ఓటీటీ సమీక్ష: “మళ్ళీ మొదలైంది” – తెలుగు చిత్రం జీ 5 లో

ఓటీటీ సమీక్ష: “మళ్ళీ మొదలైంది” – తెలుగు చిత్రం జీ 5 లో

Published on Feb 14, 2022 8:53 AM IST
Malli Modalaindi Review In Telugu

విడుదల తేదీ : ఫిబ్రవరి 11, 2022

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

నటీనటులు: సుమంత్, నైనా గంగూలీ, వర్షిణి సౌందరరాజన్, పోసాని కృష్ణ మురళి, పృధ్వి రాజ్, అన్నపూర్ణ, వెన్నెల కిషోర్, సుహాసిని

దర్శకత్వం : టీజీ కీర్తి కుమార్
నిర్మాత: కె రాజశేఖర్ రెడ్డి

సంగీత దర్శకుడు: అనూప్ రూబెన్స్

సినిమాటోగ్రఫీ: శివ జిఆర్‌ఎన్

ఎడిటర్ : ప్రదీప్ ఈ రాఘవ


ప్రస్తుతం థియేట్రికల్ గా సహా ఓటిటి లో కూడా పలు చిత్రాలు డైరెక్ట్ రిలీజ్ అవుతున్నాయి. అలా వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో సుమంత్ హీరోగా నైనా గంగూలీ హీరోయిన్ గా నటించిన చిత్రం “మళ్ళీ మొదలైంది” కూడా ఒకటి. స్ట్రీమింగ్ యాప్ “జీ 5” లో రిలీజ్ అయ్యిన ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం రండి.

కథ :

మరి కథలోకి వచ్చినట్టు అయితే.. విక్రమ్(సుమంత్) కాస్త డిఫరెంట్ వ్యక్తిత్వం కలిగి ఉండే చెఫ్.. తన వృత్తి పట్ల చాలా శ్రద్ధగా ఉండే విక్రమ్ తన ఒక సర్కిల్ లో మాత్రమే ఉండే ప్రవర్తనతో అతడి భార్య నిషా(వర్షిణి సౌందరాజన్) విడాకులు తీసుకుందాం అని ఫిక్స్ అవుతుంది. మరి క్రమంలో ఎంటర్ అయ్యిన లాయర్ పవిత్ర(నైనా గంగూలీ) వీరి విడాకుల విషయంలో హెల్ప్ చేస్తుంది. కానీ ఇక్కడ నుంచి విక్రమ్ పవిత్ర వెంట పడడం స్టార్ట్ చేస్తాడు. మరి ఈ కొత్త కోణం స్టార్ట్ చేసిన విక్రమ్ ఇందులో సక్సెస్ అవుతాడా లేదా? పవిత్ర ప్రేమ కోసం ఏమేం చేసాడు? ఈ ఇద్దరికీ లైఫ్ సెట్ అవుతుందా లేదా అనేది తెలియాలి అంటే ఈ చిత్రాన్ని జీ 5 లో చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

ఈ చిత్రంలో డైరెక్టర్ ఎంచుకున్న ప్లాట్ బాగా అనిపిస్తుంది. దానిని వ్యక్త పరచిన విధానం కూడా బాగుంది. అలాగే సినిమాలో వినిపించే కొన్ని డైలాగ్స్ ఖచ్చితంగా ఇంప్రెస్ చేస్తాయి. అలాగే నటీనటుల్లో సుమంత్ పాత్ర ఆసక్తిగా అనిపిస్తుంది. దానిని తాను మంచి ఈజ్ తో కంప్లీట్ చేసాడు. సింపుల్ లుక్స్ లో కనిపించి ఆ రోల్ కి బాగా సెట్టయ్యాడు. అదే విధంగా దానికి పూర్తి న్యాయం చేకూర్చాడు.

అలాగే హీరోయిన్స్ లో వర్షిణి కి ఈ సినిమాలో మంచి పాత్ర దక్కింది అని చెప్పొచ్చు ఇది వరకు చూసిన వాటిలో ఇది బెటర్ గా అనిపిస్తుంది. అందులో తన బెస్ట్ ని ఆమె ఇచ్చింది. అలాగే మరో హీరోయిన్ నైనా గంగూలీ కూడా ఈ సినిమాలో మంచి నటనతో ఆకట్టుకుంటుంది. తన లుక్స్ గాని సుమంత్ తో సీన్స్ లో గాని ఆమె చూడ్డానికి బాగుంది. ఇంకా సుహాసిని, వెన్నెల కిషోర్ తదితరులు తమ పాత్రలకు న్యాయం చేకూర్చారు.

మైనస్ పాయింట్స్ :

ఈ చిత్రంలో డైరెక్టర్ చెప్పాలి అనుకున్న పాయింట్ బాగానే అనిపిస్తుంది కానీ దానిని ఇంకా బెటర్ గా చూపించి ఉంటే బాగుండేది. విడాకుల తర్వాత కూడా లైఫ్ ఉంటుంది అనే కోణంని ఇంకా బాగా ఎస్టాబ్లిష్ చేసే స్కోప్ ఉన్నా అది ఈ చిత్రంలో అంత బాగా ఎలివేట్ అయ్యినట్టు ఎక్కడా కనిపించదు.

చాలా డల్ గా కథనం సాగుతుంది. అలాగే క్యారక్టరైజేషన్ కూడా సినిమాలో అంత మెప్పించదు. సుహాసిని, మంజుల లాంటి నటులను పెట్టుకొని వారి పాత్రలను సింపుల్ గా పరిమితం చెయ్యడం పెద్దగా ఎమోషన్స్ కూడా చూపించకపోవడంతో సినిమా మరింత పేలవంగా అనిపిస్తుంది.

అలాగే స్క్రీన్ ప్లే కూడా ఏమంత ఆకట్టుకునే విధంగా ఉండదు. అయితే ఇంకో మైనస్ పాయింట్ ఏమిటంటే ఇలాంటి సింపుల్ చిత్రాలకు సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ సంగీతం మంచి ప్లెజెంట్ ఫ్రెష్ గా ఇస్తాడు కానీ అది ఇందులో మిస్ అయ్యింది.

సాంకేతిక వర్గం :

ఈ చిత్రంలో నిర్మాణ విలువలు బాగున్నాయని చెప్పాలి. అలాగే టెక్నికల్ టీం విషయానికి వస్తే ఓవరాల్ గా అనూప్ సంగీతం ఓకే అనిపిస్తుంది. అలాగే శివకుమార్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ ఇంకా బెటర్ చెయ్యాల్సింది.

ఇక దర్శకుడు కీర్తి కుమార్ విషయానికి వస్తే తాను మంచి పాయింట్ నే పట్టుకున్నా దానిని పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా చూపించడంలో సక్సెస్ కాలేకపోయారు. క్యారక్టరైజేషన్ ని మరింత ఆసక్తిగా డిజైన్ చేసి మంచి ఎమోషన్స్ ని జోడించి ఉంటే బాగుండేది. అలాగే స్క్రీన్ ప్లే పై కూడా మరింత దృష్టి పెట్టి ఉంటే బాగున్ను.

తీర్పు :

ఇక మొత్తంగా చూసుకున్నట్టయతే.. “మళ్ళీ మొదలైంది” అని వచ్చిన ఈ చిత్రం ‘మళ్ళీ రావా’ లాంటి మ్యాజిక్ ని రిపీట్ చేస్తుందేమో అనుకుంటే పొరపాటే అవుతుంది అని చెప్పాలి. మెయిన్ లీడ్ ల పెర్ఫామెన్స్ లు తప్పితే పెద్దగా ఆకట్టుకునే అంశాలు ఈ సినిమాలో కనిపించవు. ఓవరాల్ గా అయితే బిలో యావరేజ్ ఎక్స్ పీరియన్స్ నే ఈ చిత్రం అందిస్తుంది.

 

123telugu.com Rating : 2.25/5

Reviewed by 123telugu Team

 

Click Here For English Version

సంబంధిత సమాచారం

తాజా వార్తలు