ఓటిటి రివ్యూ : “లూసర్ సీజన్ 2” – తెలుగు సిరీస్ జీ5 లో ప్రసారం

ఓటిటి రివ్యూ : “లూసర్ సీజన్ 2” – తెలుగు సిరీస్ జీ5 లో ప్రసారం

Published on Jan 22, 2022 2:01 AM IST

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5

నటీనటులు: ప్రియ‌ద‌ర్శి, ధ‌న్యా బాలకృష్ణ‌న్‌, క‌ల్పికా గణేష్, షాయాజీ షిండే, శ‌శాంక్‌, హ‌ర్షిత్ రెడ్డి, సూర్య‌, పావ‌నీ గంగిరెడ్డి, స‌త్య కృష్ణ‌న్ శ్రీ‌ను, టిప్పు, తదితరులు

దర్శకుడు: అభిలాష్ రెడ్డి క‌న‌కాల‌, శ్రవ‌ణ్ మాదాల‌

నిర్మాత‌లు: సుప్రియ యార్ల‌గ‌డ్డ‌, అన్న‌పూర్ణ స్టూడియోస్‌

సంగీత దర్శకుడు: సాయి శ్రీ‌రామ్ మ‌ద్దూరి

సినిమాటోగ్రఫీ: న‌రేష్ రామ‌దురై

ఎడిటర్: అనిల్ కుమార్ పి

మన తెలుగు నుంచి ఓటిటి లో వచ్చిన ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ లలో “లూసర్ సీజన్ 1” కూడా ఒకటి. ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ జీ 5 లో స్ట్రీమింగ్ కి వచ్చి హిట్ మంచి టాక్ ను తెచ్చుకున్న సీజన్ 1 సక్సెస్ తో ఇప్పుడు సీజన్ స్ట్రీమింగ్ లోకి వచ్చింది. మరి ఈ సీజన్ ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం రండి.

 

కథ :

 

గత సీజన్లో సూరి(ప్రియదర్శి), రూబీ(కల్పిక గణేష్) అలాగే విల్సన్(శశాంక్) ముగ్గురు కూడా తమ స్పోర్ట్స్ బ్యాక్ లో సూరి రైఫిల్ షూట్ లో నేషనల్ ఛాంపియన్ గా విల్సన్ క్రికెట్ ప్లేయర్ నుంచి కోచ్ గా అలాగే రూబీ తన బ్యాడ్మింటన్ నుంచి పెళ్లి వరకు ఎదుర్కొన్న ఇబ్బందులపై కనిపించి ముగుస్తుంది. ఇక ఈ సీజన్లో ఈ ముగ్గురూ కూడా తమ లైఫ్ లో ఎలాంటి స్టెప్స్ తీసుకున్నారు? ప్రొఫిషనల్ గా మరియు వారి పర్సనల్ జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి ఈసారి సరికొత్త ఒడిదుడుకులను అధిగమించారా లేదా అనేవి తెలియాలి అంటే ఈ సిరీస్ ని చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్ :

 

ఈ సీజన్ విషయానికి వస్తే గత సీజన్లో కంటే కాస్త బెటర్ ఇంప్రొవైజేషన్ ని చూస్తామని చెప్పాలి. మొదటగా నిర్మాణ విలువలు చాలా బెటర్ గా ఇందులో కనిపిస్తాయి. మార్చిన కథనానికి తగ్గట్టుగా ఈసారి సీజన్లో లో సెటప్ అంతా మంచి విజువల్స్ తో కనిపిస్తుంది. ఇక నటీనటుల్లో ప్రియదర్శి విషయానికి వస్తే ఈ సారి దర్శి పాత్రకి మరింత స్కోప్ కనిపిస్తుంది.

ఈసారి తనకు సెటిల్ అయిన అథ్లెట్ గా కనిపించి ఆ వేరియేషన్ తో పాటు తాను ఏదైతే కోరుకుంటున్నాడో దాన్ని సంపాదించుకోవడలో తీసుకున్న నిర్ణయాలు, తపన వంటి కీలక ఎమోషన్స్ లో మంచి నటన కనబరిచాడు. అలాగే తనపై తన జాబ్ లో ఉన్నప్పటి కొన్ని సన్నివేశాలు మంచి ఆసక్తికరంగా కూడా అనిపిస్తాయి.

ఇక మరో నటుడు క్రికెటర్ గా కనిపించిన శశాంక్ కూడా ది బెస్ట్ ఇచ్చాడని చెప్పాలి. ప్లేయర్ నుంచి కోచ్ గా మారాక తనకి పెరిగిన భాద్యతలు, కొన్ని ఎమోషనల్ సీన్స్ గాని ముఖ్యంగా తన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ లో కానీ కనిపించిన తన నటన సూపర్బ్ గా ఉందని చెప్పాలి. ఇంకా తన తండ్రితో ఉండే కొన్ని ఎమోషనల్ సీన్స్ అయితే హత్తుకునేలా ఉంటాయి.

ఫైనల్ గా మరో కీలక పాత్ర అయినటువంటి కల్పిక కోసం చెప్పాలి. ఆమెకి డైలాగ్స్ తక్కువే ఉంటాయి కానీ తన నటన అంతా ఆమె కళ్ళతోనే ఇందులో చూపించింది. చూడటానికి చాలా సింపుల్ లుక్స్ తోనే కనిపించినా తన పాత్ర లోని లోతు అందులోని భావాన్ని చాలా చక్కగా ప్రెజెంట్ చేసింది తాను.

అలాగే మిగతా నటీనటులు ధన్య బాలకృష్ణ మరియు నటుడు రవివర్మ కూడా తన స్క్రీన్ స్పేస్ కి తగ్గట్టుగా డీసెంట్ పెర్ఫామెన్స్ అందించారు. ఇంకా ఈ సీజన్లో ఎమోషన్స్ కానీ మొదటి సీజన్లో నుంచి రెండో సీజన్లో కి తీసుకొచ్చిన విధానం కానీ ఆసక్తికరంగా ఆకట్టుకుంటాయి.

 

మైనస్ పాయింట్స్ :

 

అయితే చాలా మట్టుకు మంచి ఎలిమెంట్స్ తోనే ఉన్నా మొదటి సీజన్ తో పోలిస్తే ఏదో ఎలిమెంట్ కాస్త మిస్ అయ్యినట్టు అనిపిస్తుంది. అదే బలమైన ఎమోషన్స్. అవి ఈసారి సీజన్లో అంత ఎక్కువగా కనిపించవు.

అలాగే ఒక్కో పాత్రకి సంబంధించి వారు ఎదుర్కొనే సమస్యలు బాగానే చూపించినా వాటి తాలూకా ఎమోషన్స్ మాత్రం అంత బలంగా అనిపించవు. అలానే ఈసారి సీజన్ చూస్తున్నంతసేపు బానే ఉంటుంది అనిపిస్తుంది కానీ ఇంకా మంచి డ్రామా ఉంటే బాగుండు అనే భావన కలుగజేయక మానదు. అలాగే ఎడింగ్ కూడా ఇంకా బెటర్ గా ఇచ్చి ఉంటే బాగుండేది..

 

సాంకేతిక విభాగం :

 

మొదట్లో చెప్పుకున్నట్టుగానే ఈ సినిమాలో నిర్మాణ విలువలు సాలిడ్ గా కనిపిస్తాయి. ఈ విషయంలో మాత్రం అన్నపూర్ణ స్టూడియోస్ వారు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తీశారు. ఇంకా ఈసారి సీజన్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ సినిమాటోగ్రఫీ గాని చాలా ఇంప్రెసివ్ గా కనిపిస్తాయి. ముఖ్యంగా హైదరాబాద్ లొకేషన్స్ లో చూపించిన విజువల్స్ చాలా నాచురల్ గా ఉన్నాయి. ఇంకా ఎడిటింగ్ కూడా పర్వాలేదు. డైలాగ్స్ అయితే ఈసారి సీజన్లో మరింత ఎఫెక్టివ్ ఆకట్టుకునే విధంగా ఉన్నాయి.

ఇక ఈ సీజన్ దర్శకులు అభిలాష్ రెడ్డి మరియు శ్రవణ్ మాదల విషయానికి వస్తే ఈసారి సీజన్లో తమ పాత్రలను వాటిని ఒక రీతిలో అంచలంచలుగా తీసుకెళ్లిన విధానం ఖచ్చితంగా మెప్పిస్తుంది. అయితే ఈ సీజన్ ముగింపు కానీ ఇంకా కొన్ని ఎమోషన్స్ ని ముందు సీజన్ లోలా తీసుకెళ్లకపోవడం కాస్త డిజప్పాయింట్ చేస్తుంది. అలానే అక్కడక్కడా కథనం కాస్త రొటీన్ గా అనిపించింది. ఇది తప్ప మిగతా అన్గాన్ని వర్గాల్లో వీరి వర్క్ ఇంప్రెసివ్ గా ఉంది.

 

తీర్పు :

 

ఇక ఫైనల్ గా ఈ “లూసర్ సీజన్ 2” గత సీజన్ తో పోలిస్తే బెటర్ విజువల్స్ మరియు నిర్మాణ విలువలతోనే కాకుండా మొదటి సీజన్లోని పాత్రలు వాటిని ఇందులో తీర్చిదిద్దిన విధానం కానీ అలాగే ఆ పాత్రల్లో ప్రియదర్శి, కల్పిక మరియు శశాంక్ లు ప్రామిసింగ్ పెర్ఫామెన్స్ లు డెఫినెట్ గా మరో మంచి ప్లస్ గా నిలిచాయి. అయితే గత సీజన్లోలా సాలిడ్ ఎమోషన్స్ అంతగా ఈసారి కనిపించవు. కానీ అవేమి అంత ప్రభావం చూపించవు. జస్ట్ ఇలా చిన్న ఫ్లాస్ పక్కన పెడితే ఈ డీసెంట్ సిరీస్ ని జీ 5 లో చూసి ఆనందించవచ్చు.

123telugu.com Rating : 3/5

Reviewed by 123telugu Team

Click Here For English Version

సంబంధిత సమాచారం

తాజా వార్తలు