సమీక్ష : కన్నుల్లో నీ రూపమే – ఈ కథ కదిలించలేకపోయింది

సమీక్ష : కన్నుల్లో నీ రూపమే – ఈ కథ కదిలించలేకపోయింది

Published on Jun 29, 2018 3:56 PM IST
Kannullo Nee Roopame movie review

విడుదల తేదీ : జూన్ 29, 2018
123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5

నటీనటులు : నందు, తేజస్విని ప్రకాష్ పోసాని, సాయి తదితరులు

దర్శకత్వం : బిక్స్ ఇరుసడ్ల

నిర్మాత : భాస్కర్ భాసాని

సంగీతం : సాకేత్ కోమండురి

సినిమాటోగ్రఫర్ : ఎన్.బి. విశ్వకాంత్, సుభాష్ దొంతి

స్క్రీన్ ప్లే :  బిక్స్ ఇరుసడ్ల

నందు, తేజస్విని ప్రకాష్ జంటగా నటించిన చిత్రం ‘కన్నుల్లో నీ రూపమే’ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఆడియన్స్‌ను ఏ మేరకు మెప్పించిందో ఒక్కసారి సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం..

కథ :

సన్నీ (నందు) తన జీవితంలో జరిగింది వేరొకరి జీవితంలో జరగదని తన కథ గురించి చెప్తుండగా ఈ చిత్రం మొదలవుతుంది. సన్నీ తొలి చూపులోనే సృష్టి (తేజస్విని) కళ్ళను చూసి ప్రేమిస్తాడు. ఆమె కోసం వెతుకున్న క్రమంలో ఆమె తన ఫ్రెండ్ స్వాతికి కజిన్ అని తెలుస్తుంది. స్వాతి పెళ్లిలో కలుసుకున్న ఇద్దరు ఒకర్ని ఒకరు గాఢంగా ప్రేమించుకుంటారు. సృష్టి ఆన్నయ్య తమ పెళ్లికి ఒప్పుకోడని ఇద్దరు సీక్రెట్ గా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. సన్నీ ఫ్రెండ్స్ పెళ్ళికి ఏర్పాట్లు చేయగా సృష్టి, సన్ని పెళ్ళికి రెడీ అవుతున్న క్రమంలో సడెన్ గా సన్ని వారం క్రితమే చనిపోయాడనే అసలు విషయం తెలుస్తుంది.

అసలు సన్నీని చంపింది ఎవరు ? చనిపోయాక కూడా సన్నీ మాములు మనిషిలా ఎలా కనిపిస్తున్నాడు ? సన్నీ లేకుండా బతకలేని సృష్టి చివరకి ఏమైంది ? చనిపోయిన సన్నీ మళ్ళీ దేనికోసం తిరిగివచ్చాడు ? అనేదే ఈ సినిమా.

ప్లస్ పాయింట్స్:

సోలో హీరోగా నటించిన నందు గత తన సినిమాల్లో కంటే ఈ సినిమాలో కొత్త లుక్స్ తో చాలా ఫ్రెష్ గా కనిపించాడు. హీరోయిన్ కళ్ళను చూసి ప్రేమలో పడే సన్నివేశాల్లో గాని, తాను చనిపోయానని చెప్పే సన్నివేశంలో గాని ముఖ్యంగా క్లైమాక్స్ లో నందు సెటిల్డ్ గా చాలా చక్కగా నటించాడు. ఇక ఒక సున్నితమైన మనస్తత్వం ఉన్న అమ్మాయిగా తేజస్విని కూడా తన నటనతో ఆకట్టుకుంది. కథకి ప్లాట్ పాయింట్ లాంటి క్యారెక్టర్ లో కనిపించిన పోసాని తన నటనతో సినిమాని నిలబెట్టే ప్రయత్నం చేశారు.

హీరో ఫ్రెండ్స్ గా నటించిన నటులు, పెళ్ళికొడుకుగా నటించిన కమెడియన్ సాయి తమ కామెడీ టైమింగ్ తో అక్కడక్కడ నవ్వులు పూయించారు. సినిమాలో దర్శకుడు బిక్స్ ఇరుసడ్ల చెప్పాలనుకున్నా ‘మనుషులు మారతారు ప్రేమ మారదు’అనే మెయిన్ థీమ్ బాగుంది. హీరో హీరోయిన్ల తమ ప్రేమకు సంబంధిచిన ఇన్నర్ ఫీలింగ్స్ గురించి మాట్లాడుకునే సంభాషణలు ఆకట్టుకుంటాయి.

మైనస్ పాయింట్స్:

సినిమాలో మంచి స్టోరీ ఐడియా ఉంది కానీ దాన్ని ఎలివేట్ చేసే క్యారెక్టర్స్ సన్నివేశాలే దర్శకుడు రాసుకోలేదు. స్లోగా సాగే ఈ సినిమాలో పండని హాస్యంతోనే చాలా సేపు కాలక్షేపం చేసేశారు. పైగా సినిమాలో ఎక్కడా సరైన ప్లో, ఫీల్ ఉండదు. సస్పెన్స్ ను ఏమోషన్ని ఓకే ప్రేమ్ లో ఇరికించటానికి ఆసాంతం దర్శకుడు ప్రయత్నిస్తూనే ఉంటాడు. కథలో ఉన్న చిన్నపాటి సస్పెన్స్ రివీల్ అయ్యాక కథనంపై ఆసక్తి సన్నగిల్లిపోతుంది.

ఇక సినిమా ప్రధానంగా విఫలమైన ప్రేమతో సంఘర్షణ మరియు బాధ చుట్టే తిరుగుతుంది. కానీ ఒక్క సన్నివేశంలో కూడా ఆ బాధ కానీ ఆ కాన్ ఫ్లిక్ట్ గాని ఉన్నట్లు కనిపించదు. దీనికి తోడు లాజిక్ లేని స్క్రీన్ ప్లేతో ఫేక్ క్యారెక్టరైజేషన్స్ తో బోర్ కొట్టిస్తారు. మెయిన్ విలన్ అయిన హీరోయిన్ అన్నయ పాత్రను సరిగ్గా ఎలివేట్ చెయ్యకపోగా ఆ పాత్రకు క్లారిటీ, సరైన ముగింపు ఇవ్వలేదు. హీరోని చంపే విధానం కూడా సిల్లీగా ఉంటుంది. ఈ సహజత్వం లేని కథలో రొమాంటిక్ ఫీల్ తో పాటు రొమాన్స్, హార్రర్ ను మిక్స్ చేసినా ఏ ఒక్క అంశమూ వర్కౌట్ అవ్వలేదు. కథలో అనేక మలుపులు ఉంటాయి గాని దేనికి సరైన కారణం ఉండదు.

సాంకేతిక విభాగం :

దర్శకుడు బిక్స్ ఇరుసడ్ల స్క్రిప్ట్ ని సరిగ్గా స్క్రీన్ మీద ఎగ్జిక్యూట్ చేయలేకపోయినా టెక్నీషియన్స్ దగ్గర నుంచి కొంతవరకు మంచి అవుట్ ఫుట్ రాబట్టుకోగలిగారు. ముఖ్యంగా సంగీత దర్శకుడు సాకేత్ కోమండుర అందించిన పాటలు వినసొంపుగా బాగున్నాయి. సాకేత్ అందించిన నేపధ్య సంగీతం కూడా స్లోగా నడుస్తున్న సినిమాకు కొంత ఉత్సాహం తీసుకొచ్చింది. ఆట సందీప్ చేసిన చెలీ సాంగ్ కొరియోగ్రఫీ సినిమాకే హైలెట్ గా నిలుస్తోంది.

కెమెరా బాధ్యతలను పంచుకున్న ఎన్.బి.విశ్వకాంత్, సుభాష్ దొంతి తమ కెమెరాతో మ్యాజిక్ చేయకపోయినా పర్వాలేదనిపించారు. ఎడిటర్ తన కత్తెరకి ఇంకొంచెం పనిచెప్పి ఉంటే బాగుండేది. చిన్నసినిమానైనా నిర్మాత భాస్కర్ భాసాని పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

తీర్పు:

ఈ వారం విడుదలవుతున్న చిత్రాలతో పోటీ పడుతూ విడుదలైన ఈ చిత్రం పోటీలో ఏమాత్రం నిలబడే స్థాయిలో లేదు. కొన్ని ఎమోషనల్ సీన్స్, ప్రధాన పాత్రల పెర్ఫార్మెన్స్ ఈ చిత్రంలో మెప్పించే అంశాలు కాగా నవ్వు రాని కామెడీ, విసిగించే సీన్లు, ఆకట్టుకోలేకపోయిన కథనం, కనీస స్థాయిలో కూడ లేని దర్శకత్వం, ఇంప్రెస్ చేయలేకపోయిన ట్విస్టులు వంటి బలహీనతలు ప్రేక్షకుడ్ని ఇబ్బందిపెట్టేలా సినిమాను తయారుచేశాయి. ఒక్క మాటలో చెప్పాలంటే పెద్దగా కదిలించలేకపోయిన ఈ సినిమా వైపు చూడకపోవడమే మంచిది.

123telugu.com Rating : 2/5

Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు