ఓటీటీ సమీక్ష: కురుతి – మలయాళం మూవీ అమెజాన్ ప్రైమ్ లో ప్రసారం

Super-Deluxe review

విడుదల తేదీ : ఆగస్టు 11, 2021
123తెలుగు.కామ్ రేటింగ్ :  3/5

నటీనటులు : పృథ్వీరాజ్ సుకుమారన్, రోషన్ మ్యాథ్యూ, మాముక్కోయ

దర్శకులు: మను వారియర్

నిర్మాతలు : సుప్రియ మీనన్

సంగీతం : జేక్స్ బెజొయ్

ప్రస్తుతం మేము కొనసాగిస్తున్న పలు వెబ్ సిరీస్‌లు మరియు డైరెక్ట్ డిజిటల్ సినిమాల రిలీజ్ రివ్యూల పరంపరలో తాజాగా మేము ఎంచుకున్న చిత్రం “కురుతి”. ప్రస్తుతం ఈ మలయాళ చిత్రం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది.. మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం రండి.

 

కథ:

 

లైక్ (పృథ్వీరాజ్) తన తండ్రిని చంపిన వ్యక్తిని చంపేసి పరారీలోకి వెళతాడు. లైక్ ఇబ్రూ (రోషన్ మాథ్యూ), అతని తండ్రి (మాముక్కోయ), సోదరుడు (నస్లెన్) మరియు పొరుగు (శ్రీంధ)ను ఎదుర్కొన్నప్పుడు విషయాలు తీవ్రంగా మారతాయి. మరి వీరు ఎవరు? కథకు వారి సంబంధం ఏమిటి మరియు లైక్ వాటిని ఎలా హ్యాండిల్ చేస్తాడు అనేది సినిమా కథ.

 

ప్లస్ పాయింట్స్:

 

కురుతిలో పృథ్వీరాజ్ తన నటనలో కొత్త కోణాన్ని ప్రదర్శించడం, అతను తన పాత్రలో ఇమిడిపోయిన విధానం చాలా బాగుంది. ఖచ్చితంగా ఈ చిత్రంలో పృథ్వీరాజ్ నటన మిమ్మల్ని బాగా ఆకట్టుకుంటుంది.

ఇక ఈ చిత్రానికి మరో ప్రధాన ఆస్తి రోషన్ మాథ్యూ అని చెప్పాలి. యువ నటుడు తన జీవితంలో గందరగోళాన్ని ఎదుర్కొంటున్న వ్యక్తిగా అద్భుతంగా కనిపించాడు. తన జీవితాన్ని, అతని చుట్టూ ఉన్న వ్యక్తులను మరియు అతని మత విశ్వాసాలను ప్రదర్శించిన తీరు బాగుంది.

మతపరమైన అంశాలను తీసుకోకుండా మేకర్స్ దేశంలోని మతపరమైన సమస్యల గురించి అనేక సమకాలీన సమస్యలను పరిష్కరించేలా కథను రూపొందించారు. సైకలాజికల్ థ్రిల్లర్ వంటి మంచి అంశాలు కలిగి ఉన్నందున రచన బాగుంది. మాముక్కోయ కూడా ఈ సినిమాలో చాలా మంచి పాత్రను పోషించాడు.

 

మైనస్ పాయింట్స్:

 

ఈ చిత్రంలో ప్రదర్శించబడిన మతపరమైన సమస్యలు బాగానే ఉన్నప్పటికీ అవి అనేక ప్రాంతాల్లో కథపై ఆధిపత్యం చెలాయించేలా అనిపించాయి. ఈ కారణంగానే కొన్ని సన్నివేశాలలో ప్రధాన కథ పక్కదారి పట్టినట్టు అనిపించింది.

సినిమా అసలు కథలోకి రావడానికి కొంత సమయం పట్టినా కూడా కొద్దిసేపటి తర్వాత కథ ఏమిటనంది అర్ధమవుతుంది. సైకలాజికల్ థ్రిల్స్‌కు సంబంధించి కొన్ని లాజిక్స్ బాగున్నాయి. ఇందులో పొలిటికల్ యాంగిల్‌ని కారణం లేకుండానే హెవీగా చూపించారు.

 

సాంకేతిక విభాగం:

 

అన్ని మలయాళ చిత్రాల మాదిరిగానే ఈ సినిమాకు కూడా కెమెరా వర్క్ అద్భుతంగా ఉంది. సినిమాలో డార్క్ థీమ్ ఎలివేట్ చేసిన తీరు బాగుంది. డైలాగ్‌లు ఆకట్టుకుంటాయి మరియు చాలా వరకు స్క్రీన్ ప్లే బాగా హ్యాండిల్ చేయబడింది. సంగీతం కూడా ఓకే అనిపించింది.

ఇక దర్శకుడు మను వారియర్ విషయానికి వస్తే, అతను ఒక మంచి థ్రిల్లర్‌ను రాసుకుని దానిని వివరించిన తీరు ఆకట్టుకుంది కానీ సినిమాను పక్కదారి పట్టించే అనవసరమైన అంశాలను కాస్త తగ్గించి ఉంటే బాగుండేది అనిపించింది.

 

తీర్పు:

 

ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే సైకలాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ‘కురుతి’ చాలా మంచి నేపథ్యాన్ని కలిగి ఉంది. పృథ్వీరాజ్ మరియు రోషన్ మాథ్యూ తమ అద్భుతమైన ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. అయితే మతం మరియు రాజకీయాల అంశాల ద్వారా కథ కాస్త ఒకింత గాడి తప్పింది. ఈ అంశాన్ని కనుక పక్కనబెడితే, మంచి ఆకర్షణీయమైన డ్రామాను కలిగి ఉన్న ఈ సినిమా ఈ వారం మీకు మంచి వీక్షణగా నిలుస్తుందని చెప్పాలి.

123telugu.com Rating : 3/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం :