సమీక్ష : మోసగాళ్లు – అక్కడక్కడా థ్రిల్ చేస్తుంది

Mosagallu movie review

విడుదల తేదీ : మార్చి 19, 2021

123తెలుగు.కామ్ రేటింగ్ :  2.75/5

నటీనటులు : విష్ణు మంచు, కాజల్ అగర్వాల్, సునీల్ శెట్టి, నవదీప్, రుహి సింగ్, నవీన్ చంద్ర

దర్శకత్వం : జెఫ్రీ గీ చిన్

నిర్మాత‌లు : విష్ణు మంచు

సంగీతం : సామ్ సి ఎస్

సినిమాటోగ్రఫీ : షెల్డన్ చౌ

మంచు విష్ణు హీరోగా కాజల్ అగర్వాల్ మరో ప్రధాన పాత్రలో హాలీవుడ్ ఫిల్మ్ మేకర్ జెఫ్రీ గీ చిన్ దర్శకత్వంలో తెరకెక్కించిన భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ చిత్రం “మోసగాళ్లు”. వరల్డ్స్ బిగ్గెస్ట్ స్కామ్ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని కంటెంట్ పైన నమ్మకంతో సాహసోపేత విడుదలతో మేకర్స్ ఈరోజు ముందుకు వచ్చారు. మరి ఈ చిత్రం ఎంత మేర ఆకట్టుకుందో ఇప్పుడు సమీక్షలో తెలుసుకుందాం..

కథ :

ఈ సినిమా కథ నిజ జీవితంలో జరిగిన ప్రపంచపు అతి పెద్ద స్కామ్ ఆధారంగా తెరకెక్కిన సంగతి తెలిసిందే. మరి ఈ సినిమా ప్రకారం కథలోకి వెళ్లినట్టు అయితే చిన్నప్పటి నుంచే పేదరికం నుంచి వచ్చిన అర్జున్(మంచు విష్ణు) మరియు అను(కాజల్ అగర్వాల్) లు తమ జీవితాలపై పెద్ద కలలు కంటూ ఉంటారు. మరి అలా ఎదిగాక అర్జున్ ఒక పర్ఫెక్ట్ కాల్ సెంటర్ ఎగ్జిక్యూటివ్ గానూ అలాగే అను అకౌంటెంట్ గా మారుతారు. మరి ఇక్కడ వీరికి అర్జున్ బాస్ సందీప్ రెడ్డి(నవదీప్) నుంచి ఒక భారీ స్కామ్ ప్లాన్ కోసం చర్చ వస్తుంది. అది కూడా అమెరికన్స్ మీదనే చెయ్యాలని గట్టి ప్లాన్ గీస్తారు. మరి ఇక్కడ నుంచి వీళ్ళ భారీ స్కామ్ 300 మిలియన్ డాలర్ల స్కామ్ గా ఎలా మారుతుంది? వీళ్ళని అడ్డుకునేది ఎవరు? అగ్ర రాజ్యం అమెరికా ఏం చేసింది? వీళ్ళని అడ్డుకుంటారా లేదా అసలు చివరికి ఏమయ్యింది అన్న ప్రశ్నలకు సమాధానం తెలియాలి అంటే ఈ చిత్రాన్ని వెండితెర మీద చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్ :

బేసిక్ గా ఇలాంటి చిత్రాలకు ప్రధాన బలమే కథా కథనాలు పైగా ఇటీవల కాలంలో స్కామ్స్ పై ఎంటర్టైన్మెంట్ వీక్షకుల్లో కూడా మంచి ఆసక్తి నెలకొంది అది ఈ సినిమాకు మంచి ప్లస్ అని చెప్పొచ్చు. మరి ఇది కూడా నిజ జీవితంలో జరిగిన భారీ స్కామ్ కావడం దాని చుట్టూతా తిరిగే నరేషన్ ఈ చిత్రంలో ఆసక్తికరంగా సాగుతుంది. అలాగే ఈ స్కామ్ కోసం తెలియని ఆడియెన్స్ కు అయితే ఈ చిత్రం మరింత థ్రిల్ ను ఇస్తుంది.

ఇక అలాగే అక్కా తమ్ముల్లుగా చేసిన మంచు విష్ణు మరియు కాజల్ లు మంచి నటన కనబరిచారు. ఎవరూ తక్కువ కాకుండా తమ రోల్స్ లో సూపర్బ్ అండ్ సెటిల్డ్ నటనను వీరు కనబరిచారు. మరి అలాగే మరో కీలక పాత్రలో కనిపించిన నవదీప్ తన ఇంటెన్స్ రోల్ తో షాక్ చేస్తాడు. అతని మేకోవర్ కానీ నటన కానీ ఇంప్రెసివ్ గా ఉంటాయి. ఇక మరో యంగ్ అండ్ టాలెంటెడ్ నటుడు నవీన్ చంద్ర తన అగ్రెసివ్ రోల్ లో ఆకట్టుకుంటాడు అలాగే బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి తన రోల్ మేర మంచి నటన కనబరిచారు.

మైనస్ పాయింట్స్ :

ఇక ఈ సినిమాలో మైనస్ పాయింట్స్ కు వస్తే ఇవి కాస్త ఎక్కువే కనిపిస్తాయి. ఇలాంటి నిజ జీవిత సంఘటనల ఆధారంగా సినిమా తీసేటప్పుడు డీటెయిల్స్ చాలా అవసరం ఎంత కన్వీనెంట్ గా క్లియర్ గా నరేషన్ ఉంటే సినిమా తాలూకా ఇంపాక్ట్ చాలా బాగుంటుంది కానీ మేకర్స్ అలాంటివి అంతగా చూపించినట్టు అనిపించదు.

మరి అలాగే మెయిన్ లీడ్ లో కనిపించే విష్ణు మరియు కాజల్ లు చేసిన రోల్స్ ను చూపించే ప్రయత్నంలో అనేక లాజిక్స్ మిస్సవుతాయి వీటితో పాటుగా క్లైమాక్స్ కూడా ఇంకా క్లారిటీగా ఇచ్చి ఉంటే బాగుండేది. అలాగే సునీల్ శెట్టి లాంటి నటులు సహా మిగతా కొందరు నటీనటులు ఈ సినిమాకు అంతగా ఇంపాక్ట్ కలిగించని భావన ఈ సినిమా చూసినంతసేపు కలుగుతుంది.

ఆ రోల్స్ ను ఇంకా స్ట్రాంగ్ గా చూపించి ఉంటే బాగుండేది. ఇక ఫైనల్ గా యూ ఎస్ లోని ఫెడరల్ ట్రేడ్ కమిషన్(ఎఫ్ టి సి), ‘ఎఫ్ బి ఐ’ లాంటి సంస్థల తో చేయించే ఇన్వెస్టిగేషన్ ఎపిసోడ్స్ కూడా అంత రియలిస్టిక్ గా అనిపించవు. మరో మాట సినిమా మొత్తంలో చెప్పుకోదగ్గ స్థాయి ఎమోషన్స్ కూడా అంతగా ఉండవు.

సాంకేతిక వర్గం :

ఈ చిత్రానికి ఈ సినిమా హీరో మంచు విష్ణు 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ వారితో కలిసి నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే. నిర్మాణ పరంగా మాత్రం వారు ఎక్కడా రాజీ పడినట్టు అనిపించదు మంచి రిచ్ గానే సినిమా అంతా కనిపిస్తుంది. అలాగే సామ్ సీఎస్ ఇచ్చిన సంగీతం కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఈ సినిమాకు ప్రధాన పాత్ర పోషించాయి. అలాగే ఎడిటింగ్ ఇంకా బెటర్ గా ఉంటే బాగుండేది. షెల్డన్ చౌ సినిమాటోగ్రఫీ కూడా ఇంప్రెసివ్ గా అనిపిస్తుంది.

ఇక దర్శకుడు జెఫ్రీ గీ చిన్ విషయానికి వస్తే ఇదొక ట్రూ స్టోరీ కాబట్టి ఆ స్కామ్ రిలేటెడ్ అంశాలను బాగా చూపించగలిగారు గాని కానీ డీటెయిల్స్ మరియు లాజిక్స్ ను చాలానే మిస్ చేశారు అలాగే స్క్రీన్ ప్లే కూడా ఇంకా ఆసక్తికరంగా మలచి ఉంటే బాగుండేది. మెయిన్ లీడ్ క్యాస్ట్ తప్పితే ఇతర ప్రధాన పాత్రల్లో నటించిన వారికి మరింత స్కోప్ ఇచ్చి ఉంటే బాగుండేది. ఓవరాల్ గా తన విషయంలో మాత్రం ఇంకా సులభమైన నరేషన్ ఇచ్చి ఉంటే సినిమా ఖచ్చితంగా మరో లెవెల్ లో ఉండేది.

తీర్పు :

ఇక ఫైనల్ గా చూసుకున్నట్టయితే నిజ జీవితంలో జరిగినటువంటి వరల్డ్స్ బిగ్గెస్ట్ స్కామ్ ఆధారంగా తెరకెక్కిన ఈ “మోసగాళ్లు” పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేరని చెప్పాలి. మెయిన్ లీడ్ లలో కనిపించిన విష్ణు మరియు కాజల్ సహా నవదీప్ లు ప్రామిసింగ్ పెర్ఫామెన్స్ తో ఆకట్టుకుంటారు. అలాగే ఈ స్కాం అనే అంశం ఒకింత థ్రిల్ గా జనరల్ ఆడియెన్స్ కు కొత్తగా అనిపించినా సరైన నరేషన్ లేకపోవడం డీటెయిల్స్ సరైన ఎమోషన్స్ వంటివి మిస్సవ్వడం నిరాశ పరుస్తాయి. మరి ఇవి పక్కన పెడితే ఈ స్కామ్ డ్రామా జస్ట్ ఓకే అనిపిస్తుంది.

123telugu.com Rating :  2.75/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం :