సమీక్ష : ‘గ‌ల్లీ రౌడీ’ – కొన్ని చోట్ల ఆకట్టుకునే కామెడీ డ్రామా

సమీక్ష : ‘గ‌ల్లీ రౌడీ’ – కొన్ని చోట్ల ఆకట్టుకునే కామెడీ డ్రామా

Published on Sep 18, 2021 10:50 AM IST
Gully Rowdy Movie Review

విడుదల తేదీ : సెప్టెంబర్ 17, 2021

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు: సందీప్ కిష‌న్‌, నేహా శెట్టి, రాజేంద్ర ప్ర‌సాద్‌, బాబీ సింహ, పోసాని కృష్ణ ముర‌ళి, వెన్నెల కిషోర్‌, వైవా హ‌ర్ష‌, త‌దిత‌రులు

దర్శకుడు: జి.నాగేశ్వ‌ర్ రెడ్డి
నిర్మాతలు: కోన వెంక‌ట్‌, ఎం.వి.వి.స‌త్య‌నారాయ‌ణ‌
సంగీత దర్శకుడు: చౌర‌స్తా రామ్‌, సాయికార్తీక్‌
ఎడిటర్: ఛోటా కె.ప్ర‌సాద్‌

యంగ్ హీరో సందీప్‌ కిషన్, నేహా శెట్టి జంటగా జి. నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘గల్లీ రౌడీ’. స్టార్ రైట‌ర్ కోన వెంక‌ట్‌ సమర్పణలో, ఎం.వి.వి.సత్యనారాయణ నిర్మించిన ఈ ఫుల్‌ లెంగ్త్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ ఈ రోజు విడుదల అయింది. మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

 

కథ:

 

వాసు (సందీప్ కిషన్) ఒక రౌడీ కుటుంబానికి చెందిన వ్యక్తి. ఇష్టం లేకపోయినా గ్యాంగ్ వార్ లోకి బలవంతంగా దిగాల్సి వస్తోంది. ఈ మధ్యలో హీరోయిన్ నేహా శెట్టి ప్రేమలో పడతాడు. అయితే ఆమెకు ఒక పెద్ద సమస్య వస్తోంది. వాసు (సందీప్) రౌడీ నేపథ్యాన్ని ఉపయోగించి తన కుటుంబాన్ని కాపాడమని ఆమె కోరుతుంది. అసలు రౌడీగా ఉండడాన్నే ఇష్ట పడని వాసు, ఆమె కుటుంబాన్ని ఎలా కాపాడాడు ? ఆమె ప్రేమను ఎలా గెలుచుకున్నాడు? చివరకు వాసు కథ ఎలాంటి మలుపు తీసుకుంది ? లాంటి విషయాలు తెలియాలంటే వెండితెర పై ఈ చిత్రం చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్ :

 

ఈ సినిమా హీరోగా నటించిన సందీప్ కిషన్ గత తన సినిమాల్లో కంటే ఈ సినిమాలో ఫ్రెష్ గా, స్టైలిష్ గా కనిపించాడు. తన క్యారెక్టరైజేషన్ తో తన టైమింగ్‌ తో అక్కడక్కడా నవ్వించే ప్రయత్నం చేస్తూనే, ఇటు సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. ఇక మరో కీలక పాత్రలో నటించిన రాజేంద్ర ప్రసాద్ నటన కూడా చాలా బాగుంది. హెడ్ కానిస్టేబుల్ గా రాజేంద్ర ప్రసాద్ మంచి కామెడీని పండించాడు.

ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన నేహా శెట్టి తన స్క్రీన్ ప్రెజెన్స్ తో పాటు గ్లామర్ తోనూ మెప్పించింది. సందీప్ – నేహా శెట్టి మధ్య నడిచే సీన్స్ కూడా బాగానే ఉన్నాయి. బాబీ సింహా మంచి పాత్రలో నటించాడు. అలాగే పోసాని పాత్ర కూడా బాగుంది. ఫస్ట్ హాఫ్ లో కిడ్నాప్ కామెడీ బాగుంది. వెన్నెల కిషోర్ తన పాత్రతో మంచి వినోదాన్ని పంచాడు. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు.

 

మైనస్ పాయింట్స్ :

 

సినిమా ఫస్ట్ హాఫ్ ఆకట్టుకునేలా ఉన్నా… సెకండ్ ఆఫ్ ఇంట్రెస్ట్ గా సాగదు. దర్శకుడు ఆసక్తికరమైన డ్రామాను జనరేట్ చేయడంలో విఫలమయ్యాడు. సెకండ్ హాఫ్‌లో చాలా సన్నివేశాలను ల్యాగ్ అయ్యాయి. బాబీ సింహా పాత్ర ఎటువంటి కారణం లేకుండానే హైప్ చేశారు. కేసును విచారించే విధానం కూడా స్లో అయింది.

పైగా మెయిన్ క్యారెక్టరైజేషన్స్ మొదట్లో ఇంట్రెస్ట్ గా అనిపించినప్పటికీ.. చివరికి వచ్చే సరికి ఆ క్యారెక్టరైజేషన్స్ కి క్లారిటీ మిస్ అయి ఆకట్టుకోవు. అలాగే సినిమాలో చాలా చోట్ల నాటకీయత ఎక్కువవడంతో కథలో సహజత్వం లోపించింది. ఓవరాల్ గా బలహీన సంఘటనలతో సాగే కథనంలో.. బలమైన కాన్ ఫిల్ట్ మిస్ అయింది. దర్శకుడు కథలో కీలకమైన అంశాలను మరియు సన్నివేశాలను ఇంకా బలంగా ఎస్టాబ్లిష్ చేసి ఉంటే బాగుండేది.

 

సాంకేతిక విభాగం :

 

ఈ చిత్ర దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డి మంచి కథాంశాన్ని ఎంచుకున్నాడు. అలాగే తన దర్శకత్వ పనితనంతో ప్రేక్షకుల్ని ఆకట్టుకునే ప్రయత్నం అయితే చేశాడు గానీ, అది పూర్తి సంతృప్తికరంగా సాగలేదు. ఆయన సెకండాఫ్ పై ఇంకా శ్రద్ధ పెట్టి ఉండి ఉండాల్సింది. సినిమాలో సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు, కానీ సినిమాలోని సాగతీత సన్నివేశాలను తగ్గించి ఉంటే.. సినిమాకు ప్లస్ అయ్యేది. నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాణ విలువులు చాలా బాగున్నాయి.

 

తీర్పు:

 

‘గల్లీ రౌడీ’ అంటూ సందీప్ కిషన్ మంచి కామెడీ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ తో వచ్చినా పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు. అయితే, సినిమాలో బ్యాక్‌ డ్రాప్‌ సెటప్, పాత్రల ఎలివేషన్స్, అలాగే కామెడీ బాగానే ఉన్నాయి. కాకపోతే బోరింగ్ ట్రీట్మెంట్, ఆసక్తికరంగా సాగని స్క్రీన్ ప్లే వంటి అంశాలు సినిమాకు మైనస్ అయ్యాయి. కథాకథనాలను విస్మరించి, జస్ట్ టైమ్ పాస్ కావాలనుకుంటే ఈ సినిమా చూడొచ్చు.

123telugu.com Rating : 2.75/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు