ఓటిటి సమీక్ష: హంగామా 2 – హిందీ చిత్రం హాట్ స్టార్ లో

Published on Jul 24, 2021 3:02 am IST
 Needa Movie Review

విడుదల తేదీ : జూలై 23,2021
123telugu.com Rating : 2.5/5

నటీనటులు : పరేష్ రావల్, మీజాన్ జాఫ్రీ, ప్రణీత సుభాష్

దర్శకుడు : ప్రియదర్శన్

నిర్మాతలు : రతన్ జైన్, గణేష్ జైన్, చేతన్ జైన్, అర్మాన్ వెంచర్స్

సంగీత దర్శకుడు :రొన్నీ రఫెల్

 

ఓటిటి లో సినిమాలని మరియు వాటి ప్రదర్శనలను సమీక్షించే ధోరణి కొనసాగిస్తూ, నేడు మనం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న హంగామా 2 చిత్రం సమీక్ష ను ఇక్కడ చూద్దాం. ఈ చిత్రం ఇప్పుడు డిస్నీ హాట్ స్టార్ లోకి వచ్చేసింది.

 

కథ:

ఆకాష్ (మెజాన్ జాఫరీ) నిశ్చితార్థం కోసం సిద్దం అవుతున్న సమయం లో వాణి (ప్రణీత సుభాష్) తన కుమార్తె తో వచ్చి ఆకాష్ తన భర్త అంటూ చెప్పుకొస్తుంది. మరొక వైపు తివారీ (పరేష్ రావల్) ఒక వృద్ధుడు, అతనికి యువ భార్య (శిల్పా శెట్టి) ఉంటుంది. ఆమె ఆకాష్ తో అఫైర్ లో ఉంటుంది అనే ఆలోచనలో ఉంటాడు. ఈ విషయం ఆకాష్ కి మరొక టెన్షన్ లా ఉంటుంది. ఈ మొత్తం గజిబిజి ఎలా క్లియర్ అవుతుంది అనేది ఈ హంగామా 2 చిత్రం కథ.

 

ప్లస్ పాయింట్స్:

అయితే చాలా గ్యాప్ తర్వాత ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ ఒక గందరగోళ కామెడీ తో తిరిగి వచ్చారు. అయితే అతని హిట్ చిత్రాల్లోని ప్రధాన పాత్రలు పోషించిన అందరూ కూడా ఓకే దగ్గర చూడటం చాలా కామెడీ ను క్రియేట్ చేస్తుంది. అయితే ఈ చిత్రం లో పరేష్ రావల్ మరియు అతని భార్య పాత్ర పోషించిన శిల్పా శెట్టి ల కామెడీ చాలా బావుంది కాకపోతే స్క్రీన్ స్పేస్ తగినంత లేదని చెప్పాలి.

మీజాన్ జాఫరీ తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడని చెప్పాలి. అయితే ఈ చిత్రం లో కీలక పాత్ర లో పోషించిన ప్రణీత సుభాష్ చాలా ఆకట్టుకుంటుంది అని చెప్పాలి. తన పాత్రలో ఒదిగి పోవడమే కాకుండా స్క్రీన్ పై చాలా బాగా కనిపించింది అని చెప్పాలి. అయితే పరేష్ రావల్ స్క్రీన్ పై కనిపించిన ప్రతి సారి కూడా నవ్వులు పూయించాడు అని చెప్పాలి.

అయితే శిల్పా శెట్టి ఇప్పటికీ కూడా చాలా అందంగా కొన్ని సన్నివేశాల్లో అధ్బుతంగా ఉందని చెప్పాలి. రాజ్ పాల్ యాదవ్ అతిధి పాత్రలో కనబడి, ఆకట్టుకున్నారు అని చెప్పాలి. అయితే ఈ చిత్రం లో కామెడీ, క్లైమాక్స్ లో కొన్ని సన్నివేశాలు చాలా బాగా ఆకట్టుకున్నాయి అని చెప్పాలి.

 

మైనస్ పాయింట్స్:

అయితే ఈ చిత్రం ట్రైలర్ విడుదల అయినప్పుడు శిల్పా శెట్టి మరియు సందేహ పడే భర్త పరేశ్ రావల్ పై ఉంటుంది అని అనుకున్నారు, కానీ సినిమా అంతా కూడా ప్రణీత మరియు ఆమె కథ పైనే ఉంటుంది.

అయితే ఈ చిత్రం పూర్తిగా ప్రణీత మరియు ఆమె కథ పై ఆధారపడి ఉండటం, ఆమె ట్రాక్ అంతా డ్రామా మరియు కామెడీ అనుకున్న స్థాయిలో ఉండదు అని చెప్పాలి. అయితే పరేష్ రావల్ వచ్చినప్పుడు మాత్రమే ఈ చిత్రం సరైన ట్రాక్ లో ఉంటుంది. మిగతా సమయం లో అంతగా ఆకట్టుకోదు అని చెప్పాలి.

అయితే ప్రియదర్శన్ గందరగోళం కామెడీని తిరిగి తీసుకు వచ్చేందుకు ప్రయత్నించినా, ప్రియదర్శిని ట్రేడ్ మార్క్ కి తగ్గ విధంగా ఉండదు అని చెప్పాలి. ఈ చిత్రం చాలా నెమ్మదిగా మొదలవుతుంది. అంతేకాక కామెడీ కొన్ని సన్నివేశాల్లో ఓవర్ గా అనిపిస్తుంది అని చెప్పాలి. అంతేకాక లాజిక్ లేకుండా ఉండటం తో మైనస్ అని చెప్పాలి.

 

సాంకేతిక విభాగం:

వీనస్ ఈ చిత్రం కోసం చాలా డబ్బు ఖర్చు చేశాడు, కెమెరా వర్క్, లోకేషన్స్ మరియు ప్రొడక్షన్ డిజైన్ చాలా బావుంది. డైలాగులు మరియు పరేష్ రావల్ మకాం రాసినవి చాలా ఉల్లాసంగా ఉంటాయి. ప్రియదర్శన్ కామెడీ కొన్ని విభాగాలకు మాత్రమే పరిమితం అయింది స్క్రీన్ ప్లే లో మేజిక్ ఏమీ లేదని చెప్పాలి.

 

తీర్పు:

ఈ హంగామా 2 చిత్రం మొత్తం మీద అంచనాలకు తగ్గట్టుగా ఉంటుంది అని చెప్పాలి. బలమైన తారాగణం ఉంది కానీ భావోద్వేగాలు మరియు కథ రొటీన్ గా ఉంటాయి. అయితే శిల్పా శెట్టి పరేష్ రావల్ ట్రాక్ అంత గా ఉపయోగించలేదు అని చెప్పాలి. ప్రియదర్శన్ మార్క్ కామెడీ అక్కడక్కడ మాత్రమే ఉంటుంది, కొన్ని సన్నివేశాలు చూసి నవ్వుకొనే విధంగా ఉంటుంది అని చెప్పాలి.

123telugu.com Rating : 2.5/5

Reviewed by 123telugu Team

 

Click Here For English Review

సంబంధిత సమాచారం :