటన చాలా బాగుంది.

అలాగే, క్లైమాక్స్ లో కూడా సాయి పల్లవి పలికించిన హావభావాలు చాలా బాగా ఆకట్టుకున్నాయి. ఇక కీలక పాత్రల్లో నటించిన నటులు కూడా తమ పాత్రల్లో ఒదిగిపోయారు. దర్శకుడు పనితీరు సినిమాకే హైలైట్ గా నిలుస్తోంది. ఆయన రచన కూడా చాలా బాగుంది.

 

మైనస్ పాయింట్స్:

మనసును కదిలించే మెసేజ్ తో పాటు ఎమోషనల్ సన్నివేశాలతో ఈ సినిమా ఆకట్టుకున్నప్పటికీ.. కమర్షియల్ అంశాలు పెద్దగా లేకపోవడంతో స్క్రీన్ ప్లే చాలా స్లో గా సాగుతున్న ఫీలింగ్ కలుగుతుంది. ముఖ్యంగా దర్శకుడు సెకండ్ హాఫ్ కథనాన్ని ఆసక్తికరంగా మలచలేకపోయారు. కొన్ని కీలకమైన సన్నివేశాలను పర్వాలేదనిపించిన్నప్పటికీ.. మిగిలిన సన్నివేశాలను స్లోగా నడిపాడు.

సినిమా చూస్తున్నంతసేపు తర్వాత ఏం జరుగుతుంది, ప్రధాన పాత్రలు ఎలాంటి కష్టాల్లో పడతారో, అసలు వాళ్ళు పోలీసులు నుండి ఎలా తప్పించుకుంటారో అనే ఉత్కంఠ ప్రేక్షకుల్లో ఇంకా పెంచే అవకాశం ఉన్నప్పటికీ దర్శకుడు ఆ దిశగా సినిమాని నడపలేదు. ఇక సినిమా క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ తప్ప మిగిలిన సీన్స్ ఏవరేజ్ గా అనిపిస్తాయి.

 

సాంకేతిక విభాగం:

మంచి కథాంశం తీసుకోవడంలో సక్సెస్ అయిన దర్శకుడు ఉత్కంఠభరితమైన కథనాన్ని రాసుకోవడంలో మాత్రం కాస్త వెనుకబడ్డారు. కానీ ఆయన రూపొందించిన సన్నివేశాలు మాత్రం కొన్ని బాగా ఆకట్టుకున్నాయి. సంగీత దర్శకుడు సంగీతం బాగుంది. సినిమాటోగ్రఫీ వర్క్ సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఇక దర్శకుడు ఆలోచనను నమ్మి ఇలాంటి వైవిధ్యమైన చిత్రంలో నటించినందుకు సాయి పల్లవిని అభినందించాలి. నిర్మాణ విలువలు కూడా చాలా బాగున్నాయి.

 

తీర్పు:

గార్గి అంటూ వచ్చిన ఈ ఎమోషనల్ అండ్ మెసేజ్ ఓరియెంటెడ్ ఫిల్మ్ లో చెప్పాలనకున్న మెయిన్ కంటెంట్ మరియు కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు హృదయానికి హత్తుకుపోతాయి. సాయి పల్లవి నటన అద్భుతంగా అనిపిస్తోంది. దర్శకుడు కొన్ని వాస్తవిక సంఘటనల ఆధారంగా మంచి స్టోరీ లైన్ ను తీసుకున్నారు, కానీ.. ఆ లైన్ కు తగ్గట్లు ఇంట్రస్టింగ్ కథాకథనాలను రాసుకోలేదు. సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ అయ్యాయి. కానీ.. సినిమాలో ఎమోషన్ అండ్ మెసేజ్ చాలా బాగా ఆకట్టుకుంటాయి. మొత్తమ్మీద ఈ చిత్రం ఆకట్టుకుంటుంది.

123telugu.com Rating: 3/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు