సమీక్ష : ‘హౌస్ అరెస్ట్’ – సింగిల్ పాయింట్ తో సాగే స్లో కామెడీ డ్రామా !

సమీక్ష : ‘హౌస్ అరెస్ట్’ – సింగిల్ పాయింట్ తో సాగే స్లో కామెడీ డ్రామా !

Published on Aug 28, 2021 3:01 AM IST
House Arrest movie review

విడుదల తేదీ : ఆగస్టు 27, 2021

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు: శ్రీనివాస్ రెడ్డి, స‌ప్త‌గిరి, అదుర్స్ ర‌ఘు, ర‌విప్ర‌కాశ్‌, ర‌విబాబు, తాగుబోతు ర‌మేవ్‌, ఫ్ర‌స్టేటెడ్ సునైన‌, కౌశిక్ త‌దిత‌రులు

దర్శకుడు: శేఖ‌ర్ రెడ్డి ఎర్రా

నిర్మాత: కె.నిరంజ‌న్ రెడ్డి

సంగీత దర్శకుడు: అనూప్ రూబెన్స్‌

సినిమాటోగ్రఫీ: జె.యువ‌రాజ్‌

ఎడిటర్: ఛోటా కె.ప్ర‌సాద్‌

నటుడు శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరిలు హీరోలుగా, ‘90 ఎంఎల్’ ఫేమ్ శేఖ‌ర్‌రెడ్డి యెర్ర ద‌ర్శక‌త్వంలో వచ్చిన సినిమా ‘హౌస్ అరెస్ట్’. ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌ గా రూపొందిన ఈ చిత్రానికి అస్రిన్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌గా వ్యవ‌హ‌రిస్తున్నారు. మరి సినిమా ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.

 

కథ :

 

సాంబ (శ్రీనివాస్ రెడ్డి), జానీ (సప్తగిరి), శ్రీసేలం (రఘు) మరియు మరో ఇద్దరు కలిసి దొంగతనాలతో పాటు చిన్న పిల్లలను కిడ్నాప్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఒక ఇంట్లోకి దొంగతనానికి వస్తారు. అప్పటికే ఆ ఇంట్లోని పెద్దవాళ్ళు అంతా పిల్లలను ఇంట్లో ఉంచి, ఓ పెళ్లికి వెళ్తారు. మరి ఆ ఐదుగురు పిల్లలు, దొంగతనానికి వచ్చిన సాంబ -జానీ బ్యాచ్ మధ్య జరిగిన డ్రామా ఏమిటి ? పిల్లలు ఎలాంటి ప్లాన్స్ వేశారు ? దెయ్యాలుగా నమ్మించి వీళ్లను ఏ రకంగా టార్చర్ పెట్టారు ? చివరకు ఈ దొంగల కథ ఎలా ముగిసింది ? పిల్లలు తమ తెలివితేటలతో ఎలా ఆకట్టుకున్నారు ? అనేది మిగిలిన కథ.

 

ప్లస్ పాయింట్స్ :

 

కొందరు పిల్లలు ఉన్న ఇంట్లోకి దొంగలు వెళ్తే.. వాళ్లతో ఆ పిల్లలు ఎలా ఆడుకున్నారు అనే కోణంలో సాగిన ఈ సినిమాలో ప్రధాన పాత్రలలో నటించిన సప్తగిరి, శ్రీనివాస్ రెడ్డి ఎలాంటి గ్యాప్ లేకుండా తమ కామెడీ టైమింగ్ తో బాగానే నవించారు. ముఖ్యంగా ప్రీ ఇంటర్వెల్ సీక్వెన్స్ మరియు కొన్ని కామెడీ సీన్స్ బాగున్నాయి.

ఇక ఇతర పాత్ర‌ధారులుగా నటించిన తాగుబోతు రమేష్, రఘు, రవి ప్రకాష్, సునయన, పోలీస్ ఆఫీసర్ గా నటించిన రవిబాబు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ఇక పిల్లలుగా నటించిన ప్రతి చిన్నారి తమ ఫన్నీ డైలాగ్స్ తో నవ్విస్తూనే.. ఇటు కథలో కామెడీతో కూడుకున్న సీరియస్ నెస్ కూడా తీసుకొచ్చారు.

దర్శకుడు శేఖ‌ర్ రెడ్డి ఎర్రా ఈ చిత్రంతో డిఫరెంట్ కామెడీ యాంగిల్ ను చూపించాలనుకున్న ప్రయత్నం బాగుంది. మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

 

మైనస్ పాయింట్స్ :

 

పాయింట్ పరంగా, కామెడీ పరంగా మంచి కంటెంట్ తీసుకున్న దర్శకుడు, కొన్ని కీలక సన్నివేశాలను, అలాగే ట్రీట్మెంట్ ను ఇంకా బెటర్ రాసుకుని ఉండి ఉంటే బాగుండేది. సినిమాలో ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే అంశాలు పెట్టడానికి ఇంకా స్కోప్ ఉన్నప్పటికీ ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో.. కానీ సినిమా మాత్రం ఆ దిశగా సాగదు.

అలాగే సినిమాలో చెప్పుకోవడానికి అనేక ట్రాక్ లు ఉన్నాయి గానీ, ప్రేక్షకులను మాత్రం పూర్తిస్థాయిలో నవ్వించలేకపోయారు. సినిమాలో అనవసరమైన సీన్స్ తో సినిమాని సాగదీశారు. దీనికి తోడు కథ పరంగా సింగిల్ హౌస్ లోనే సినిమాని నడపాల్సి రావడం.. ప్రేక్షకులకు కొన్ని సీన్స్ విషయంలో మోనాటిని వచ్చిన ఫీలింగ్ కలుగుతుంది.

 

సాంకేతిక విభాగం :

 

సినిమాలో మంచి కంటెంట్ తీసుకున్నా.. సినిమాని ఆకట్టుకునేలా ఆసక్తికరంగా మలచలేకపోయారు. అయితే, సినిమాలో పిల్లలు చేసే కామెడీ, అలాగే కొన్ని సీన్స్ ఆకట్టుకుంటాయి. కెమెరామెన్ కెమెరా పనితనం బాగుంది. అలాగే కీలక సన్నివేశాలలో మ్యూజిక్ డైరెక్టర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు మంచి అనుభూతిని ఇచ్చింది. ఇక నిర్మాణ విలువ కూడా బాగున్నాయి.

 

తీర్పు :

 

‘హౌస్ అరెస్ట్’ అని ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా వచ్చిన ఈ చిత్రంలో ఆకట్టుకునే అంశాలు కొన్ని ఉన్నాయి. సినిమాలో శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరిల నటనతో పాటు పిల్లలు నటన, వారి సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఐతే స్లో నేరేషన్, సింపుల్ ప్లే, సింగిల్ ప్లాట్ వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి. ఓవరాల్ గా ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్స్ ఇష్టపడేవారు ఈ మూవీని ఓ సారి చూడొచ్చు. కానీ మిగిలిన వర్గాలకు ఈ సినిమా కనెక్ట్ కాదు.

123telugu.com Rating :  2.5/5

Reviewed by 123telugu Team

సంబంధిత సమాచారం

తాజా వార్తలు