సమీక్ష : లచ్చిందేవికి ఓ లెక్కుంది – లెక్క తప్పిన లచ్చిందేవి!

Kalavathi review

విడుదల తేదీ : 29 జనవరి 2016

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

దర్శకత్వం : జగదీశ్ తలసిల

నిర్మాత : సాయి ప్రసాద్ కామినేని

సంగీతం : ఎం.ఎం కీరవాణి

నటీనటులు : నవీన్ చంద్ర, లావణ్య త్రిపాటి, అజయ్..

‘అందాల రాక్షసి’ సినిమాతో మంచి పెయిర్ అనిపించుకున్న నవీన్ చంద్ర – లావణ్య తిపాటి జంటగా నటించిన సినిమా ‘లచ్చిందేవికి ఓ లెక్కుంది’. ఎస్ఎస్ రాజమౌళి దగ్గర అసిస్టెంట్ గా పని చేసిన జగదీశ్ తలసిల దర్శకుడిగా పరిచయం అవుతూ సాయి ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వరుసగా రెండు సూపర్ హిట్స్ తో జోరు మీదున్న లావణ్య త్రిపాటి మూడవ హిట్ అందుకుందా లేదా, జగదీశ్ డైరెక్టర్ గా తొలి హిట్ అందుకున్నాడా లేదా అనేది ఇప్పుడు చూద్దాం..

కథ :

మన హీరో నవీన్(నవీన్ చంద్ర) జనత బ్యాంకులో హెల్ప్ డెస్క్ లో పనిచేస్తుంటాడు, అదే బ్యాంకులో క్యాషియర్ గా పనిచేస్తూ ఉంటుంది మన హీరోయిన్ దేవి(లావణ్య త్రిపాటి). మొదట్లో వీరిద్దరికీ ఆసలు పడదు. కానీ నవీన్ కి ఓ సారి డబ్బు అవసరం పడుతుంది. దాంతో ఏం చేయాలా అని ఆలోచిస్తున్న టైంలో అజయ్(మహేష్) అండ్ టీం వచ్చి వారి బ్యాంకు లో ఉన్న అన్ క్లైమ్డ్ అకౌంట్స్ ఫైల్ తెస్తే, దాని ద్వారా వచ్చే అమౌంట్ లో తనకు వాటా ఇస్తామని చెప్తారు. దాంతో నవీన్ లావణ్యతో క్లోజ్ అవుతాడు.

అలా క్లోజ్ అయ్యి బ్యాంకు నుంచి అన్ క్లైమ్డ్ అకౌంట్స్ ఫైల్ ని కొట్టేస్తాడు. అంతా అనుకున్న దాని ప్రకారమే ఆ అకౌంట్స్ ని బేస్ చేసుకొని డబ్బు కొట్టేయాలని చూస్తూ చిక్కుల్లో పడతాడు మహేష్ అండ్ నవీన్. అసలు ఈ అన్ క్లైమ్డ్ అకౌంట్స్ ఏంటి? వాటి ద్వారా మనీ ఎలా వస్తుంది? నవీన్ డబ్బు కోసం చేసిన ఈ పని వల్ల తను ఎదుర్కున్న ఇబ్బందులేమిటి? వాటి నుంచి ఎలా బయట పడ్డాడు? దేవి ఏమన్నా హెల్ప్ చేసిందా? లేదా అన్నదే ఈ సినిమా కథ.

ప్లస్ పాయింట్స్ :

లచ్చిందేవికీ ఓ లెక్కుంది సినిమాకి ఎంచుకున్న అనాధ డబ్బు అలియాస్ అన్ క్లైమ్డ్ అకౌంట్స్ నుంచి డబ్బు కొట్టేసే కాన్సెప్ట్ సినిమాకి మెయిన్ హైలైట్. ఈ పాయింట్ చాలా కొత్తగా ఉండడం వలన ఆడియన్స్ మొదట్లో థ్రిల్ ఫీలవుతారు. అందుకే ఈ సినిమా ప్రారంభం బాగా అనిపిస్తుంది. ఇక అజయ్ టీం డబ్బు కొట్టేయడానికి ప్లాన్ చేసే ప్రీ ఇంటర్వల్ బ్లాక్ అండ్ ఇంటర్వెల్ బ్లాక్ చాలా బాగుంది. ఈ బ్లాక్ సెకండాఫ్ పై ఆసక్తిని పెంచింది.

