హిందీ రివ్యూ : లక్ష్మీ – అక్షయ్ ఫ్యాన్స్ కు మాత్రమే !

హిందీ రివ్యూ : లక్ష్మీ – అక్షయ్ ఫ్యాన్స్ కు మాత్రమే !

Published on Nov 10, 2020 1:04 PM IST
Laxmii Hindhi Movie Review

విడుదల తేదీ : నవంబర్ 9th,2020

123telugu.com Rating : 2.5/5

నటీనటులు : అక్షయ్ కుమార్, కియారా అద్వానీ

దర్శకుడు : రాఘవ లారెన్స్

నిర్మాతలు : ఫాక్స్ స్టార్ స్టూడియోస్

సంగీతం : అమర్ మొహిలే

నిర్మాతలు : వెట్రీ పళనిసామి, కుష్ చాబ్రియా

 

 

రాఘవ లారెన్స్ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, కియరా అద్వానీ జంటగా నటించిన చిత్రం ‘లక్ష్మీ’. తెలుగు, త‌మిళ‌ భాషల్లో బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిలిచిన `కాంచ‌న`కు ఇది హిందీ రీమేక్. కాగా ఈ చిత్రం డిస్నీ హాట్ స్టార్ లో తాజాగా విడుదల అయింది. మరి సినిమా ఎలా ఉందో రివ్యూలోకి వెళ్లి తెలుసుకుందాం.

 

కథ

రష్మి (కియారా అద్వానీ) హిందూ అమ్మాయిని ముస్లిం అయిన ఆసిఫ్ (అక్షయ్ కుమార్) ను వివాహం చేసుకుంటాడు. ఇది రష్మి తల్లిదండ్రులతో నచ్చదు. దాంతో వారికి ఈ జంట దూరంగా ఉండాల్సి వస్తోంది. కానీ, కొంతకాలం తర్వాత, అసిఫ్ రష్మీ ఏదో ఒకవిధంగా క్షమాపణ కోరడానికి రష్మీ తల్లిదండ్రుల ఇంటికి వస్తారు. ఇంతలో, రష్మి ఇంటి పక్కన ఉన్న ఖాళీ మైదానం భయం కలిగించే ఉంది, ఆసిఫ్ ఆ మైదానంలో క్రికెట్ ఆడతాడు. అక్కడ నుండి యు-టర్న్ కథ తీసుకుంటుంది. ఓ ఆత్మ ఆసిఫ్ శరీరంలోకి లక్ష్మిగా ప్రవేశిస్తుంది. అసలు ఈ లక్ష్మి ఎవరు? ఆమె ఆసిఫ్ శరీరంలోకి ఎందుకు ప్రవేశించింది? అసలు లక్ష్మీ వెనుక ఉన్న కథ ఏమిటి? లాంటి విషయాలు తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్ :

అక్షయ్ కుమార్ తన కెరీర్లోనే పీక్ లో ఉన్నాడు, ఇక ఎప్పటిలాగే తను ఏ పాత్రను అయినా సులభంగా నటించగలడు అని ఈ సినిమాతో మళ్లీ నిరూపించాడు. ఈ చిత్రంలో కూడా లక్ష్మి పాత్రలో సూపర్బ్ గా కనిపించాడు. మొదటి భాగంలో, అతను స్త్రీలా ప్రవర్తించిన విధానం, మరియు రెండవ భాగంలో అతను శక్తివంతమైన లక్ష్మీగా మారినప్పుడు వచ్చే సీన్స్ చాలా బాగున్నాయి. అలాగే ఆత్మ పాత్రలో అక్షయ్ హావభావాలు ఆమోదయోగ్యమైనవిగా అనిపిస్తాయి.

శరద్ కేల్కర్ ఈ చిత్రం యొక్క ఆశ్చర్యకరమైన ప్యాకేజీ అనుకోవాలి పైగా అతను తన ఫ్లాష్ బ్యాక్ మోడ్లో లక్ష్మిగా కూడా అద్భుతంగా నటించాడు. అతనికి తక్కువ స్క్రీన్ సమయం ఉన్నప్పటికీ, శరద్ తన స్త్రీ వ్యక్తీకరణలతో తన పాత్రని బాగా రక్తికటించాడు.

ఇక ఈ సినిమాలో కియారా అద్వానీ చాలా క్యూట్ గా కనిపిస్తోంది. అంతకు మించి ఆమె పాత్రలో ఇంకేమీ లేదు. చివరి పది నిమిషాలు మరియు శక్తివంతమైన క్లైమాక్స్ ప్రదర్శించిన విధానం బాగుంది. మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారు.

 

మైనస్ పాయింట్స్ :

దర్శకుడు రాఘవ లారెన్స్ తెరకెక్కించిన కొన్ని హర్రర్ అండ్ కామెడీ సన్నివేశాలతో ఆకట్టుకున్నప్పటికీ.. కథనంలో కొన్ని సీక్వెన్స్ లో ప్లో మిస్ అయింది. బేసిక్ గా అక్షయ్ సినిమాల్లో మంచి కామెడీ ఉంటుంది. కానీ ఈ సినిమాలో కామెడీ కూడా సరిగ్గా వర్కౌట్ అవ్వలేదు. సినిమాలో ఏ సీన్ కి ఆ సీన్ బాగుందినిపించినా, ఓవరాల్ గా బోర్ గానే సాగుతాయి.

ఒరిజినల్ వర్షెన్ లో కొన్ని మార్పులు చేసి.. లారెన్స్ ఈ సినిమా చేసినా హిందీ ప్రేక్షకులను మాత్రం మెప్పించలేకపోయాడు. కథనం మరియు నేరేషన్ లో ఇంతకు ముందు వచ్చిన కాంచన 1, 2 పార్ట్స్ లో డీసెంట్ కామెడీ కూడా ఈ సినిమాలో మిస్ అయింది. దాంతో కొన్ని సీన్స్ ఇంతకు ముందు చూసినవే కదా అన్న ఫీలింగ్ కలుగుతుంది. పైగా కొన్ని కామెడీ సీన్స్ కోసమని సినిమా లెంగ్త్ ని పెంచేయడం సినిమాకి మరో మైనస్ పాయింట్.

 

సాంకేతిక విభాగం :

సాంకేతిక విభాగం గురించి మాట్లాడుకుంటే.. అందులో మొదటగా చెప్పుకోవాల్సింది దర్శకుడు రాఘవ లారెన్స్ దర్శకత్వ పనితనం గురించే.. కొన్ని విసిగించే సీన్స్ విషయంలో అలాగే కామెడీ విషయంలో లారెన్స్ జాగ్రత్తలు తీసుకుని ఉండి ఉంటే బాగుండేది. ఇక సినిమాటోగ్రఫీ ఈ హర్రర్ కామెడీ సినిమాకి బాగా సెట్ అయ్యింది. అలాగే సినిమాలో చేసిన గ్రాఫిక్స్ కూడా బాగానే ఉన్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. ఎడిటింగ్ ఫస్ట్ హాఫ్ పరంగా కొంచెం స్లోగా సాగిన, సెకెండ్ హాఫ్ ను కట్ చేసిన విధానం బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

 

తీర్పు :

రాఘవ లారెన్స్ దర్శకత్వంలో అక్షయ్ కుమార్, కియారా ముఖ్య పాత్రల్లో వచ్చిన ఈ లక్ష్మి.. ఒక ఓవర్ హర్రర్-కామెడీ మూవీ. కానీ సినిమాలో హర్రర్ నీరసంగా ఉండటం, కామెడీ మొదటి భాగంలో పెద్దగా క్లిక్ అవ్వకపోవడం, ఆలాగే ఫ్లాష్‌బ్యాక్ ప్రారంభమైన తర్వాత గాని కథ ముందుకు సాగకపోవడం వంటి విషయాలు సినిమా ఫలితాన్ని దెబ్బ తీశాయి. దీనికి తోడు సినిమాలో మెయిన్ భావోద్వేగాలు సరిగ్గా ఎలివేట్ కాలేదు. పైగా ఒరిజినల్ వెర్షన్ చూసిన వారికి ఇది అస్సలు నచ్చదు. కాకపోతే అక్షయ్ కుమార్ అద్భుతమైన నటన మాత్రం ప్రేక్షకులకు ఓదార్పునిస్తుంది. ఓవరాల్ గా ఈ చిత్రాన్ని కేవలం అక్షయ్ కోసం మాత్రమే చూడొచ్చు. అంతకుమించి సినిమాలో ఏమిలేదు.

123telugu.com Rating : 2.5/5
Reviewed by 123telugu Team

సంబంధిత సమాచారం

తాజా వార్తలు