సమీక్ష : మిస్సింగ్ – అక్కడక్కడ మెప్పించే సస్పెన్స్ థ్రిల్లర్

సమీక్ష : మిస్సింగ్ – అక్కడక్కడ మెప్పించే సస్పెన్స్ థ్రిల్లర్

Published on Nov 20, 2021 3:04 AM IST
Missing Movie Review In Telugu

విడుదల తేదీ : నవంబర్ 19, 2021

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు: హర్ష నర్రా, నికీషా రంగ్వాలా, మిషా నారంగ్, రామ్ దత్, చత్రపతి శేఖర్ తదితరులు

దర్శకత్వం : శ్రీని జోస్యుల

నిర్మాతలు: భాస్కర్ జోస్యుల, లక్ష్మీ శేషగిరిరావు నర్రా

సంగీత దర్శకుడు: అజయ్ అరసాడ
సినిమాటోగ్రఫీ: జనా. డి
ఎడిటింగ్: సత్య జి


హర్ష నర్రా, నికీషా రంగ్వాలా, మిషా నారంగ్ ప్రధాన పాత్రల్లో శ్రీని జోస్యుల దర్శకత్వంలో తెరకెక్కిన సస్పెన్స్ థ్రిల్లర్ “మిస్సింగ్” నేడు థియేటర్లలో రిలీజ్ అయ్యింది. మరీ ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం రండి.

కథ:

గౌతమ్(హర్ష నర్రా)‌, శృతి(నికిషా) ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. అయితే ఒకరోజు వీరిద్దరు కారులో ప్రయాణిస్తుండగా సడెన్‌గా వారి కారుకి యాక్సిడెంట్‌ అవుతుంది. గౌతమ్‌ ఆసుపత్రిలో చేరతాడు. కానీ శృతి మిస్ అవుతుంది? ఆసుపత్రిలో కోలుకున్నాక ఈ విషయం తెలుసుకున్న గౌతమ్‌ శృతి కోసం వెతకడం ప్రారంభిస్తారు. ఇది యాక్సిడెంట్ కాదు కిడ్నాప్ అని తెలుసుకున్న గౌతమ్‌ శృతిని కనిపెట్టేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేస్తాడు? అసలు శృతిని ఎవరు కిడ్నాప్ చేస్తారు? శృతి కిడ్నాప్‌కి గౌతమ్‌ కి మధ్య ఎలాంటి సంబంధం ఉంటుంది? అనేదే మిగిలిన సినిమా కథ.

ప్లస్ పాయింట్స్:

హీరో హర్ష విషయానికి వస్తే ఈ సినిమాలో అతడి పాత్ర బలమైనది. కొత్తవాడైనప్పటికీ ఒకింత పర్వాలేదనిపించాడు. హీరోయిన్లలో నికిషా, మిషా నారంగ్‌ పర్వాలేదనిపించగా, ఏసీపీ త్యాగి పాత్రలో రామ్ దత్, సీఐ పాత్రలో ఛత్రపతి శేఖర్ ఆకట్టుకొన్నారు.

దర్శకుడు శ్రీని జోస్యుల రాసుకున్న కథ సినిమాకు ప్రధాన బలం అని చెప్పాలి. ట్విస్టులు, ఇంటర్వెల్ బ్యాంగ్ చాలా బాగున్నాయి. ఈ సినిమాకు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, సినిమాటోగ్రప్గీ ప్రధాన బలమని చెప్పాలి.

మైనస్ పాయింట్స్:

ఈ సినిమాలో హర్ష నర్రా తన పాత్రకు సరైన న్యాయం చేయలేకపోయాడనే చెప్పాలి. డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్ బాగున్నా ఎమోషన్ పలికించడంలో అతడి నటన సహజంగా అనిపించలేదు.

దర్శకుడు శ్రీని జోస్యుల కథను బాగానే రాసుకున్నాడు కానీ కథను స్క్రీన్‌పై చూపించిన విధానం కాస్త గజిబిజీగా అనిపిస్తుంది. అతడికి ఇది తొలి చిత్రం కావడంతో ఆ అనుభవ లేమి స్పష్టంగా కనిపించింది. ఇక ఎమోషనల్ రోల్స్‌లో నూతన నటీనటుల నుంచి సరైన ఫెర్ఫార్మెన్స్‌ను రాబట్టుకోలేకపోయాడు.

సాంకేతిక విబ్గాగం:

కథలో ఎక్కువగా ట్విస్ట్‌లు పెట్టి ప్రేక్షకుడిని థ్రిల్‌కి గురి చేయాలనుకునే ప్రయత్నం దర్శకుడు చేశాడు కానీ అది కథని డీవియేట్‌ చేసినట్టు ఉండటంతో అది కాస్త కన్‌ఫ్యూజన్‌ని క్రియేట్ చేశాయి. మధ్య మధ్యలో ఫ్లాష్‌బ్యాక్‌లు బాగున్నాయి.

అయితే థ్రిల్లర్‌కు సరిపోయే విధంగా అజయ్ అరసాడ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. జనా డీ సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంది. ఎడిటర్‌ సత్య మరికాస్త శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

తీర్పు:

ఇక మొత్తంగా చూసుకున్నట్టైతే ఫ్యామిలీ ఎమోషన్స్‌, లవ్, క్రైమ్ అంశాలతో తెరకెక్కించిన సస్పెన్స్ థ్రిల్లర్ “మిస్పింగ్”లో ట్విస్టులు ఒకే అనిపించినా అవి మరీ ఎక్కువవ్వడంతో ప్రేక్షకుడిని కన్‌ఫ్యూజన్‌కి గురిచేస్తాయి. అయితే సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలను కోరుకునే ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చే అవకాశం ఉంది కానీ మిగతా వర్గాల ప్రేక్షకులను మాత్రం పెద్దగా ఆకట్టుకోదనే చెప్పాలి.

123telugu.com Rating : 2.5/5

Reviewed by 123telugu Team

 

Click Here For English Version

సంబంధిత సమాచారం

తాజా వార్తలు