సమీక్ష : కోనసీమ థగ్స్ – పర్వాలేదనిపించే క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ !

సమీక్ష : కోనసీమ థగ్స్ – పర్వాలేదనిపించే క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ !

Published on Feb 25, 2023 3:04 AM IST
Konaseema Thugs Movie Review In Telugu

విడుదల తేదీ : ఫిబ్రవరి 24, 2023

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5

నటీనటులు: హృదు హరూన్, బాబీ సింహా, ఆర్కే సురేష్, మునిష్కాంత్, అనశ్వర రాజన్, శరత్ అప్పాని, పిఎల్ తేనప్పన్

దర్శకుడు : బృంద

నిర్మాతలు: రియా శిబు, ముంతాస్ ఎం

సంగీత దర్శకులు: సామ్ సిఎస్

సినిమాటోగ్రఫీ: ప్రియేష్ గురుసామి

ఎడిటర్: ప్రవీణ్ ఆంటోని

సంబంధిత లింక్స్: ట్రైలర్

 

బృంద దర్శకత్వంలో హృధు హరూన్ – బాబీ సింహా ప్రధాన పాత్రలలో వచ్చిన చిత్రం “కోనసీమ థగ్స్”. కాగా ఈ చిత్రం ఈ రోజే విడుదల అయింది. మరి ప్రేక్షకులును ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

 

కథ :

శేషు(హృదు హరూన్) ఒక అనాధ. అతను హత్య కేసులో నిందితుడు. జైలుకి వచ్చిన అతనికి రకరకాల మనుషులు పరిచయం అవుతారు, ఈ క్రమంలో కాకినాడ మార్కెట్ కి సంబంధించిన దొర (బాబీ సింహా)తో పరిచయం ఏర్పడుతుంది. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో శేషు – దొర కలిసి.. జైలులో మరికొందర్ని కలుపుకుని, ఆ జైలు నుంచి తప్పించుకోవడానికి ఒక ముఠాగా ఏర్పడతారు. ఇంతకీ వీరంతా జైలు నుంచి తప్పించుకోగలిగారా ?, లేదా ?, ఈ మధ్యలో తప్పించుకోవడానికి వీళ్లు ఎలాంటి ప్రయత్నాలు చేశారు ?, అసలు శేషు హత్య కేసులో ఎలా ఇరుక్కున్నాడు ?, అతని బ్యాక్‌స్టోరీ ఏమిటి ?, చివరకు తప్పించుకుని ఎక్కడికి వెళ్ళారు ? అనేది మిగిలిన కథ.

 

ప్లస్ పాయింట్స్ :

శేషు – దొర అనే ఇద్దరు మంచి వాళ్ళు, తమ వారి కోసం అనుకోకుండా నేరాలు చేసి.. జైలుకు వచ్చి ఎలా మదన పడ్డారు ?, ఈ క్రమంలో వారిలో వారు ఎలా సంఘర్షణకు లోను అయ్యారు ? అనే కోణంలో సాగిన ఈ చిత్రం బాగానే ఉంది. ఈ చిత్రంలోని కొన్ని సీన్స్ ప్రేక్షకుల మనసును కదిలిస్తోంది. అలాగే, పోలీసుల్లో కొంతమంది పోలీసులు ప్రవర్తన, పైఅధికారుల ఒత్తిడికితో వాళ్ళు అమాయకులను ఎలా టార్చర్ పెడతారనే అంశాలు కళ్ళకు కట్టినట్లు చూపించారు.

ఇక సినిమాలో నటించిన నటులు కూడా చాలా సహజమైన నటనతో.. చాలా బాగా నటించారు. వాస్తవిక కథతో పాటు పాత్రల చిత్రీకరణ కూడా చాలా వాస్తవంగా సాగడంతో సినిమా పై ఆసక్తి పెరుగుతుంది. ఆవేశంలో చేసిన తప్పు కారణంగా.. ఖైదీలు పోలీసుల చేతిలో ఎలా హింసించ బడతారో కూడా చాలా బాగా ఎలివెట్ చేశారు. కొన్ని సన్నివేశాలు చాలా ఎమోషనల్ గా సాగుతూ ఆకట్టుకుంటాయి.

