సమీక్ష : ఇద్దరి లోకం ఒకటే – ఆకట్టుకోలేకపోయిన ఫ్యూర్ ప్రేమ కథ !

Iddari Lokam Okate review

విడుదల తేదీ : డిసెంబర్  25, 2019

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు :  రాజ్ తరుణ్, షాలిని పాండే, రాజా,నాజర్, భరత్ తదితరులు
దర్శకత్వం : జి ఆర్ కృష్ణ
నిర్మాత‌లు : శిరీష్

సంగీతం :  మిక్కీ జె మేయర్

సినిమాటోగ్రఫర్ : సమీర్ రెడ్డి

ఎడిటర్:  తమ్మిరాజు


యంగ్ హీరో రాజ్‌ తరుణ్‌ హీరోగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన చిత్రం ‘ఇద్దరి లోకం ఒకటే’. ఈ సినిమాలో రాజ్ తరుణ్ సరసన షాలినీ పాండే హీరోయిన్ గా నటించింది. జి.ఆర్‌.కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా క్రిస్మస్ సందర్భంగా ఈ రోజు విడుదల అయింది. మరి ప్రేక్షకులును ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

 

కథ :

 

మహి (రాజ్ తరుణ్) వర్ష (షాలినీ పాండే) ఒకరి కోసం ఒకరు అన్నట్లు ఇద్దరూ ఒకే రోజు పుడతారు. చిన్న తనంలోనే ఇద్దరు మధ్య బలమైన స్నేహం ఏర్పడినా.. ఆ తరువాత ఇద్దరూ విడిపోతారు. పెద్దయ్యాక వర్ష హీరోయిన్ అవ్వాలనే గోల్ పెట్టుకుని మూడు సంవత్సరాల నుండి ప్రయత్నాలు చేస్తూ కష్టపడుతూ ఉంటుంది. ఇటు మహి ఫోటోగ్రాఫర్ గా మంచి పేరు తెచ్చుకుంటాడు. ఇలా సాగుతున్న వీరి జీవితాలు వర్ష చిన్నప్పటి ఫోటో ద్వారా మళ్లీ కలుస్తాయి. ఆ తరువాత ఇద్దరు మధ్య చోటు చేసుకున్న సంఘటనలు ఏమిటి ? వర్ష తన గోల్ ను సాధించడానికి మహి ఎలా సాయ పడ్డాడు ? అప్పటికే వర్ష వేరే వ్యక్తితో పెళ్లికి ఒప్పుకున్నా.. మళ్లీ మహిని ఎలా ప్రేమిస్తోంది ? ఇద్దరూ తమ ప్రేమను వ్యక్తపరుచుకుంటారా ? లేదా ? అంతలో మహికి వచ్చిన సమస్య ఏమిటి ? చివరికీ వీరి ప్రేమ గెలిచిందా ? లాంటి విషయాలు తెలియాలంటే ఈ చిత్రం చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్ :

 

‘ఇద్దరి లోకం ఒకటే’ అంటూ రాజ్ తరుణ్ ఈ సారి ఫీల్ గుడ్ లవ్ స్టోరీతో మెస్మరైజ్ చేయకపోయినా కాస్త కొత్తగానే ప్రయత్నం చేశాడు.
తన లుక్స్ అండ్ యాక్టింగ్ పరంగా కూడా ఈ సినిమాలో కొత్తగా కనిపించడానికి బాగానే తాపత్రయ పడ్డాడు. ఎక్కువుగా సరదాగా తిరిగే కుర్రాడి పాత్రలతో మరియు తన ఈజ్ యాక్టింగ్ తో ఆకట్టుకునే రాజ్ తరుణ్ నుండి.. ఇలాంటి సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ రావడంతో ఫ్రెష్ గా అనిపించింది.

‌ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన షాలినీ పాండే తన నటనతో పాటు గ్లామర్ తోనూ బాగా ఆకట్టుకుంది. ప్రేమ సన్నివేశాలతో పాటు, కొన్ని భావోద్వేగ సన్నివేశాల్లో కూడా తన పెర్ఫార్మెన్స్ తో షాలినీ మెప్పించింది. హీరోయిన్ కి మదర్ గా నటించిన రోహిణి ఎప్పటిలాగే తన ఎమోషనల్ నటనతో ఆకట్టుకుంది. అలాగే మరో కీలక పాత్రలో నటించిన నాజర్, మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు. సినిమాలో మిక్కీ జె.మేయ‌ర్ అందించిన సంగీతం సినిమాకి బాగా ప్లస్ అయింది.

 

మైనస్ పాయింట్స్:

 

దర్శకుడు జి.ఆర్‌.కృష్ణ ప్యూర్ లవ్ కి సంబంధించి మంచి స్టోరీ లైన్ ను తీసుకున్నారు కానీ, ఆ లైన్ ను పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా కథాకథనాలను రాసుకోలేదు. పుట్టకతోనే ఒకరికోసం ఒకరు అనే సెన్స్ తో పుట్టిన హీరో హీరోయిన్ల మధ్య ఆ రేంజ్ ప్రేమ (ఒక్క క్లైమాక్స్ లో తప్ప) సినిమాలో ఎక్కడా కనిపించదు. అలాగే ఆ ప్రేమకు సరైన సంఘర్షణ కూడా లేదు. దీనికి తోడు ఉన్న ప్రేమ సన్నివేశాలు కూడా పూర్తిగా ఆకట్టుకునే విధంగా ఉండవు.

పైగా సినిమా పూర్తిగా స్లో స్క్రీన్ ప్లేతో బోరింగ్ ట్రీట్మెంట్ తో సాగుతుంది. ఫస్ట్ హాఫ్ లో ఒక్క ఇంటర్వెల్ సీన్ మినహా మిగతా సన్నివేశాలు అన్నీ ఆకట్టుకోవు. ఇక సెకెండాఫ్ ని కాస్త ఎమోషనల్ గా నడుపుదామని దర్శకుడు బాగానే ప్రయత్నం చేశాడు, కాకపోతే ఎక్కడా ఆ ఎమోషన్ గాని, ఆ ఫీల్ గాని ఆడియన్స్ ఫీల్ అవ్వరు.

కథనం ఇంకా ఆసక్తికరంగా నడిపే అవకాశం ఉన్నప్పటికీ.. దర్శకుడు మాత్రం తన శైలిలోనే సినిమాని మలిచారు. డైరెక్టర్ స్క్రిప్ట్ పై ఇంకా శ్రద్ద పెట్టి ఉంటే సినిమా లవ్ డ్రామాలను లైక్ చేసే వారికైనా రీచ్ అయ్యేది.

 

సాంకేతిక విభాగం :

 

సాంకేతిక విభాగం గురించి చెప్పుకుంటే.. సంగీత దర్శకుడు మిక్కీ జె మేయర్ అందించిన పాటల్లో రెండు బాగున్నాయి. ముఖ్యంగా హీరోహీరోయిన్ల మధ్య సెకండ్ హాఫ్ లో వచ్చే లవ్ సాంగ్ బాగుంది. అలాగే కొన్ని సన్నివేశాల్లో ఆయన అందించిన నేపధ్య సంగీతం కూడా ఆకట్టుకుంటుంది. తమ్మిరాజు ఎడిటింగ్ జస్ట్ ఓకే అనిపిస్తోంది. బోర్ కొట్టించే కొన్ని సన్నివేశాలను అయన తన ఎడిటింగ్ తో మ్యానెజ్ చేయలేకపోయారు. సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాలో దృశ్యాలన్నీ ఆయన చాలా అందంగా చూపించారు. దర్శకుడు జి ఆర్ కృష్ణ దర్శకత్వం పరంగా పర్వాలేదనిపించినా.. ఆకట్టుకునే విధంగా స్క్రిప్ట్ ను రాసుకోలేకపోయారు. ఇక సినిమాలోని నిర్మాత శిరీష్ పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

 

తీర్పు :

 

ఎమోషనల్ లవ్ స్టోరీతో వచ్చిన ఈ ‘ఇద్దరి లోకం ఒకటే’ ఆసక్తికరంగా సాగలేదు. అయితే హీరో హీరోయిన్ల మధ్య వచ్చే కొన్ని లవ్ సీన్స్ అండ్ ఎమోషనల్ గా సాగే ఫీల్ గుడ్ క్లైమాక్స్ పర్వాలేదనిపిస్తాయి. ఇక సినిమాలో మిగిలిన చాలా సన్నివేశాలు ఇంట్రస్టింగ్ సాగవు. స్లో స్క్రీన్ ప్లేతో బోరింగ్ ట్రీట్మెంట్ తో సినిమా బోర్ కొడుతోంది. కాకపోతే లవర్స్ కి సినిమాలోని కొన్ని అంశాలు నచ్చుతాయి. కానీ మిగిలిన అన్ని వర్గాల ప్రేక్షకులకు మాత్రం ఈ సినిమా నచ్చకపోవచ్చు.

 

123telugu.com Rating : 2.5/5

Reviewed by 123telugu Team

Click Here For English Version

సంబంధిత సమాచారం :

More