అలాగే ఫస్ట్ హాఫ్ లో నవీన్ చంద్ర – లావణ్య త్రిపాటిల కాంబినేషన్ చూడటానికి బాగుంది, ముఖ్యంగా క్రేజీ పాటలో వీరిద్దరి ట్రాక్ బాగుంది. అలాగే సినిమా అమోదట్లో వీరిద్దరి మధ్యా వచ్చే కొన్ని సీన్స్ బాగుంటాయి. ఇక వారికి ఇచ్చిన పాత్రల్లో నవీన్ చంద్ర, లావణ్య లు పరవాలేధనిపించారు. అజయ్ చేసిన పాత్ర డీసెంట్ గా ఉంటుంది. ఓవరాల్ గా సినిమా రన్ టైం 110 నిమిషాలే కావడం సినిమాకి ప్లస్ అనే చెప్పాలి.

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమాకి మైనస్ పాయింట్స్ చాలా ఉన్నాయి. వరుసగా ఒక్కో దాని గురించి వీలైనన్ని చెబుతా.. మొదటగా స్టొరీ లైన్ బాగుంది, కానీ దానిని డెవలప్ చేసుకున్న విధానం వీలైనంత బాడ్ గా రాసుకున్నారు. ఎందుకంటే స్టొరీ లైన్ కి చాలా పవర్ ఉన్నా కథలో రాసుకున్న ఒక్క పాత్రని కూడా సరిగా రాసుకోలేదు. ఎక్కడా ఏ పాత్ర ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వదు, కనెక్ట్ చేసే ప్రయత్నం కూడా చేయలేదు. కనీసం కథలో పాత్రలను కూడా స్ట్రాంగ్ గా రాసుకోలేదు. కథ అనేది ఈ సినిమాకి బిగ్గెస్ట్ మైనస్. ఇక ఆ కథకి రాసుకున్న కథనం అస్సలు బాలేదు. పెద్ద థ్రిల్లింగ్ అనిపించే ఎపిసోడ్స్ కూడా ఏమీ లేవు. మరీ క్లైమాక్స్ ని అయితే కిచిడీలా చేసి హడావిడిగా క్లైమాక్స్ ని ముగిస్తారు. అయిపోయిందా అనే షాక్ ని కలిగించేలా అసంపూర్తిగా ముగించడం మైనస్.

ఇకపోతే నేరేషన్ అనేది చాలా చాలా స్లోగా ఉంటుంది. అసలే సినిమా స్లోగా సాగుతోంది అంటే.. సినిమా లో పాటలు వచ్చి వచ్చి ఉన్న ఫీల్ ని ఇంకా దెబ్బ తీస్తాయి. పాటలు అనేవి సినిమాకి హెల్ప్ కాలేదు. ఇకపోతే పాత్రలలో స్ట్రాంగ్ గా లేకపోవడం వలన నటీనటుల నుంచి మనకు బెస్ట్ పెర్ఫార్మన్స్ తెరపై కనపడదు. అలాగే జయప్రకాశ్ రెడ్డి పాత్ర నుంచి కామెడీని రాబట్టుకోవాలని తెగ ట్రై చేసారు. కానీ ఏ మాత్రం వర్కౌట్ అవ్వలేదు. అదీకాక సెకండాఫ్ లో జయప్రకాశ్ – లావణ్య సీన్స్ చాలా డ్రాగ్ అవుతాయి. సెకండాఫ్ ఆడియన్స్ సహనానికి పెద్ద పరీక్ష అనే చెప్పాలి. స్టొరీ లైన్ ప్రకారం సినిమాలో సస్పెన్స్, థ్రిల్స్ కి చాలా ఆస్కారం ఉంది కానీ ఒక్క థ్రిల్ కూడా కనిపించలేదు. ఓవరాల్ గా జగదీశ్ రచన – దర్శకత్వంలోనే మిస్టేక్స్ జరిగాయి.

సాంకేతిక విభాగం :

ఈ సినిమాకి టెక్నికల్ టీం లో హెల్ప్ అయిన బెస్ట్ పాయింట్స్ రెండు.. అందులో మొదటిది ఈశ్వర్ అందించిన సినిమాటోగ్రఫీ. సినిమాలో లిమిటెడ్ లొకేషన్స్ లోనే తీసినా ఈశ్వర్ మాత్రం తనకిచ్చిన లొకేషన్స్ ని చాలా బాగా చూపించాడు. ఇక ఎంఎం కీరవాణి ఈ విజువల్స్ కి మంచి నేపధ్య సగీతం ఇచ్చాడు. పాటలు పరవాలేదనిపించినా సినిమాకి మాత్రం అడ్డంగా మారాయి. కోటగిరి వెంకటేశ్వరా రావు వీలైనంత తగ్గించి సినిమాని ఎడిట్ చేసినా ఆయన ఎడిటింగ్ అస్సలు హెల్ప్ అవ్వలేదు.

ఇక కథ – కథనం – దర్శకత్వం విభాగాలను కొత్త డైరెక్టర్ అయిన జగదీశ్ డీల్ చేసాడు. కొత్త డైరెక్టర్ కావడం వలన చాలా విషయాలలో సరైన అవగాహన లేక తప్పు చేసాడు. చెప్పాలంటే ఒక్క సీన్ కూడా పర్ఫెక్ట్ గా ఉన్న ఫీలింగ్ ని మీకు కలిగించదు. ఈయన కూడా కంటెంట్ ని వదిలేసి రకరకాల సందర్భాలలో కామెడీని పెట్టి సినిమాని లాగేయాలని చూసాడు కానీ ఎక్కడా నవ్వించ లేకపోయాడు. జగదీశ్ ఈ సినిమాకి ఇచ్చిన బెస్ట్ విషయం ఎంచుకున్న స్టొరీ లైన్, మిగతా అన్నింటిలో ఫెయిల్ అయ్యాడు. దాంతో మొదటి సినిమాతో ఫెయిల్యూర్ ని అందుకున్నాడు. సాయి ప్రసాద్ నిర్మాణ విలువలు పరవాలేదనిపిస్తాయి.

తీర్పు :

ఎస్ఎస్ రాజమౌళి అసిస్టెంట్ జగదీశ్ డైరెక్షన్ లో అందాల రాక్షసి పెయిర్ నవీన్ చంద్ర – లావణ్య త్రిపాటి మరోసారి జంటగా నటించిన ‘లచ్చిందేవికి ఓ లెక్కుంది’ అనే సినిమా ప్రేక్షకులను మెప్పించడంలో లెక్క తప్పింది. జగదీశ్ థ్రిల్లర్ కామెడీ ఫార్మాట్ లో ఓ సినిమా అనుకొని దానికి ఓ మంచి స్టొరీ లైన్ కూడా అనుకున్నాడు. కానీ దానిని దేలవాల్ చేస్కోవడంలో, ఆసక్తికరంగా చెప్పలేకపోవడంలో ఈ సినిమా లెక్క తప్పింది. ఒరిజినల్ స్టొరీ లైన్, షార్ట్ రన్ టైం, పరవాలేదనిపించే లీడ్ పెయిర్ పెర్ఫార్మన్స్ సినిమాకి పరవాలేదనిపించే పాయింట్స్ అయితే, కథా విస్తరణ, కథనం, నేరేషన్, డైరెక్షన్ మరియు ఎంటర్టైన్మెంట్ అనేది లేకపోవడం ఈ సినిమాకి బిగ్గెస్ట్ మైనస్ పాయింట్స్. ఓవరాల్ గా లెక్కలన్ని చూపి ప్రేక్షకులను మెప్పించలేకపోయిన సినిమానే ‘లచ్చిందేవికి ఓ లెక్కుంది’.

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5
123తెలుగు టీం

CLICK HERE FOR ENGLISH REVIEW

సంబంధిత సమాచారం :