ఇక కీలక పాత్రల్లో నటించిన హృదు హరూన్, బాబీ సింహా, ఆర్కే సురేష్, మునిష్కాంత్, అనశ్వర రాజన్, శరత్ అప్పాని తమ పాత్రల్లో ఒదిగిపోయారు. హృదు హరూన్ ఎమోషనల్ పాత్రలో సముద్రఖని అద్భుతంగా నటించారు. బాబీ సింహా కూడా చాలా వైవిధ్యంగా నటించి మెప్పించాడు. అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు.

 

మైనస్ పాయింట్స్ :

మనసును కదిలించే కొన్ని ఎమోషనల్ సన్నివేశాలతో ఈ సినిమా ఆకట్టుకున్నప్పటికీ.. కమర్షియల్ అంశాలు పెద్దగా లేకపోవడంతో స్క్రీన్ ప్లే చాలా స్లో గా సాగుతున్న ఫీలింగ్ కలుగుతుంది. ముఖ్యంగా దర్శకురాలు బృంద కథనాన్ని పూర్తి ఆసక్తికరంగా మలచలేకపోయారు. కొన్ని కీలకమైన సన్నివేశాలు పర్వాలేదనిపించిన్నప్పటికీ.. మిగిలిన సన్నివేశాలను స్లోగా నడిపారు.

సినిమా చూస్తున్నంతసేపు తర్వాత ఏం జరుగుతుంది, ప్రధాన పాత్రలు ఎలాంటి కష్టాల్లో పడతాయో?, అసలు వాళ్ళు పోలీసులు నుండి ఎలా తప్పించుకుంటారో ? అనే ఉత్కంఠ ప్రేక్షకుల్లో ఇంకా పెంచే అవకాశం ఉన్నప్పటికీ దర్శకురాలు మాత్రం, ఆ దిశగా సినిమాని నడపలేదు. ఇక సినిమా ఫస్టాఫ్ కథనం కూడా సాదా సీదాగానే గడిచిపోగా సెకెండ్ హాఫ్ కథనం కొన్ని చోట్ల, మరింత నెమ్మదిగా సాగుతుంది.

 

సాంకేతిక విభాగం :

మంచి కథాంశం తీసుకోవడంలో సక్సెస్ అయిన దర్శకురాలు బృంద ఉత్కంఠభరితమైన కథనాన్ని రాసుకోవడంలో మాత్రం కాస్త వెనుకబడ్డారు. కానీ ఆమె రూపొందించిన సన్నివేశాలు మాత్రం కొన్ని బాగా ఆకట్టుకున్నాయి. సంగీత దర్శకుడు సామ్ సిఎస్ సంగీతం బాగుంది. ప్రియేష్ గురుసామి సినిమాటోగ్రఫీ వర్క్ సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఇక దర్శకురాలు ఆలోచనను నమ్మి ఇలాంటి వైవిధ్యమైన చిత్రాన్ని ప్రేక్షకులకు అందించింనందుకు నిర్మాతలు రియా శిబు, ముంతాస్ ఎం లను అభినందించాలి.

 

తీర్పు:

కోనసీమ థగ్స్ అంటూ వచ్చిన ఈ ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ లో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, కొన్ని ఎమోషనల్ సీన్స్ మరియు యాక్షన్ సీక్వెన్సెన్స్ ఆకట్టుకున్నాయి. ఐతే, సినిమాలో కథనం మాత్రం పూర్తి స్థాయిలో ఆసక్తికరంగా సాగలేదు. స్లో నేరేషన్, కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ కావడం, కొన్ని రెగ్యులర్ సీన్స్ వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి. అయితే సినమాలో చెప్పాలనుకున్న మెయిన్ కంటెంట్ మరియు కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు హృదయానికి హత్తుకుపోతాయి. మొత్తమ్మీద ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించలేకపోయినా.. క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ లను ఇష్టబడే వారికి నచ్చుతుంది.

123telugu.com Rating: 3/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు