ఆడియో సమీక్ష : హలో – మంచి ప్రేమానుభూతి కలిగించే పాటలు

ఆడియో సమీక్ష : హలో – మంచి ప్రేమానుభూతి కలిగించే పాటలు

Published on Dec 11, 2017 6:13 PM IST

అక్కినేని అఖిల్ రెండవ చిత్రం ‘హలో’ ఆడియో వేడుక నిన్న వైజాగ్లో ఘనంగా జరిగింది. నిన్ననే పూర్తి పాటలు కూడా విడుదలయ్యాయి. అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ ఆల్బమ్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

1. పాట : హలో hello

గాయనీ గాయకులు : అర్మాన్ మాలిక్
రచన : వనమాలి, శ్రేష్ఠ

‘హలో.. ఎక్కడున్నావ్.. హలో.. ఏమయ్యావ్.. హలో’ అంటూ మొదలయ్యే ఈ పాట వినడానికి చాలా ఆహ్లాదకరంగా ఉంది. వనమాలి, శ్రేష్ఠ రాసిన లిరిక్స్ ఒకసారి వినగానే హమ్ చేసేలా ఉండగా అర్మాన్ మాలిక్ గాత్రం కొత్తగా అనిపిస్తోంది. ఇక అనూప్ సంగీతం కూడా వైవిధ్యంగా వినసొంపుగా ఉంది. హీరో తన ప్రేయసికై ఎదురుచూసే సందర్భంలో వచ్చే ఈ పాట ఆల్బమ్ లోని మంచి పాటల్లో ఒకటిగా నిలిచిపోతుంది.

anaganaga oka uru2. పాట : అనగనగా ఒక ఊరు
గాయనీ గాయకులు : శ్రీ ధృతి
రచన : చంద్రబోస్

‘అనగనగా ఒక ఊరు..’ అంటూ వచ్చే మొదలయ్యే ఈ పాట వినడానికి ఎంతో హాయిగా అనిపిస్తోంది. చిన్నతనంలో హీరో హీరోయిన్ల మధ్య స్నేహం, అందులోని స్వచ్ఛతను, బలాన్ని వివరిస్తుంది. ‘జరిగిన నిముషంలోన చెలిమే, ఎరగని మరు నిమిషాన చెలిమే కాలం చెక్కిలిలో చెలిమి చుక్కై మెరిసిందే’ అంటూ చంద్రబోస్ రాసిన సాహిత్యం చాలా అర్థవంతంగా ఉంది. శ్రీ ధృతి గాత్రం కూడా పాటకు చాల గొప్పగా కుదిరి కథ వింటున్నట్టే అనిపించింది. అనూప్ రూబెన్స్ సంగీతం అయితే ఈ పాటలో ఎంతో చక్కగా కుదిరింది. ఈ పాత కూడా సినిమాలోని ఉత్తమమైన పాటల జాబితాలోకి చేరుతుంది.

3. పాట : తలచి తలచిThalachi Thalachi
గాయనీ గాయకులు : హరి చరణ్
రచన : వనమాలి

‘తెలిసీ తెలియని ఊహలో కలిసి కలవని దారిలో’ అంటూ సాగే ఈ పాట ఆరంభం నుండే కొద్దిగా నెమ్మదిగా, సాధారంగానే ఉంటుంది. ఈ పాట కూడా కథానాయకుడు తన ప్రేయసిని క్రమంలోనే వచ్చేదిగా వచ్చేదిగా ఉంది. దీనికి వనమాలి రాసిన సాహిత్యం బాగున్నా అనూప్ సంగీతం నార్మల్ గానే ఉంది. హరి చరణ్ గాత్రం బాగానే ఉంది. విజువల్స్ తో కలిపి చూస్తే ఈ పాట ఇంకాస్త బెటర్ గా ఉండే అవకాశాముంది.

champesave4. పాట : ఏవేవో
గాయనీ గాయకులు : అఖిల్ అక్కినేని, జోనిత గాంధీ
రచన : చంద్రబోస్

‘ఏవేవో కలలు కన్నా..’ అంటూ అఖిల్ పాడే ఈ పాట వినడానికి బాగానే ఉంది. అఖిల్ గాత్రం కూడా పాటకు బాగా సరిపోయింది. అనుభవం కలిగిన గాయకుడిలానే పాడాడు అఖిల్. ఇది కూడా హీరోయిన్ కోసం తపిస్తూ హీరో పాడే పాటే. ఆరంభం నుండి వినసొంపుగానే ఉండే ఈ పాట చివరి వరకు అలాగే సాగుతూ చిన్నపాటి తన్మయత్వానికి గురిచేసింది. అనూప్ సంగీతం, అఖిల్, జోనిత గాంధీల గాత్రం అన్నీ సరిగ్గా కుదిరి పాటను మళ్ళీ మళ్ళీ వినాలనేలా చేశాయి.

5. పాట : అనగనగా side
గాయనీ గాయకులు : శ్రేయ గోషల్
రచన : చంద్రబోస్

ఈ పాట ఒక్క గాత్రం మినహా సంగీతం, సాహిత్యం అన్నీ రెండవ పాటలానే ఉంటుంది. ఆ పాటను శ్రీ ధృతి ఆలపించగా దీన్ని శ్రేయ గోషల్ పాడారు. శ్రేయ గోషల్ పాడటం వలన ఈ పాటకు ఇంకాస్త హుందాతనాన్ని తీసుకొచ్చి, అందులోని ఫీల్ ను పెంచింది. ఇది కూడా మంచి పాటల జాబితాలోకి చేర్చవల్సిన పాటే.

champesave6. పాట : మెరిసే మెరిసే
గాయనీ గాయకులు : హరి చరణ్, శ్రీనిధి వెంకటేష్, శృతి రజని
రచన : వనమాలి, శ్రేష్ఠ

మొదలవడమే మంచి బీట్ తో మొదలయ్యే ఈ పాట ఆరంభంలో హుషారుగానే సాగింది. హీరో హీరోయిన్ ను చుట్టుముడుతూ పాడే ఈ పాట విజువల్ గా మరింత అందంగా ఉండే అవకాశముంది. చంద్రబోస్ అందించిన ‘మెరిసే మెరిసే ఆ కన్నుల్లోన ఏదో మెరిసే ఆ మనసే మురిసే మురిసే ఆ సంగతి నాకు తెలుసే’ వంటి సరళమైన సాహిత్యం, గాయనీ గాయకుల గాత్రం బాగానే ఉన్నాయి. మధ్యలో అనూప్ చేసిన సంగీత ప్రయోగం పెద్దగా మెస్మరైజ్ చేయకపోయినా బాగానే ఉందనిపించింది.

తీర్పు:

విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘హాలో’ యొక్క ఆడియో జానర్ కు తగ్గట్టే ఎక్కడా హడావుడి లేకుండా ఎంతో నిలకడగా ఒక ప్రేమ కథా చిత్రానికి ఎలాంటి పాటలైతే కావాలో అలాంటి పాటల్నే కలిగి ఉంది. ఒక్క మూడవ పాట మాత్రమే పర్వాలేదనిపించగా ఒకటి, రెండు, నాలుగు, ఐదు పాటలు మళ్ళీ మళ్ళీ వినాలనిపించేలా, ఆరవ పాట విన్నంతసేపు బాగానే ఉంది అనేలా ఉంది. అనూప్ రూబెన్స్ అక్కినేని వారికి ‘మనం’ తర్వాత ఆ స్థాయి సంగీతాన్ని అందించిన చిత్రమిదే అని చెప్పాలి. మొత్తం మీద సినిమా సక్సెస్ ను దాదాపుగా ఖాయం చేసిన ఈ ఆడియో మంచి ప్రేమానుభూతి కలిగించే పాటలను కలిగి ఉంది.

Click here for English Music Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు